రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

గణతంత్ర దినోత్సవ పరేడ్ 2025.. అత్యుత్తమ కవాతుదళాల, శకటాల ఫలితాలు

प्रविष्टि तिथि: 29 JAN 2025 12:57PM by PIB Hyderabad

గణతంత్ర దినోత్సవ పరేడ్ 2025 లో అత్యుత్తమంగా నిలిచిన కవాతుదళాలశకటాల వివరాలను ప్రకటించారుత్రివిధ దళాలుకేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్-సీఏపీఎఫ్), ఇతర అనుబంధ బలగాలకు చెందిన కవాతు దళాలతోపాటు రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన శకటాలుకేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలువిభాగాల శకటాల ప్రదర్శనను అంచనా వేసేందుకు న్యాయనిర్ణేతలతో కూడిన మూడు మండళ్లను ఏర్పాటు చేశారు.ఫలితాలు ఇలా ఉన్నాయి:
 

• సర్వీసెస్ కేటగిరీలో అత్యుత్తమ మార్చింగ్ కంటింజెంట్ జమ్మూకాశ్మీర్ రైఫిల్స్ కంటింజెంట్
• సీఏపీఎఫ్ఇతర సహాయక బలగాలలో అత్యుత్తమ మార్చింగ్ కంటింజెంట్ ఢిల్లీ పోలీస్ మార్చింగ్ కంటింజెంట్
• అగ్రగామి మూడు శకటాలు (రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు)
•  
ఒకటో స్థానం ఉత్తరప్రదేశ్ (మహాకుంభ్ 2025 - స్వర్ణిమ్ భారత్విరాసత్ అవుర్ వికాస్.
 •  
రెండో స్థానం త్రిపుర (ఇటర్నల్ రివరెన్స్త్రిపురలో 14 దేవీ దేవతల ఆరాధన ఖర్చీ పూజ)
•  
మూడో స్థానం ఆంధ్ర ప్రదేశ్ (ఏటికొప్పాక బొమ్మలు పర్యావరణ అనుకూల చెక్క బొమ్మలు)
కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల కేటగిరీలో అత్యుత్తమ శకటం:
గిరిజన వ్యవహారాల శాఖ (జన్‌జాతీయ గౌరవ్ వర్ష్)
ప్రత్యేక బహుమతి:
i.        
కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీభారత రాజ్యాంగానికి 75 సంవత్సరాలు.
ii.        ‘జయతి జయ మమ భారతం’ నాట్య బృందం


దీనికి అదనంగాపౌరులు వారు ఇష్టపడ్డ శకటానికికవాతు చేసిన కవాతు దళాలకు ‘పాప్యులర్ చాయిస్’ కేటగిరీలో ఓటు వేయాల్సిందిగా సూచిస్తూ  ఈ నెల 26 నుంచి 28 తేదీల మధ్య ఆన్‌లైన్ మాధ్యమంలో మైగవ్ (MyGov) పోర్టల్‌ ద్వారా ఒక పోల్‌ను నిర్వహించారుఈ ఎన్నిక ఫలితాలు ఈ కింది విధంగా ఉన్నాయి:


త్రివిధ దళాల్లో అత్యుత్తమ మార్చింగ్ కంటింజెంట్సిగ్నల్స్ కంటింజెంట్
సీఏపీఎఫ్ఇతర సహాయక బలగాలలో అత్యుత్తమ మార్చింగ్ కంటింజెంట్ సీఆర్‌పీఎఫ్ మార్చింగ్ కంటింజెంట్
అగ్రగామి మూడు శకటాలు (రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు)
• 
ఒకటో స్థానం గుజరాత్ (స్వర్ణిమ్ భారత్విరాసత్ అవుర్ వికాస్).. అంటే బంగారు భారత్.
• 
రెండో స్థానం ఉత్తరప్రదేశ్ (మహాకుంభ్ 2025 - స్వర్ణిమ్ భారత్విరాసత్ అవుర్ వికాస్)
• 
మూడో స్థానం ఉత్తరాఖండ్  (ఉత్తరాఖండ్కల్చరల్ హెరిటేజ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్)
 

కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల కేటగిరీలో అత్యుత్తమ శకటం మహిళలుబాలల వికాస శాఖ (ఈ మంత్రిత్వ శాఖ అమలుచేస్తున్న అనేక పథకాల్లో భాగంగా పోషణను పొందిన మహిళలుబాలల బహుముఖ పురోగతి)

 

***


(रिलीज़ आईडी: 2097315) आगंतुक पटल : 171
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , Bengali , English , Urdu , हिन्दी , Marathi , Gujarati