సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహాకుంభ్ 2025: వసంత పంచమి నాటి అమృత స్నానం ముగియడంతో ప్రయాగ్‌రాజ్ లోని గంగా మండపంలో ఫిబ్రవరి 7 నుంచి 10 వరకు ఘనంగా సాంస్క‌ృతిక ఉత్సవం

Posted On: 06 FEB 2025 8:08PM by PIB Hyderabad

ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్‌ సందర్భంగా గంగా మండపంలో ఒక వైభవోపేత సాంస్క‌తిక ఉత్సవాన్ని  సాంస్కృతిక  మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తోంది. ఈ ఉత్సవంలో భాగంగా దేశంలోని ప్రముఖ కళాకారులు ఫిబ్రవరి 7 మొదలు 10 వరకు తమ సంగీత, నృత్య, కళారూపాల్ని ప్రదర్శిస్తూ భక్తజనాన్ని మంత్రముగ్ధుల్ని చేయనున్నారు.

ఈ కార్యక్రమాల్లో 7వ తేదీన ప్రముఖ కళాకారిణి డోనా గంగూలీ, 8న ప్రముఖ గాయని కవితా కృష్ణమూర్తి, సంగీతకారుడు డాక్టర్ ఎల్. సుబ్రమణ్యం, 9న సురేశ్ వాడ్కర్, సోనల్ మాన్‌సింగ్, 10న ప్రముఖ గాయకుడు హరిహరన్‌ల కళాప్రదర్శనలు ముఖ్య ఆకర్షణలు కానున్నాయి.

దీనికి తోడు, వివిధ భారతీయ శాస్త్రీయ నృత్య, సంగీత సంప్రదాయాలకు చెందిన ప్రముఖ కళాకారులు మహాకుంభ్ లో సాయంత్ర సమయాల్ని సంగీత భరితంగా, వైభవోపేతంగా మార్చేయనున్నారు.

గంగా మండపంలో నిర్వహించే కార్యక్రమాలు :

ఫిబ్రవరి 7న:

డోనా గంగూలీ (కోల్‌కతా) - ఒడిస్సీ నృత్యం

యోగేశ్ గంధర్వ్, ఆభా గంధర్వ్ - సూఫీ గానం

సుమ సుధీంద్ర (కర్నాటక) - కర్నాటక సంగీతం

డాక్టర్ దేవకీ నందన్ శర్మ (మథుర) -  రాసలీల

ఫిబ్రవరి 8న:

కవితా కృష్ణమూర్తి, డాక్టర్ ఎల్. సుబ్రమణ్యం -  లలిత సంగీతం

ప్రీతి పటేల్ (కోల్‌కతా) - మణిపురి నృత్యం

నరేంద్ర నాథ్ (పశ్చిమ బెంగాల్) - సరోద్ వాదన

డాక్టర్ దేవకీ నందన్ శర్మ (మథుర) -  రాసలీల

ఫిబ్రవరి 9న:

సురేశ్ వాడ్కర్ -  లలిత సంగీతం

పద్మ శ్రీ మధుప్ ముద్గల్  (న్యూ ఢిల్లీ) -  హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం

సోనల్ మాన్‌సింగ్ (న్యూ ఢిల్లీ) - ఒడిసీ నృత్యం
 
డాక్టర్ దేవకీ నందన్ శర్మ (మథుర) -  రాసలీల

ఫిబ్రవరి 10న:

హరిహరన్ -  లలిత సంగీతం

శుభద వరాడ్కర్ (ముంబయి) - ఒడిసీ నృత్యం

సుధ (తమిళ నాడు) - కర్నాటక సంగీతం  

మహాకుంభ్ ఒక్క భక్తి, విశ్వాసాల మహాపర్వం మాత్రమే కాదు, ఇది భారతీయ సంస్క‌ృతి, సంగీతం, నృత్యం, సాహిత్యాల పరంగా ఒక ప్రపంచ వేదికగా కూడా తనదైన గుర్తింపును తెచ్చుకొంటోంది. గంగా మండపంలో ఏర్పాటు చేసిన  భారత సుసంపన్న సాంస్కృతిక సంప్రదాయాల్ని సరికొత్త జవసత్వాలతో ఆవిష్కరించనున్నాయి. దీంతో భక్తులు ఈ వైభవోపేత ఉత్సవాన్ని ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా.. ఈ రెండు రూపాల్లోనూ కనులారా తిలకించనున్నారు.


 

***


(Release ID: 2100585) Visitor Counter : 23