ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచంలోని 31 చిత్తడి నేల నగరాల జాబితాలో చేరిన ఇండోర్, ఉదయ్‌పూర్‌లను అభినందించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 25 JAN 2025 5:52PM by PIB Hyderabad

ప్రపంచంలోని 31 చిత్తడి నేల నగరాల జాబితాలో చేరిన ఇండోర్, ఉదయ్‌పూర్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు. ఈ గుర్తింపు సుస్థిర అభివృద్ధి, ప్రకృతి - పట్టణాభివృద్ధి మధ్య సమతుల్యత పెంపొందించడం పట్ల భారతదేశ బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ చేసిన పోస్టుకు ప్రతిస్పందిస్తూ, ప్రధానమంత్రి ఇలా అన్నారు:

"ఇండోర్, ఉదయ్‌పూర్‌లకు అభినందనలు! ఈ గుర్తింపు సుస్థిరమైన అభివృద్ధి, ప్రకృతి – పట్టణాభివృద్ధి మధ్య సామరస్యాన్ని పెంపొందించడం పట్ల మన బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ ఘనత మన దేశవ్యాప్తంగా పచ్చదనం, పరిశుభ్రత, మరింత పర్యావరణ అనుకూలమైన పట్టణాల దిశగా కృషి చేయడంలో ప్రతి ఒక్కరినీ ప్రేరేపించగలదని ఆశిద్దాం."

***

MJPS/SR


(రిలీజ్ ఐడి: 2096209) సందర్శకుల సూచీ సంఖ్య : : 143