సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

టెక్ ట్రయంఫ్ శ్రేణిలో 3వ సీజన్ ప్రారంభం.. వేవ్స్, ఐఈఐసీ, విన్‌జోల వెన్నుదన్ను.. భారత్ గేమింగ్ నవకల్పనలను ప్రపంచ వేదికలపై ప్రదర్శించడం లక్ష్యం


* దేశంలోనే అతి పెద్ద గేమింగ్ పోటీ .. టెక్ ట్రయంఫ్ సీజన్ 3లో గెలిస్తే మార్చి 17-21 మధ్య శాన్ ఫ్రాన్సిస్కో‌లో గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌ (జీడీసీ)లో పాల్గొనవచ్చు.. మీ ప్రతిభను జీడీసీలో చాటవచ్చు

* వేవ్స్ అందిస్తోంది మీకొక సువర్ణావకాశం.. మీ నమూనాను ఫిబ్రవరి 20 కల్లా దాఖలు చేయండి.. త్వరలో ముగియనున్న
రిజిస్ట్రేషన్లు.. ఈ అవకాశాన్ని చేజార్చుకోకండి

Posted On: 15 FEB 2025 5:32PM by PIB Hyderabad

గేమింగ్ పరిశ్రమలో కెరియర్‌ను మలచుకోవాలన్న కోరిక మీకుంది, కానీ సరైన వేదిక ఏదీ లేక, నిధుల లోటుతో ఇబ్బందులు పడుతున్నారా? అయితే, వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమిట్  (వేవ్స్) ఆధ్వర్యంలో ది టెక్ ట్రయంఫ్ 3వ సీజనులో పాల్గొని మీ ప్రతిభను చాటుకోవడానికి ఒక అసాధారణ అవకాశాన్ని అందుకోండి. మీరు కోరుకుంటే భారత్‌లోనే లేదా విదేశాల్లో అయినా సరే, మీ ప్రతిభను నిరూపించుకోవచ్చు. దేశీయంగా, లేదా అంతర్జాతీయంగా.. ఈ చాలెంజ్‌లో పాల్గొనడానికి దరఖాస్తులు పంపడానికి చివరి తేదీని ఫిబ్రవరి 20 వరకు పొడిగించారు.

దేశంలో అతి పెద్ద గేమింగ్ పోటీలో విజేతలుగా నిలిచేవారికి శాన్ ఫ్రాన్సిస్కోలో మార్చి 17 నుంచి 21 వరకు నిర్వహించనున్న గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (జీడీసీ) 2025లో, ఆ తరువాత భారత్‌లో వేవ్స్ పూర్తి స్థాయిలో స్పాన్సర్ చేసే వేదికలో తమ ఉత్పాదననూ, ఐపీ (మేధోసంపత్తి)నీ, టెక్నాలజీనీ ప్రదర్శించేందుకు అవకాశాలు లభిస్తాయి.

image.png

టెక్ ట్రయంఫ్ ప్రోగ్రాం

ది టెక్ ట్రయంఫ్ ప్రోగ్రాం (టీటీపీ)  Tech Triumph Program   ని ఇంటరాక్టివ్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్నొవేషన్ కౌన్సిల్ (ఐఈఐసీ) కేంద్ర సమాచార, ప్రసార శాఖ భాగస్వామ్యంతో ప్రారంభించింది. ఇది క్రియేట్ ఇన్ ఇండియా చాలెంజ్ సీజన్ - 1  ( Create in India Challenge Season - 1 )    లో భాగంగా ఉంది.

  వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్  సమిట్   (WAVES)    కన్నా ముందే, ఈ చాలెంజ్.. గేమింగ్ రంగంలో భారత్‌కున్న ప్రతిభను అంతర్జాతీయ వేదికలోనూ, గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్-2025 లో ఏర్పాటు చేసే ఇండియా పెవిలియన్‌లోనూ గుర్తించనుంది. ఆ ప్రతిభను సత్కరించి, ప్రదర్శనావకాశాన్ని సైతం కల్పించనుంది.

ఇప్పటికే 1,000 కి పైగా రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యాయి. మరోవైపు భారత్‌లో గేమింగుకు సంబంధించిన విస్తారిత అనుబంధ వ్యవస్థ టెక్ ట్రయంఫ్ సీజన్ 3 ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునకు నోచుకొన్న ‘మేడ్ ఇన్ ఇండియా’ టెక్నాలజీ పరిశ్రమ కోసం దేశ మహత్వాకాంక్షల్ని ముందుకు తీసుకుపోతూ, అంతర్జాతీయ రంగస్థలంపైన తప్పక గుర్తుపెట్టుకోదగ్గ ప్రభావాన్ని ప్రసరింపచేయడానికి  నడుం బిగించనుంది.

ఈ కార్యక్రమాన్ని గేమింగ్ టెక్నాలజీ, మేధో సంపత్తి (ఐపీ) రంగాల్లో ప్రపంచంలో ఒక మహత్తర శక్తిగా ఎదగాలన్న భారత్ దార్శనికత స్ఫూర్తికి అనుగుణంగా రూపొందించారు. ఏవీజీసీ, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్) రంగాల్లో భారత్ సాధించిన వృద్ధి దీనికి ఊతాన్నందిస్తోంది. ఈ రంగాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రస్తుతం గణనీయంగా తోడ్పాటును ఇస్తున్నాయి. భారత మీడియా రంగంలో డిజిటల్, ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో అత్యంత అధిక వృద్ది చోటు చేసుకొందని ఫిక్కీ-ఈవై నివేదిక పేర్కొంది.

మరింత సమాచారాన్ని
   https://www.thetechtriumph.com/  లో చూడవచ్చు.

పోటీలో వివిధ దశలు

1. 2025 ఫిబ్రవరి 20 - గేమ్‌ను దాఖలు చేయడం;
పోటీ పడటానికి నమోదును పూర్తి చేయండి.
2. 2025 ఫిబ్రవరి 23 - నిపుణులతో మూల్యాంకనం;
ఎంపికైన అభ్యర్థులు న్యాయనిర్ణేతల మండలి ఎదుట వారి ప్రజెంటేషనును వివరిస్తారు.
3. 2025 ఫిబ్రవరి 28 - తుది ఘట్టం;
ఫలితాలను ప్రకటిస్తారు.
4. 2025 మార్చి 5 - ఈవెంటుకు సన్నాహాలు;
ప్రపంచ స్థాయిలో ప్రదర్శననివ్వడానికి మాతో కలిసి సన్నద్ధులు కండి.

అర్హత ప్రమాణాలివీ..
ఇంటరాక్టివ్ వినోద రంగ విస్తారిత అనుబంధ వ్యవస్థలో పాత్రధారులైన సంస్థలు లేదా వ్యక్తులు అందరికీ దీనిలో పాల్గొనేందుకు అవకాశం ఉంది. దీని పరిధిలోకి పీసీ, కన్సోల్, మొబైల్ ఆధారిత గేములతోపాటు గేమింగుకు సంబంధించిన టెక్నాలజీల డెవలపర్లు, స్టూడియోలు, అంకుర సంస్థలు, టెక్ కంపెనీలు వస్తాయి. పోటీపడాలనుకునే వారు, తమ నమూనాను అభివృద్ధి పరిచే ప్రక్రియలో ఏ దశలో ఉన్నవారైనా కావచ్చు.. అయితే వారి వద్ద కనీసం ఆచరణసాధ్య నమూనా ఒక్కటైనా తప్పక ఉండాలి.

గేమింగ్ స్టూడియోలు, ఈస్పోర్ట్స్(Esports) - వ్యక్తిగత డెవలపర్లు, స్టూడియో, గేమ్ (పీసీ, మొబైల్, కన్సోల్) ను తయారు చేసే ఇండీ (Indie) స్టార్టప్‌లు, ఈస్పోర్ట్స్ లో ప్రమేయం కలిగి ఉన్న సంస్థలు, వీటిలో ఈవెంట్ ప్రొడక్షన్, టేలెంట్ మేనేజ్‌‌మెంట్, ఈస్పోర్ట్స్ క్లబ్ కేటగిరీలతోపాటు ఈస్పోర్ట్స్ ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా భాగం పంచుకోవచ్చు

గేమింగ్ వ్యాపారం - గేమింగ్ కంపెనీలకు వాటి ముఖ్య విధుల (ఉదాహరణకు: చెల్లింపులు, భద్రత, లైవ్ యాప్‌లు, పంపిణీ, మానిటైజేషన్, స్థానికీకరణ, నాణ్యత విషయంలో హామీ, చట్టపరమైన సేవలు, ఆర్థిక సేవలు తదితరాల) నిర్వహణకు అవసరమైన సొల్యూషన్లను తయారుచేసే వ్యాపార సంస్థలు.

పాల్గొనడం ఎలాగంటే:

ఒకటో దశ: గేమ్‌ను దాఖలు చేయడం- పోటీకి సంబంధించిన ఆధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న పోటీ తాలూకు దరఖాస్తు ఫారాన్ని నింపి మీ గేమును దాఖలు చేయడం ద్వారా మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి.

రెండో దశ: నిపుణులతో మూల్యాంకనం-  మా నిపుణుల మండలి దాఖలైన అన్ని ఫారాలను శ్రద్ధాసక్తులతో సమీక్షిస్తుంది. మెరుగైన ఎంట్రీలను పిచింగ్ రౌండుకు తాత్కాలికంగా ఎంపిక చేస్తుంది. దీని తరువాత, విశిష్ట న్యాయనిర్ణేతల సంఘం తుది ఫలితాల్ని ప్రకటిస్తుంది.

మూడో దశ: ఈవెంట్‌లో పాల్గొనడానికి సన్నాహాలు-  విజేతల పేర్లను ప్రకటించడంతోనే, మా నిర్వాహకులు వారితో సంప్రదింపులు మొదలుపెడతారు. విజేతలను వారి వారి ఆవిష్కరణలను ప్రముఖంగా ప్రదర్శించడానికి సిద్ధం చేయడంంలో తమ మార్గదర్శకత్వాన్ని అందించి, సాయపడతారు.

image.png

టెక్ ట్రయంఫ్‌కు చెందిన వివిధ సీజన్లను గురించిన వివరాలు:

అగ్రగామి గేమింగ్, ఇంటరాక్టివ్ వినోద ప్రధాన ఆవిష్కర్తలను గుర్తించి, వారిని శక్తిమంతులుగా తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన ఒక పోటీయే ‘టెక్ ట్రయంఫ్’.

ది టెక్ ట్రయంఫ్ (టీటీటీ) శ్రేణిలో భారత్ 3వ సీజను

ఆవిష్కర్తలకు ప్రపంచ వేదికల్లో తమ నమూనాలను ప్రదర్శించేందుకు అవకాశాలను ఇచ్చి టెక్ జగతిలో ప్రపంచ రంగస్థలంలో భారత్ ఒక అగ్రగామిగా ఎదిగేటట్టు చేయాలన్నదే టీటీటీ భారత్ మూడో సీజను ఉద్దేశం. పోటీల్లో పాల్గొనేవారికి వారి టెక్నాలజీలను ప్రపంచ రంగస్థలంపైన ప్రదర్శించడానికి ఒక వేదికను సమకూరుస్తూ, అత్యాధునిక నవకల్పనలను ప్రోత్సహించడంపై టీటీటీ తన దృష్టిని కేంద్రీకరిస్తోంది.  

టెక్ ట్రయంఫ్ శ్రేణిలో భారత్ 2వ సీజను

టెక్ ట్రయంఫ్ శ్రేణిలో భారత్ రెండో సీజను డెవలపర్లకు బ్రెజిల్‌లోని సావో పావులోలో నిర్వహించిన గేమ్స్‌కామ్ లాటమ్ 2024 లో ఇండియా పెవిలియన్‌ను కొలువుదీర్చి వృద్ధిలోకి వస్తున్న భారత్ గేమింగ్ అనుబంధ విస్తారిత వ్యవస్థ నిదర్శనాల్లో కొన్నింటిని అక్కడ ప్రదర్శించేందుకు ఒక వేదికను కల్పించింది.

టెక్ ట్రయంఫ్ శ్రేణిలో భారత్ 1వ సీజను

భారత్ టెక్ ట్రయంఫ్ ఒకటో సీజను వింజో, ఐజీడీసీల  సహకారంతో సాగింది. ఇది డెవలపర్లకు భారత్‌కు చెందిన వర్ధిల్లుతున్న గేమింగ్ ప్రతిభాపాటవాల్ని అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన జీడీసీ 2024లో ఆవిష్కరించేందుకు అవకాశాన్ని ఇచ్చింది.

టీటీపీ విజేతలు  ప్రపంచ వేదికలపై మెరుస్తారు

గత సంచికల్లో వింజో,ఐఈఐసీలు టీటీపీ విజేతలకు జీడీసీ 2024 (ఇండియా పెవిలియన్)లోనూ, జర్మనీ, బ్రెజిల్‌లలో ను నిర్వహించిన గేమ్స్‌కామ్‌లోనూ, బ్రెజిల్ గేమింగ్ షో వంటి ప్రతిష్ఠాత్మక ప్రపంచ స్థాయి ఈవెంట్‌లలో తమ గేమ్స్‌ను ప్రదర్శించేందుకు అవకాశాల్ని ఇచ్చాయి. పోటీలలో పాలుపంచుకొన్న వారికి- పారిశ్రామిక జగతికి చెందిన ప్రముఖులు, ప్రభుత్వంలోని ప్రముఖుల మార్గదర్శకత్వంలో- అంతర్జాతీయ వేదికలపై మేరిసే అవకాశాలు లభించాయి.  మార్గదర్శకత్వాన్ని అందించిన వారిలో కేంద్ర ప్రభుత్వ పూర్వ కార్యదర్శి శ్రీ రోహిత్ కుమార్ సింగ్, బ్రెజిల్ లో భారత రాయబారి శ్రీ సురేశ్ కె. రెడ్డి, ఇన్ఫో  ఎడ్జ్ సహ వ్యవస్థాపకుడు శ్రీ సంజీవ్ భీక్‌చందానీ,  కలారి కేపిటల్ ఎం‌డీ శ్రీ రాజేశ్ రాజు ఉన్నారు.  

ఏమిటి ఈ గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (జీడీసీ)?

గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (జీడీసీ) మనమంతా ఇష్టపడే గేమ్స్‌ను రూపొందించే డెవలపర్లకు ప్రపంచంలోనే ఒక ప్రధానమైన ఈవెంట్. సృజనశీలత్వానికి, నవకల్పనలకు, శ్రేష్ఠత్వానికి ఇది సరైన గమ్యస్థానం.

గత ముప్ఫై సంవత్సరాలుగా వేల మంది డెవలపర్లకు నేర్చుకొనేందుకు, ముందుకు పోయేందుకు, ఒకరితో మరొకరు కలిసేందుకు అవకాశాన్ని జీడీసీ ఇచ్చింది. మీరు గేమ్ డెవలపర్ కావచ్చు, ప్రముఖ పారిశ్రామికవేత్త కావచ్చు, లేదా మీ పరిధిని విస్తరింపచేసుకోవడానికి గాని లేదా మీ సామర్థ్యాన్ని రుజువుచేసుకోవడానికి గాని దూసుకుపోతున్న అగ్రగామి కంపెనీ కావచ్చు.. జీడీసీ మీకొక మేలైన వేదికగా ఉంటుంది.  


 

***


(Release ID: 2103993) Visitor Counter : 15