ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు స్వాగతం పలకడం భారతదేశానికి గర్వకారణం: ప్రధానమంత్రి


మనం మొదటి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నప్పుడు, ఇండోనేషియా అతిథి దేశంగా పాల్గొంది. ఇప్పుడు, మన గణతంత్ర భారతదేశం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటో ఈ ఉత్సవాలకు హాజరవుతున్నారు: ప్రధాన మంత్రి

Posted On: 25 JAN 2025 5:48PM by PIB Hyderabad

భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వచ్చిన ఇండొనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రబోవో సుబియాంటోకు స్వాగతం పలికిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీఆయనతో భారత ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారుభారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీలో ఇండోనేషియా కీలక పాత్ర పోషించిందనిబ్రిక్స్ లో ఇండోనేషియా సభ్యత్వాన్ని భారత్ స్వాగతిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

'అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు స్వాగతం పలకడం భారత్ కు గర్వకారణం.”

మనం మొదటి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నప్పుడుఇండోనేషియా అతిథి దేశంగా ఉంది.  ఇప్పుడు, 75 సంవత్సరాల గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటో ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారుఈ సందర్భంగా ఆయనతో భారత్-ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలోని పలు అంశాలపై చర్చించాం’’.

భద్రతరక్షణ తయారీవాణిజ్యంఫిన్ టెక్కృత్రిమ మేధస్సు తదితర రంగాల్లో భారత్-ఇండోనేషియా సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలపై మేము చర్చించాంఆహార భద్రతఇంధనంవిపత్తు నిర్వహణ వంటి రంగాల్లో కూడా కలిసి పనిచేయాలని చూస్తున్నాం”

భారత్ఇండోనేషియా దేశాలు  వివిధ అంతర్జాతీయ వేదికలపై కూడా పరస్పరం సహకరించుకుంటున్నాయిఇండోనేషియా మన యాక్ట్ ఈస్ట్ పాలసీకి కేంద్ర బిందువుగా ఉందిఇండోనేషియా బ్రిక్స్ లో సభ్యత్వం పొందడాన్ని మేము స్వాగతిస్తున్నాము” అని ప్రధానమంత్రి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.

***

MJPS/SR


(Release ID: 2096206) Visitor Counter : 29