సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహాకుంభనగర్ లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ డిజిటల్ ప్రదర్శనకు సందర్శకుల తాకిడి

Posted On: 26 JAN 2025 10:30PM by PIB Hyderabad

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రయాగరాజ్‌లోని మహాకుంభనగర్‌లో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారుఈ ప్రదర్శన అవగాహన కల్పించేదిగాప్రయోజనకరమైనదిగా ఉందని భక్తులుసాధారణ ప్రజలు ఎంతగానో ప్రశంసించారుడిజిటల్ సెల్ఫీ పాయింట్ వద్ద సెల్ఫీలు తీసుకోవడానికి మహిళలుపిల్లలు ఆసక్తి కనబరిచారుసెల్ఫీ పాయింట్ తో పాటు వేదిక వద్ద సముద్ర మథన ప్రతీకాత్మక విగ్రహ ఏర్పాటునూ సందర్శకులు ప్రశంసించిసెల్ఫీలు తీసుకున్నారు.

మహాకుంభమేళాను సందర్శించే యాత్రికులుసాధారణ ప్రజల కోసం త్రివేణి రోడ్‌లోని పరేడ్ మైదానంలో ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ డిజిటల్ ప్రదర్శనను ఏర్పాటు చేసిందిగత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలుప్రజాసంక్షేమ పథకాలువిధానాలను ఈ ప్రదర్శన ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు.

సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రదర్శన శిబిరంలో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖప్రచురణల విభాగం ఏర్పాటు చేసిన స్టాళ్లతోపాటు జాతీయ విపత్తు నిర్వహణ ఆధీకృత సంస్థప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకంపై డిజిటల్ ప్రదర్శనలను కూడా సందర్శకులు పెద్దసంఖ్యలో వీక్షించి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.

ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనడ్రోన్ దీదీలాఖ్ పతి దీదీవేవ్స్ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకంముద్ర పథకంప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనడిజిటల్ ఇండియాప్రధానమంత్రి ఆవాస యోజనవిద్యాంజలిఆత్మనిర్భర భారత్స్కిల్ ఇండియాఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ప్రధానమంత్రి ఉజ్వల యోజనహర్ ఘర్ జల యోజనప్రధానమంత్రి కౌశల వికాస్ మిషన్స్వచ్ఛ భారత్ మిషన్ప్రధానమంత్రి స్వనిధి యోజనమూడు కొత్త నేర న్యాయ చట్టాలుప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిమహిళా సాధికారతకు సంబంధించి వివిధ ఇతర పథకాల గురించి సమాచారాన్ని సాధారణ ప్రజలు తెలుసుకుంటుండడం గమనార్హం.  

 

***


(Release ID: 2096682) Visitor Counter : 14