సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సింఫనీ ఆఫ్ ఇండియా చాలెంజ్ 2025: వేవ్స్ ఆధ్వర్యంలోని సంగీత ప్రతిభ, ఆవిష్కరణల వేదిక


వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమిట్ లో ప్రదర్శన ఇవ్వనున్న తొలి 3 స్థానాల్లో నిలిచిన జట్లు

Posted On: 13 FEB 2025 6:53PM by PIB Hyderabad

వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమిట్ (వేవ్స్) ఆధ్వర్యంలో నిర్వహించే ప్రధాన సంగీత కార్యక్రమం సింఫనీ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ కోసం దేశంలోని అత్యుత్తమ సంగీత కళాకారులు వారి అద్భుత ప్రతిభను ప్రదర్శించేందుకు వేదిక సిద్ధమైంది. ఈ సవాలు కోసం పేరు నమోదు చేసుకున్న 212మంది సంగీత కళాకారుల నుంచి అత్యంత కఠినమైన ఎంపిక ప్రక్రియ ద్వారా గ్రాండ్ గాలా రౌండ్‌లో పోటీపడే 80మంది అత్యుత్తమ శాస్త్రీయ, జానపద కళాకారులను ఎంపిక చేశారు.    

సోలో ప్రదర్శనతో ప్రారంభించి, ఆపై వారిని నలుగురు సభ్యులు గల బృందాలుగా, ఆపై ఎనిమిది మంది సభ్యులు గల బృందాలుగా, అలాగే చివరగా అసలైన సంగీతాన్ని సృష్టించడం, పాత జానపదాలకు పునఃసృష్టి చేయడం ద్వారా సంపూర్ణ సంగీత ప్రతిభా పాటవాల సింఫనీని సృష్టించగల 10మంది సంగీత కళాకారుల బృందాలుగా విలీనం చేస్తారు. ఈ కళాకారుల బృందాల నుంచి తొలి మూడు స్థానాల్లో నిలిచిన బృందాలను మెగా సింఫనీగా ఏర్పాటు చేసి, ప్రతిష్టాత్మక వేవ్స్ వేదికపై ప్రదర్శన ఇచ్చే అద్భుత అవకాశం కల్పిస్తారు. ఈ సిరీస్‌లో విజేతలైన మూడు జట్లు కేవలం పోటీపడటమే కాకుండా, ఔత్సాహికులైన ప్రేక్షకుల ముందు వారి కొత్త శైలులు, జానర్స్, అలాగే సంగీత ప్రతిభను ప్రదర్శించే గొప్ప అవకాశాన్ని సొంతం చేసుకుంటారు.

వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమిట్ (వేవ్స్) కోసం భారత సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించిన ‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ – సీజన్ 1’ లో భాగమైన 25 సవాళ్లలో సింఫనీ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ఒకటి. దీని గురించి మరింత సమాచారం  https://pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2047812 లో లభ్యమవుతుంది.

సింఫనీ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ దీనిలో పాల్గొనే వారికి విభిన్న, విస్తృత ప్రేక్షకుల ఎదుట తమ సంగీత ప్రతిభను ప్రదర్శించే అమూల్యమైన అవకాశాన్ని కల్పించడం ద్వారా, వారు ఈ రంగంలో వారి కెరీర్ సమర్థంగా ప్రారంభించడానికి అలాగే సంగీత, వినోద రంగంలో ప్రత్యేక గుర్తింపును సాధించడానికి వీలు కలుగుతుంది.

కళాకారులు వివిధ జానర్‌లలో ప్రదర్శించే వైవిధ్యమైన సంగీత ప్రదర్శనల ద్వారా సంగీతాభిమానులకు అద్భుతమైన అనుభవానికి హామీ ఇస్తూ, ఈ కార్యక్రమం వివిధ రకాల సంగీతాన్ని ఇష్టపడే ప్రేక్షకుల కోసం చక్కటి సంగీత విందును అందిస్తుంది.

సమాజం, ఆవిష్కరణ, అలాగే అభివృద్ధి భావనను పెంపొందిస్తూ ఈ సింఫనీ ఆఫ్ ఇండియా కార్యక్రమం సృజనాత్మకత, సంగీతాల సరిహద్దులను విస్తరిస్తుంది. యువ ప్రతిభను ప్రోత్సహించడం అలాగే సంగీతాభిమానులకు తాజా సంగీతపు అనుభవాలను అందించడానికి  వేవ్స్ ఒక చక్కటి వేదిక అవుతుంది.

మహావీర్ జైన్ ఫిల్మ్స్‌తో కలిసి దూరదర్శన్ ఈ ఛాలెంజ్‌ను రూపొందిస్తూండగా, షో దర్శకత్వంలో అనుభవజ్ఞులైన  శ్రుతి అనిందిత వర్మ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుత ప్రతిభావంతులైన గౌరవ్ దుబే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఈ ఛాలెంజ్‌ కోసం పద్మశ్రీ సోమ ఘోష్, గాయని శ్రుతి పాఠక్ అలాగే జానపద గాయని స్వరూప్ ఖాన్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులు గడించిన భారతీయ విద్వాంసులు పెర్కుషనిస్ట్ తౌఫిక్ ఖురేషి, వేణుగాన విద్వాంసులు పద్మశ్రీ రోను మజుందార్, వయోలిన్ విద్వాంసులు సునీతా భుయాన్ ఈ ఛాలెంజ్‌ కోసం మార్గదర్శనం చేస్తుండగా, పెర్కుషినిస్ట్ పండిట్ దినేష్, శ్రీ తన్మోయ్ బోస్, లెస్లీ లూయిస్ అలాగే వేణుగాన విద్వాంసులు రాకేష్ చౌరాసియా ఈ సిరీస్ కోసం న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు.  

సింఫనీ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ త్వరలో దూరదర్శన్‌లో ప్రసారం కానుంది. మరింత సమాచారం కోసం అలాగే ఈ కార్యక్రమం గురించిన అప్‌డేట్స్ కోసం నమోదు చేసుకోవడానికి, వేవ్స్ అధికారిక వెబ్‌సైట్ www.wavesindia.org ను సందర్శించండి.

వేవ్స్ గురించి:

వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమిట్ (వేవ్స్) ప్రారంభ ఎడిషన్ మే 1 నుంచి 4వ తేదీ వరకు ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రసార, డిజిటల్ మీడియా, ప్రకటనలు, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, ఇ-స్పోర్ట్స్, సంగీత రంగాల్లో ప్రావీణ్యాన్ని పరిచయం చేయడానికి  ఒక ప్రధాన ప్రపంచ స్థాయి వేదికగా వేవ్స్‌ను రూపొందించింది. మీడియా, వినోద రంగాల్లో పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్ ను నిలిపేందుకు వేవ్స్ 2025 సరికొత్త రూపుతో రానుంది.

 

***


(Release ID: 2103000) Visitor Counter : 25