లోక్‌సభ సచివాలయం
కుటుంబ సమేతంగా పార్లమెంటును సందర్శించిన యూకే మాజీ ప్రధాని శ్రీ రిషి సునాక్
శ్రీ సునాక్ కుటుంబానికి స్వాగతం పలికిన లోక్‌సభ సెక్రటరీ జనరల్
Posted On:
18 FEB 2025 6:32PM by PIB Hyderabad
యునైటెడ్ కింగ్‌డమ్ మాజీ ప్రధానమంత్రి శ్రీ రిషి సునాక్ తన భార్య శ్రీమతి అక్షతా మూర్తి, కుమార్తెలు కృష్ణ, అనౌష్కలతో కలసి ఈ రోజు పార్లమెంటును సందర్శించారు. వారి వెంట రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి సుధామూర్తి ఉన్నారు.
శ్రీ సునాక్ కుటుంబానికి లోక్‌సభ సెక్రటరీ జనరల్ శ్రీ ఉత్పల్ కుమార్ సింగ్ స్వాగతం పలికారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ శ్రీ పీసీ మోడీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సునాక్ కుటుంబం పార్లమెంటు హౌస్ కాంప్లెక్సులో గ్యాలరీలు, ఛాంబర్లు, కాన్సిస్టిట్యూషన్ హాల్, సంవిధాన్ సదన్ లను సందర్శించారు. భవన నిర్మాణ శైలిని ప్రశంసించారు.
భారత్ పర్యటనలో భాగంగా శ్రీ సునాక్ పార్లమెంటును సందర్శించారు. కొన్ని రోజుల క్రితం ఫిబ్రవరి 15న ఆయన తన కుటుంబంతో కలిసి తాజ్ మహల్ సందర్శించారు.
(Release ID: 2104545)