రాష్ట్రపతి సచివాలయం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి
Posted On:
24 JAN 2025 5:53PM by PIB Hyderabad
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు (జనవరి 25, 2025) భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఆకాశవాణికి ఉన్న జాతీయ స్థాయి నెట్‌వర్క్ , అన్ని దూరదర్శన్ ఛానళ్లలో హిందీలోనూ, ఆ తర్వాత ఆంగ్ల ప్రసంగం కూడా ప్రసారం అవుతుంది. దీని తర్వాత దూరదర్శన్ ప్రాంతీయ చానళ్లు ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేయనున్నాయి. ఆకాశవాణి రాత్రి 9.30 గంటల నుంచి ప్రాంతీయ ఛానళ్లలో ఆయా భాషల్లో ప్రసారం చేయనున్నాయి.
(Release ID: 2096008)
Visitor Counter : 17