ప్రధాన మంత్రి కార్యాలయం
కృత్రిమ మేధలో భారత్ గొప్ప ప్రగతిని సాధిస్తూ నూతన సాంకేతికతను ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తోంది: ప్రధానమంత్రి
భారత్ లో పెట్టుబడులు పెట్టమని, తిరుగులేని దేశ యువశక్తిపై
నమ్మకం ఉంచమని ప్రపంచానికి విజ్ఞప్తి చేస్తున్నాం: ప్రధాని
प्रविष्टि तिथि:
12 FEB 2025 2:02PM by PIB Hyderabad
కృత్రిమ మేధలో భారత్ గణనీయమైన ప్రగతిని సాధిస్తూ నూతన సాంకేతికతను ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తోందన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ... భారత్ లో పెట్టుబడులు పెట్టాలనీ, తిరుగులేని దేశ యువశక్తి పై నమ్మకం ఉంచమని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు.
గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థల సీఈఓ శ్రీ సుందర్ పిచెయ్ తో సమావేశం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని, సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ పై శ్రీ పిచెయ్ చేసిన పోస్టుకు ఇలా స్పందించారు:
“@sundarpichai మిమ్మల్ని కలిసినందుకు ఆనందిస్తున్నాను. ఎఐ రంగంలో భారత్ గొప్ప ప్రగతిని సాధిస్తూ నూతన సాంకేతికతను ప్రజా సంక్షేమానికై వినియోగిస్తోంది. మా దేశంలో పెట్టుబడులు పెట్టాలనీ, మా యువశక్తిపై నమ్మకం ఉంచాలనీ ప్రపంచ దేశాలకి విజ్ఞప్తి చేస్తున్నాం!”
*****
MJPS/SR
(रिलीज़ आईडी: 2102340)
आगंतुक पटल : 59
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam