ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో 38వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 28 JAN 2025 9:36PM by PIB Hyderabad

భారతమాతచిరకాలం వర్ధిల్లు!!

దేవభూమి ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మీత్ సింగ్యువ ముఖ్యమంత్రి పుష్కర్ ధామినా మంత్రివర్గ సహచరులు అజయ్ తమ్తారక్షా ఖడ్సేఉత్తరాఖండ్ అసెంబ్లీ స్పీకర్ రీతూ ఖండూరిక్రీడల మంత్రి రేఖా ఆర్యకామన్వెల్త్ గేమ్స్ అధ్యక్షుడు క్రిస్ జెంకిన్స్ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉషాఎంపీ మహేంద్ర భట్దేశం నలుమూలల నుంచి జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులుఇతర ప్రముఖులారా!

నేడు దేవభూమి యువశక్తితో మరింత దివ్యంగా మారిందిబాబా కేదార్ నాథ్బద్రీనాథ్గంగామాత ఆశీస్సులతో జాతీయ క్రీడలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయిఈ ఏడాది ఉత్తరాఖండ్ ఏర్పడి 25 ఏళ్లు పూర్తయ్యాయిఈ యువ రాష్ట్రంలో దేశం నలుమూలల నుంచి వేలాది మంది యువత తమ సత్తా చాటబోతున్నారుఎంతో అందమైన ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ చిత్రం ఇక్కడ కనిపిస్తుందిఈసారి కూడా అనేక స్వదేశీ సంప్రదాయ క్రీడలను జాతీయ క్రీడల్లో చేర్చారుఈసారి జాతీయ క్రీడలు ఒక రకంగా హరిత క్రీడలు కూడాఇందులో పర్యావరణ హితమైన వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారుజాతీయ క్రీడల్లో అందుకునే పతకాలుట్రోఫీలన్నీ కూడా ‘ఇ-వ్యర్థాల‘తో తయారైనవేపతకాలు సాధించిన క్రీడాకారుల పేరిట ఇక్కడ మొక్కలను కూడా నాటనున్నారుఇది చాలా మంచి కార్యక్రమంఅత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ఆశిస్తూ ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలుఈ అద్భుతమైన క్రీడోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి పుష్కర్ ధామికివారి బృందానికిఉత్తరాఖండ్ లోని ప్రతి పౌరుడికి నా అభినందనలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

పరీక్షించిన తరువాత బంగారం స్వచ్ఛంగా మారుతుందని మనం తరచుగా వింటుంటాంఆటగాళ్ల సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకునేందుకు వీలుగా మరిన్ని అవకాశాలను కల్పిస్తున్నాంప్రస్తుతం ఏడాది పొడవునా అనేక టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారుఖేలో ఇండియా సిరీస్ కు అనేక కొత్త టోర్నమెంట్లు జోడించారుఖేలో ఇండియా యువజన క్రీడల కారణంగా యువ ఆటగాళ్లకు ముందుకు సాగే అవకాశం లభించిందియూనివర్శిటీ గేమ్స్ విశ్వవిద్యాలయ విద్యార్థులకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయిఖేలో ఇండియా పారా గేమ్స్ ద్వారా పారా అథ్లెట్ల ప్రదర్శన కొత్త పుంతలు తొక్కుతోందికొద్ది రోజుల క్రితమే లద్దాఖ్ లో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఐదో ఎడిషన్ ప్రారంభమైందిగత ఏడాదే బీచ్ గేమ్స్ కూడా నిర్వహించాం.

మిత్రులారా,

ఇదంతా ప్రభుత్వం మాత్రమే చేస్తోందని కాదునేడు వందలాది మంది బీజేపీ ఎంపీలు తమ ప్రాంతాల్లో ఎంపీ క్రీడాపోటీలు నిర్వహించి కొత్త ప్రతిభను ముందుకు తెస్తున్నారునేను కూడా కాశీ నుంచి ఎంపీనేనేను నా పార్లమెంటరీ నియోజకవర్గం గురించి మాత్రమే మాట్లాడితేప్రతి సంవత్సరం ఎంపీ క్రీడా పోటీలోకాశీ పార్లమెంటరీ నియోజకవర్గంలో సుమారు 2.5 లక్షల మంది యువకులు ఆడటానికిఅభివృద్ధి చెందడానికి అవకాశం పొందుతున్నారుఅలా దేశంలో ఒక అందమైన క్రీడా గుచ్చాన్ని తయారు చేశాం... ఇందులో ప్రతి రుతువులో పువ్వులు వికసిస్తాయిటోర్నమెంట్లు నిరంతరం జరుగుతాయి

మిత్రులారా,

భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి మేం క్రీడలను ప్రధాన మాధ్యమంగా భావిస్తున్నాంఒక దేశం క్రీడల్లో పురోగతి సాధిస్తే ఆ దేశ విశ్వసనీయత కూడా పెరుగుతుందిఆ దేశ ప్రతిష్ఠ కూడా పెరుగుతుందిఅందువల్ల నేడు క్రీడలను భారతదేశ అభివృద్ధితో అనుసంధానించాందీన్ని భారత యువత ఆత్మవిశ్వాసంతో ముడిపెడుతున్నాంనేడుభారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగే దిశగా కదులుతోందిఈ ప్రయాణంలో  క్రీడలకు ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర ఉండాలని మా అభిలాషమీకు తెలుసా... ఏదైనా క్రీడలో కేవలం ఆటగాడు మాత్రమే ఆడడు... దాని వెనుక మొత్తం వ్యవస్థ ఉంటుందికోచ్‌లుశిక్షకులుపోషకాహారంఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టే వారువైద్యులుసాధన సామగ్రి—ఇవన్నీ కలిసి క్రీడా ప్రపంచాన్ని నిర్మిస్తాయిఅంటేఇందులో సేవా రంగంతో పాటు తయారీ రంగానికీ విస్తృత అవకాశాలు ఉన్నాయిప్రపంచవ్యాప్తంగా ఆటగాళ్లు ఉపయోగించే వివిధ క్రీడా సామగ్రిని భారతదేశం నాణ్యతా ప్రమాణాలతో తయారు చేసే కేంద్రంగా మారుతోందిఇక్కడి నుంచి చాలా దేశాలకు సరఫరా జరుగుతోందిమీరట్ ఇక్కడి నుంచి ఎక్కువ దూరంలో లేదుఅక్కడ 35 వేలకుపైగా చిన్నా పెద్ద కర్మాగారాలు క్రీడా సామగ్రిని తయారు చేస్తున్నాయిఅందులో మూడు లక్షలకు పైగా ప్రజలు పని చేస్తున్నారుఈరోజుదేశం ఇలాంటి క్రీడా వ్యవస్థలను ప్రతి మూలలో నిర్మించేందుకు కృషి చేస్తోంది.

మిత్రులారా,

కొంతకాలం క్రితం ఢిల్లీలోని నా నివాసంలో ఒలింపిక్ జట్టును కలిసే అవకాశం వచ్చిందిసంభాషణలోఒక స్నేహితుడు  నా విషయంలో ‘ప్రధానమంత్రి‘ కి కొత్త నిర్వచనం ఇచ్చాడుదేశ క్రీడాకారులు తనను పీఎంగానో లేదా ప్రధానిగానో భావించడం లేదని, ‘పరమ మిత్ర‘ గా భావిస్తారని అన్నారుమీ ఈ నమ్మకం నాకు అపారమైన శక్తిని ఇస్తుందిమీ అందరి పైనామీ ప్రతిభసామర్థ్యాల పైనా నాకు పూర్తి నమ్మకం ఉందిమీ సామర్థ్యాలను పెంచడానికిమీ ఆటను మెరుగుపరచడానికి మేం మా వంతు ప్రయత్నం చేస్తున్నాంగత 10 సంవత్సరాలుగామీ ప్రతిభకు మద్దతు ఇవ్వడంపై మేము నిరంతరం దృష్టి పెట్టాంపదేళ్ల కిందట ఉన్న క్రీడా బడ్జెట్ నేడు మూడు రెట్లు పెరిగిందిటాప్స్ స్కీమ్ కింద దేశంలోని డజన్ల కొద్దీ క్రీడాకారులపై వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారుఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు.  నేడు పాఠశాలల్లో కూడా క్రీడలను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చారుదేశంలోనే తొలి స్పోర్ట్స్ యూనివర్శిటీని మణిపూర్ లో నిర్మిస్తున్నారు.

మిత్రులారా,

ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాల ఫలితాలను క్షేత్రస్థాయిలో చూస్తున్నాంపతకాల పట్టికలో ఇది కనిపిస్తోందినేడు భారత ఆటగాళ్లు ప్రతి అంతర్జాతీయ ఈవెంట్ లో మన జెండాను ఎగురవేస్తున్నారుఒలింపిక్స్పారాలింపిక్స్ లో మన క్రీడాకారులు అద్భుతంగా రాణించారుఉత్తరాఖండ్ కు చెందిన పలువురు క్రీడాకారులు కూడా పతకాలు సాధించారుమిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ రోజు చాలా మంది పతక విజేతలు ఈ వేదికకు రావడం నాకు సంతోషంగా ఉంది.

మిత్రులారా,

హాకీకి పూర్వ వైభవం  రోజులు తిరిగి వస్తున్నాయికొద్ది రోజుల కిందటే మన ఖోఖో జట్టు ప్రపంచ కప్ గెలుచుకుందిప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ టైటిల్ ను మన గుకేష్ గెలుచుకోవడంతో ప్రపంచం ఆశ్చర్యపోయిందికోనేరు హంపి మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిందిఈ విజయాలు భారతదేశంలో క్రీడలు ఇప్పుడు కేవలం పాఠ్యేతర కార్యకలాపం మాత్రమే గాక మన యువతకు  ప్రధాన వృత్తి అవకాశంగా మారుతున్నాయనడానికి ఒక స్పష్టమైన సంకేతం.

మిత్రులారా,

మన ఆటగాళ్లు ఎల్లప్పుడూ పెద్ద లక్ష్యాలతో ముందుకు సాగుతున్నట్లేమన దేశం కూడా పెద్ద సంకల్పాలతో ముందుకు సాగుతోంది. 2036 ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందేభారత్ లో ఒలింపిక్స్ నిర్వహిస్తే అది భారత క్రీడలను కొత్త శిఖరాలకు తీసుకువెళ్లడం ఖాయంఒలింపిక్స్ అనేది కేవలం ఆటకు సంబంధించిన ఈవెంట్ మాత్రమే కాదుప్రపంచంలో ఏ దేశంలో ఒలింపిక్స్ జరిగినా అనేక రంగాలకు ఊతం లభిస్తుందిఒలింపిక్స్ కోసం నిర్మించిన క్రీడా మౌలిక సదుపాయాలు కూడా ఉద్యోగావకాశాలను సృష్టిస్తాయిభవిష్యత్తులో ఆటగాళ్లకు మెరుగైన సదుపాయాలు లభిస్తాయిఒలింపిక్స్ జరిగే నగరంలో  కనెక్టివిటీ కోసం నిర్మించే కొత్త మౌలిక సదుపాయాలు నిర్మాణ సంబంధిత పరిశ్రమను బలోపేతం చేస్తాయిరవాణా రంగం కూడా పురోగమిస్తుందిదేశ పర్యాటక రంగానికి అతిపెద్ద ప్రయోజనం చేకూరుతుందిఅనేక కొత్త హోటళ్లు  ఏర్పాటవుతాయిఒలింపిక్స్ లో పాల్గొనడానికి,  చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వస్తారుదీని వల్ల దేశం మొత్తం ప్రయోజనం పొందుతుంది.ఇదే విధంగాదేవభూమి ఉత్తరాఖండ్ లో జాతీయ క్రీడలను నిర్వహిస్తున్నారువీటిలో ఆడేందుకువీటిని చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చేవారు  ఉత్తరాఖండ్‌లోని ఇతర ప్రాంతాలను కూడా సందర్శిస్తారుదీని అర్థం... క్రీడోత్సవాలు  కేవలం ఆటగాళ్లకు మాత్రమే ప్రయోజనం కాదువాటి వల్ల ఇతర అనేక రంగాల ఆర్థిక వృద్ధి కూడా జరుగుతుంది.

మిత్రులారా!

ప్రస్తుత 21వ శతాబ్దాన్ని ప్రపంచం మొత్తం భారత శతాబ్దంగా అభివర్ణిస్తోందిఈ నేపథ్యంలో కేదారనాథుని దర్శనానంతరం ‘ఈ దశాబ్దం ఉత్తరాఖండ్‌ దశాబ్దం’ అనే మాట నా హృదయపు లోతుల నుంచి అసంకల్పితంగా బయల్పడిందిఈ రాష్ట్రం ప్రగతి పథాన శరవేగంగా పయనించడం నాకెంతో సంతోషంగా ఉందిఈ క్రమంలో ఉత్తరాఖండ్‌ నిన్న దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి)ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా రికార్డులకెక్కిందిఈ స్మృతిని నేను తరచూ లౌకిక పౌరస్మృతిగా వ్యవహరిస్తుంటానుఎందుకంటేమన కుమార్తెలుతల్లులుసోదరీమణుల గౌరవప్రద జీవనానికి ఇదే ప్రాతిపదికప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేయడంతోపాటు రాజ్యాంగ స్ఫూర్తిని ఉమ్మడి పౌరస్మృతి పటిష్ఠం చేస్తుందిఈ రోజు నేనిక్కడ క్రీడోత్సవంలో పాలు పంచుకుంటున్న నేపథ్యంలో దీనితో మీరు కూడా అనుసంధానం అయినట్లు భావిస్తున్నానుముఖ్యంగా క్రీడాస్ఫూర్తి మనను వివక్ష భావనకు దూరంగా ఉంచుతుందిప్రతి విజయానికిప్రతి పతక సాధనకు సమష్టి కృషే (సబ్‌కా ప్రయాస్‌తారకమంత్రంక్రీడలు మనలో జట్టు స్ఫూర్తిని నింపుతాయి... అదేవిధంగా ఉమ్మడి పౌరస్మృతి కూడా మనకు అదే ప్రేరణనిస్తుందిఅది ఏ ఒక్కరిపైనా వివక్ష చూపదు... అందరూ సమానమేఈ చరిత్రాత్మక ముందడుగుపై ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వానికి నా అభినందనలు.

మిత్రులారా!

ఉత్తరాఖండ్‌లో తొలిసారి ఇంత భారీ జాతీయ కార్యక్రమం నిర్వహించడం నిజంగా విశేషందీనివల్ల రాష్ట్రంలో మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయి కాబట్టి యువతరానికి చేతినిండా పని దొరుకుతుందిమరోవైపు ఉత్తరాఖండ్ ప్రగతికి మరిన్ని కొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఎంతయినా ఉందిరాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇకమీదట చార్‌ధామ్‌ యాత్రలపై మాత్రమే ఆధారపడరాదుప్రభుత్వం ఇక్కడ సౌకర్యాలు పెంచుతూ యాత్రలపై ప్రజాకర్షణ పెరిగేందుకు నిరంతం చర్యలు తీసుకుంటోందిఅందువల్లనే ప్రతి సీజన్‌లోనూ భక్తుల సంఖ్య కొత్త రికార్డులు సృష్టిస్తోందికానీఇది ఎంతమాత్రం సరిపోదు.. శీతాకాలంలోనూ ఆధ్యాత్మిక యాత్రలను ప్రోత్సహించడం కూడా ముఖ్యంఈ దిశగా ప్రభుత్వం కొన్ని సరికొత్త చర్యలు చేపట్టడం హర్షణీయం.

మిత్రులారా!

   ఒక విధంగా ఉత్తరాఖండ్ నా రెండో నివాసంఆ మేరకు శీతాకాల యాత్రలో భాగస్వామిని కావాలని నేనూ ఆకాంక్షిస్తున్నానుచలికాలంలో ఉత్తరాఖండ్‌ హిమ సోయగాన్ని తప్పక ఆస్వాదించాలని దేశ యువతకు సూచిస్తున్నానుఆ సమయంలో భక్తుల సంఖ్య అంతగా ఉండదు కాబట్టిమీరిక్కడ సాహస క్రీడల్లోఇతర సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశాలు అధికంమీరంతా క్రీడాకారులు కాబట్టిఈ జాతీయ క్రీడల అనంతరం వాటి గురించి తప్పకుండా తెలుసుకోండివీలైతే మరికొన్ని రోజులు ఈ దేవభూమి ఆతిథ్యం స్వీకరించే ప్రయత్నం చేయండి.

మిత్రులారా!

   దేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మీరంతా సంబంధిత క్రీడల్లో హోరాహోరీ తలపడతారుఅనేక జాతీయ రికార్డులు బద్దలు కావడమే కాకుండా కొత్త రికార్డులు నమోదవుతాయిమీరు సంపూర్ణ సామర్థ్యంతో మీ ప్రతిభాపాటవాలను 100 శాతం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తారుఈ సందర్భంగా మీకందరికీ నాదొక విజ్ఞప్తిఈ జాతీయ క్రీడోత్సవం కేవలం ఆటలపోటీలకు పరిమితం కాదుఇది ‘ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్‌’కు ఓ బలమైన వేదిక కూడాభారత వైవిధ్యంపై మనమంతా గర్వించే సందర్భంమీ పతకాలు దేశ ఐక్యతఘనతను చాటేవిగా చూసుకోవాలిఅందులో భాగంగా వివిధ రాష్ట్రాల భాషలుఆహారంఆటపాటలుసంగీతం వగైరాలపై అవగాహనతో మీరంతా ఇక్కడి నుంచి విజ్ఞానవంతులుగా తిరిగి వెళ్లాలిఅలాగే పరిశుభ్రత విషయంలో మీకు నా మనవి... దేవభూమి వాస్తవ్యులైన ప్రజానీకం కృషితో ఉత్తరాఖండ్ ప్లాస్టిక్ రహితంగా రూపాంతరం చెందడానికి ప్రయత్నిస్తోందిఆ విధంగా ముందడుగు వేస్తున్న ప్లాస్టిక్ రహిత ఉత్తరాఖండ్ సంకల్పం సాకారం కావాలంటే మీ అందరి తోడ్పాటు అవశ్యంకాబట్టిఈ పరిశుభ్రత కార్యక్రమం విజయంలో మీ వంతుగా సహకరించండి.

మిత్రులారా!

   శరీర దారుఢ్యం ఎంత కీలకమో మీకు తెలియనిది కాదుఈ నేపథ్యంలో నేనివాళ మనం ఎదుర్కొంటున్న ఓ ముఖ్యమైన సమస్యను ప్రస్తావిస్తున్నానుదేశంలో ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతున్నదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయివయసుతో నిమిత్తం లేకుండా అందరూ దీనిబారిన పడుతుండటం సహజంగానే తీవ్ర ఆందోళనకర అంశంఎందుకంటేఊబకాయం వల్ల మధుమేహంగుండె జబ్బులు వంటి ముప్పు పెరుగుతుందిఇలాంటి పరిస్థితికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా సుదృఢ భారత్‌ (ఫిట్ ఇండియాఉద్యమానికి శ్రీకారం చుట్టాంతద్వారా నేడు దేశం దారుఢ్యంఆరోగ్యకర జీవనశైలి గురించి తెలుసుకుంటుండటం నాకెంతో సంతృప్తినిస్తోందిఇక ప్రస్తుత జాతీయ క్రీడలు శారీరక శ్రమక్రమశిక్షణసమతుల జీవనం ఆవశ్యకతను మనకు తేటతెల్లం చేస్తాయిఈ సందర్భంగా దేశ ప్రజలకు రెండు విషయాలను కచ్చితంగా వివరించాలని భావిస్తున్నానుఇవి రెండూ వ్యాయామం-ఆహారంతో ముడిపడినవిఆ మేరకు నిత్యం కొంత సమయం తప్పనిసరిగా వ్యాయామానికి కేటాయించండినడక నుంచి వివిధ కసరత్తుల రూపంలో శారీరక శ్రమకు సాధ్యమైనంత ప్రాధాన్యం ఇవ్వండిరెండోది... ఆహారంపై నిశితంగా దృష్టి సారించాలిఅది సమతులమైనదే కాకుండా పౌష్ఠికంగానూ ఉండాలన్న వాస్తవం మరువకండి.

   మరొక ముఖ్యమైన విషయం... మీ ఆహారంలో అనారోగ్యకర కొవ్వులునూనెలను తగ్గించండిసాధారణంగా మనం నెల మొదట్లో కిరాణ సరకులు తెచ్చుకుంటుంటాంఅందులో భాగంగా మీరు ప్రతి నెలా రెండు లీటర్ల వంట నూనె తెస్తున్నట్లయితేఅందులో కనీసం 10 శాతం మేర వాడకం తగ్గించండిస్థూలకాయం నివారణకు దిశగా ఇలాంటి కొన్ని మార్గాలను మనం అనుసరించాలిఈ విధంగా చిన్నచిన్న జాగ్రత్తలతో మీ ఆరోగ్యంలో గణనీయ మార్పు కనిపిస్తుందిమన పెద్దల జీవనశైలి ఇలాంటిదే... తాజా పండ్లుకూరగాయలు సహా సహజ పదార్థాలుసమతుల ఆహారానికి వారు ప్రాధాన్యమిచ్చేవారుఆరోగ్యకర దేహమే ఆరోగ్యకర మేధకు నిలయంభారత్‌ ఆరోగ్యకర దేశంగా రూపొందాలంటే ఈ సూత్రం సదా అనుసరణీయంకాబట్టి దీనిపై అవగాహన పెంచడానికి కృషి చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలుపాఠశాలలుకార్యాలయాలుసామాజిక ఉద్యమకారులను కూడా కోరుతున్నానుముఖ్యంగా క్రీడాకారులందరికీ దీనిపై స్వీయానుభవం ఉంటుందితదనుగుణంగా సమతుల పోషకాహారం గురించి సమాచారాన్ని నిరంతరం ప్రజలతో పంచుకోవాలని మీకు నా విజ్ఞప్తిఈ పిలుపుతో మనమంతా సమష్టిగా ‘సుదృఢ భారత్‌’ను సృష్టిద్దాం కదలి రండి!

మిత్రులారా!

   జాతీయ క్రీడలను ప్రారంభించడం నా బాధ్యతే అయినప్పటికీఈ రోజు మిమ్మల్నందర్నీ ఇందులో భాగస్వాములను చేయాలని భావిస్తున్నానుఈ మేరకు క్రీడా సంరంభం ఆరంభానికి చిహ్నంగా మీరంతా మీ మొబైల్‌ ఫ్లాష్ లైట్లను ఆన్ చేయండిప్రతి ఒక్కరూ... మొబైల్ ఫ్లాష్ లైట్లను ఆన్ చేయాలిభేష్‌... ఇప్పుడు మీ అందరితో సంయుక్తంగా నేను ఈ 38వ జాతీయ క్రీడలు ప్రారంభమైనట్లు ప్రకటిస్తున్నానుమీకందరికీ మరోసారి నా శుభాకాంక్షలు.

ధన్యవాదాలు!

గమనికప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది సమీప స్వేచ్ఛానువాదం.

 

***


(Release ID: 2097312) Visitor Counter : 16