ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నావికాదళ ప్రధాన యుద్ధ నౌకలు- ఐఎన్ ఎస్ సూరత్, ఐఎన్ ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ ఎస్ వాఘ్షీర్ లను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ


ప్రధాన నావికాదళ యుద్ధ నౌకల ప్రారంభం... రక్షణ రంగం బలోపేతం, స్వావలంబన పట్ల భారతదేశ అచంచలమైన నిబద్ధతను చాటుతుంది: ప్రధానమంత్రి

21వ శతాబ్దపు భారత నావికాదళ సాధికారత దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు: ప్రధానమంత్రి

నేటి భారతదేశం ప్రపంచంలోనే ప్రధాన సముద్ర శక్తిగా ఎదుగుతోంది: ప్రధానమంత్రి

నేడు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా గ్లోబల్ సౌత్ లో విశ్వసనీయమైన, బాధ్యతాయుతమైన భాగస్వామిగా గుర్తింపు పొందింది: ప్రధానమంత్రి

హిందూ మహాసముద్ర ప్రాంతం అంతటా భారతదేశం మొదటి ప్రతిస్పందన దేశంగా అవతరించింది: ప్రధానమంత్రి

భూమి, నీరు, గాలి, లోతైన సముద్రం లేదా అనంత అంతరిక్షం ఏదైనా సరే, భారతదేశం ప్రతిచోటా తన ప్రయోజనాల పరిరక్షణ కోసం కృషి చేస్తోంది: ప్రధానమంత్రి

Posted On: 15 JAN 2025 12:50PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు ముంబయిలోని నావల్ డాక్ యార్డ్ లో మూడు ప్రధాన నావికాదళ యుద్ధ వాహనాలుపఐఎన్ఎస్ సూరత్ఐఎన్ఎస్ నీలగిరిజలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్షీర్ లను జాతికి అంకితం చేశారుఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... జనవరి 15వ తేదీని ఆర్మీడేగా జరుపుకుంటున్నామనిదేశ భద్రత కోసం జీవితాలను త్యాగం చేసిన ప్రతి వీర యోధుడికి అభివాదం చేస్తున్నానని శ్రీ మోదీ అన్నారుఈ సందర్భంగా సైనిక వీరులకు ఆయన అభినందనలు తెలిపారు.

భారతదేశ సముద్ర వారసత్వానికినావికాదళం అద్భుతమైన చరిత్రకుఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కు నేడు ఒక గొప్ప రోజు అని ప్రధాన మంత్రి అన్నారుఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశంలో నావికాదళానికి కొత్త బలాన్నీదార్శనికతను ఇచ్చారని అన్నారుశివాజీ మహారాజ్ నడయాడిన నేలలో 21వ శతాబ్దపు భారత నౌకాదళాన్ని బలోపేతం చేసే దిశగా నేడు ప్రభుత్వం కీలకమైన అడుగు వేసిందన్నారు. "ఒక డిస్ట్రాయర్ఫ్రిగేట్,  జలాంతర్గామిని త్రివిధీకరణ చేయడం ఇదే మొదటిసారిఅని ప్రధాన మంత్రి అన్నారుమొత్తం మూడు యుద్ధ వాహనాలు భారత్ లోనే తయారు కావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారుఈ సందర్భంగా భారత నావికాదళాన్నీనిర్మాణ పనుల్లో భాగస్వాములైన వారందరినీభారత పౌరులను ఆయన అభినందించారు.

"నేటి కార్యక్రమం మన అద్భుతమైన వారసత్వాన్ని మన భవిష్యత్తు ఆకాంక్షలతో ముడిపెడుతుందిఅని శ్రీ మోదీ ఉద్వేగంతో అన్నారుసుదూర సముద్ర ప్రయాణాలువాణిజ్యంనౌకాదళ రక్షణనౌకా పరిశ్రమకు సంబంధించి భారతదేశానికి గొప్ప చరిత్ర ఉందని ఆయన అన్నారుఈ ఘనమైన చరిత్రను అవకాశంగా తీసుకుని నేటి భారతదేశం ప్రపంచంలోనే ప్రధాన సముద్ర శక్తిగా ఎదుగుతోందని ఆయన అన్నారుఈ రోజు ప్రారంభించిన వేదికలు దీనికి అద్దం పడుతున్నాయని ఆయన అన్నారుఐఎన్ఎస్ నీలగిరితో సహా కొత్త వేదికల ప్రారంభం చోళ రాజవంశం సముద్ర పరాక్రమానికి అంకితమని,  సూరత్ యుద్ధనౌక గుజరాత్ ఓడరేవులు భారతదేశాన్ని పశ్చిమాసియాతో అనుసంధానించిన యుగాన్ని గుర్తు చేస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారుకొన్నేళ్ల క్రితం తొలి జలాంతర్గామి కల్వరిని ప్రారంభించిన తర్వాత పీ75 తరగతిలో ఆరోదైన వాగ్షీర్ జలాంతర్గామిని ప్రారంభించడాన్ని ఆయన ప్రస్తావించారుఈ కొత్త సరిహద్దు వేదికలు భారతదేశ భద్రతపురోగతి రెండింటికీ దోహదం చేస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

"భారతదేశం నేడు ప్రపంచవ్యాప్తంగాముఖ్యంగా గ్లోబల్ సౌత్ లో విశ్వసనీయమైనబాధ్యతాయుతమైన భాగస్వామిగా గుర్తింపు పొందిందిఅని ప్రధాన మంత్రి అన్నారుభారత్ విస్తరణవాదంతో కాకుండా అభివృద్ధి స్ఫూర్తితో పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారుస్వేచ్చాయుతసురక్షితమైనసమ్మిళితసుసంపన్నమైన ఇండో-పసిఫిక్ ప్రాంతానికి భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు.

తీరప్రాంత దేశాల అభివృద్ధి విషయానికి వస్తే ఈ ప్రాంతంలో అందరికీ భద్రతవృద్ధి (సాగర్మంత్రాన్ని భారత్ ప్రవేశపెట్టిందనిఈ దార్శనికతతో పురోగమించిందని ఆయన పేర్కొన్నారుజి 20 అధ్యక్ష పదవీకాలంలో భారతదేశ నాయకత్వాన్ని ప్రస్తావిస్తూ, "ఒకే భూమిఒకే కుటుంబంఒకే భవిష్యత్తుమంత్రాన్ని ముందుకు తీసుకెళ్లామనికోవిడ్ -19 మహమ్మారికి  వ్యతిరేకంగా చేసిన ప్రపంచవ్యాప్త పోరాటంలో "ఒకే భూమిఒకే ఆరోగ్యంఅనే దృష్టి కోణాన్ని అందించామని శ్రీ మోదీ గుర్తు చేశారుఈ ప్రాంతం మొత్తం రక్షణభద్రతను భారత్ తన బాధ్యతగా భావిస్తోందని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచ భద్రతఆర్థిక వ్యవహారాలుభౌగోళిక రాజకీయాలు రూపొందించడంలో భారతదేశం వంటి సముద్ర దేశాల ముఖ్య పాత్ర అవసరాన్ని ప్రస్తావిస్తూప్రాదేశిక జలాలను రక్షించడంనౌకాయాన స్వేచ్ఛను కల్పించడంఆర్థిక పురోగతిఇంధన భద్రత కోసం వాణిజ్య రవాణా మార్గాలనుసముద్ర మార్గాలను సురక్షితంగా ఉంచడం ప్రముఖంగా ప్రధానమంత్రి వివరించారుఉగ్రవాదంఆయుధాలుమాదకద్రవ్యాల అక్రమ రవాణా నుంచి ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రధాని శ్రీ మోదీ స్పష్టం చేశారుసముద్రాలను సురక్షితంగాసుసంపన్నంగా మార్చడంలోరవాణా సామర్థ్యాన్ని పెంచడంలో నౌకారంగ పరిశ్రమకు మద్దతు ఇవ్వడంలో ప్రపంచ భాగస్వాములుగా మారవలసిన ప్రాముఖ్యతను శ్రీ మోదీ వివరించారుఅరుదైన ఖనిజాలుచేపల నిల్వలు వంటి సముద్ర వనరుల దుర్వినియోగాన్ని నివారించాలనివాటిని నిర్వహించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని పిలుపు ఇచ్చారుకొత్త షిప్పింగ్ మార్గాలు సముద్ర కమ్యూనికేషన్ మార్గాలలో పెట్టుబడుల ప్రాముఖ్యతను ప్రస్తావించిన ప్రధానమంత్రి... భారతదేశం ఈ దిశలో నిరంతరం సంతృప్తికరమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. "హిందూ మహాసముద్ర ప్రాంతంలో సమస్యలకుసవాళ్లకు భారతదేశం మొదటి ప్రతిస్పందన దేశంగా ఆవిర్భవించిందిఅని అన్నారుఇటీవలి నెలల్లోభారత నావికాదళం వందలాది మంది ప్రాణాలను కాపాడిందనివేల కోట్ల విలువైన జాతీయఅంతర్జాతీయ సరుకును రక్షించిందనిభారతదేశంభారత నావికాదళంకోస్టు గార్డుపై ప్రపంచ నమ్మకాన్ని పెంచిందని ఆయన పేర్కొన్నారుఆసియాన్ఆస్ట్రేలియాగల్ఫ్ దేశాలుఆఫ్రికా దేశాలతో భారతదేశం ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా తెలిపారుహిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశ ఉనికిసామర్థ్యాలు దీనికి కారణమని పేర్కొన్నారుఈ రోజు జరిగిన కార్యక్రమం సైనిక పరంగాఆర్థిక పరంగా రెండు విధాలా ప్రాధాన్యత కలిగినదని ఆయన అన్నారు

21వ శతాబ్దంలో భారతదేశ సైనిక సామర్థ్యాలను పెంచవలసినఆధునీకరించవలసినప్రాముఖ్యతను స్పష్టం చేసిన ప్రధాని... "భూమినీరుగాలిలోతైన సముద్రం లేదా అనంత అంతరిక్షం ఏదైనా సరేభారతదేశం ప్రతిచోటా తన ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేస్తోంది” అని చెప్పారుసాయుధ దళాల ప్రధానాధికారి పదవి ఏర్పాటు సహా నిరంతరం చేపడుతున్న సంస్కరణల గురించి ఆయన ప్రస్తావించారుసాయుధ దళాల సామర్ధ్యాన్ని మరింత పెంచేందుకు థియేటర్ కమాండ్ల అమలు దిశగా భారత్ పురోగమిస్తోందని ప్రధాని పేర్కొన్నారు.

గత దశాబ్ద కాలంగా భారతదేశ సాయుధ బలగాలు ఆత్మనిర్భరత (స్వయం-విశ్వాసం)ను స్వీకరించడాన్ని ప్రధానమంత్రి అభినందిస్తూసంక్షోభాల సమయంలో ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలను ప్రశంసించారుఇకమీదట దిగుమతి చేసుకోనవసరం లేని 5,000ల కంటే ఎక్కువ వస్తువులుపరికరాలను సాయుధ దళాలు గుర్తించాయని ఆయన వెల్లడించారుదేశీయంగా తయారైన పరికరాలను ఉపయోగించడంలో పెరిగిన భారత సైనికుల విశ్వాసాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారుదేశంలోనే అతిపెద్ద హెలికాప్టర్ల తయారీ కర్మాగారాన్నిసాయుధ బలగాల కోసం రవాణా విమానాల కర్మాగారాన్ని కర్ణాటకలో ఏర్పాటు చేయడాన్ని శ్రీ మోదీ ప్రస్తావించారుతేజస్ యుద్ధ విమానం సాధించిన విజయాలనురక్షణ రంగ ఉత్పత్తిని వేగవంతం చేస్తున్న ఉత్తరప్రదేశ్తమిళనాడు రాష్ట్రాల్లోని రక్షణ కారిడార్ల అభివృద్ధిని ఆయన ప్రస్తావించారుమజాగావ్ డాక్‌యార్డ్ పోషిస్తున్న కీలక పాత్రను ప్రస్తావిస్తూమేక్ ఇన్ ఇండియా విస్తరణలో నౌకాదళం చేస్తున్న కృషి పట్ల ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారుగత దశాబ్దంలో నేవీలో 33 నౌకలుఏడు జలాంతర్గాములు చేరాయని40 నౌకాదళ నౌకల్లో 39 భారత షిప్‌యార్డుల్లోనే నిర్మించినట్లు చెప్పారుఅత్యద్భుతమైన ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌక,  ఐఎన్ఎస్ అరిహంత్అలాగే ఐఎన్ఎస్ అరిఘాట్ వంటి అణు జలాంతర్గాములు వీటిలో భాగంగా ఉన్నాయన్నారుమేక్ ఇన్ ఇండియా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లిన సాయుధ బలగాలను ప్రధాని అభినందించారుభారతదేశ రక్షణ ఉత్పత్తి రూ. 1.25 లక్షల కోట్లను అధిగమించిందనిమన దేశం ప్రస్తుతం 100 దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తోందని ఆయన తెలిపారునిరంతర మద్దతుతో భారత రక్షణ రంగం వేగంగా మార్పు చెందుతోందని ఆయన చెప్పారు.

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం భారత సాయుధ బలగాల సామర్థ్యాలను పెంపొందించడమే కాకుండా ఆర్థిక ప్రగతికి కొత్త మార్గాలను అందిస్తోంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారునౌకానిర్మాణ రంగాన్ని ఉదాహరణగా చూపుతూనౌకానిర్మాణంలో పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి ఆర్థిక వ్యవస్థపై దాదాపు రెట్టింపు సానుకూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారని తెలిపారుప్రస్తుతం దేశంలో సుమారు రూ. 1.5 లక్షల కోట్ల విలువైన 60 భారీ నౌకలు నిర్మాణంలో ఉన్నాయన్నారుఈ పెట్టుబడి నుండి దాదాపు రూ. 3 లక్షల కోట్ల ఆర్థిక రాబడి రానుందని అలాగే ఉపాధి పరంగా ఇది ఆరు రెట్లు అధిక ప్రభావాన్ని చూపుతుందని ఆయన స్పష్టం చేశారుఓడ విడిభాగాల్లో చాలా వరకు దేశీయ ఎమ్ఎస్ఎమ్ఇలు తయారు చేస్తున్నాయన్న శ్రీ మోదీ... 2,000ల మంది కార్మికులు ఓడ నిర్మాణంలో పాల్గొంటేఇతర పరిశ్రమల్లోముఖ్యంగా ఎమ్ఎస్ఎమ్ఇ రంగంలో దాదాపు 12,000ల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా దేశం వేగవంతమైన పురోగతిని నొక్కిచెప్పిన ప్రధానమంత్రి... భవిష్యత్తులో వందలాది కొత్త నౌకలుకంటైనర్ల ఆవశ్యకతను పేర్కొంటూతయారీఎగుమతి సామర్థ్యంలో నిరంతర వృద్ధి కొనసాగుతున్నదని వ్యాఖ్యానించారుపోర్ట్ నేతృత్వంలోని అభివృద్ధి నమూనా మొత్తం ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేస్తూవేలాది కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నదన్నారుసముద్రయాన రంగంలో పెరుగుతున్న ఉపాధికి ఒక ఉదాహరణను ఉటంకిస్తూ... దేశంలో నావికుల సంఖ్య 2014లో 1,25,000 కంటే తక్కువగా ఉండగానేడు దాదాపు 3,00,000లకి పైగా అంటే రెండింతలు పెరిగిందని తెలిపారునావికుల సంఖ్య పరంగా మన దేశం ఇప్పుడు ప్రపంచంలోని మొదటి ఐదు దేశాల్లో ఒకటిగా నిలిచిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

దేశ అవసరాలకు అనుగుణంగా కొత్త విధానాలను వేగంగా రూపొందించడంకొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం వంటి అనేక ప్రధాన నిర్ణయాలతో తమ ప్రభుత్వ మూడో హాయాం ప్రారంభమైందని ప్రధానమంత్రి తెలిపారుఓడరేవు రంగం విస్తరణ సహా దేశంలోని ప్రతి మూలలోరంగంలో అభివృద్ధి జరిగేలా చేయు లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారుమూడో హాయాంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాల్లో మహారాష్ట్రలో వధావన్ పోర్ట్‌ ఏర్పాటు ముఖ్యమైనదని శ్రీ మోదీ పేర్కొన్నారురూ. 75,000ల కోట్ల పెట్టుబడితో ఈ ఆధునిక నౌకాశ్రయం నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందనిదీని ద్వారా మహారాష్ట్రలో వేలాది కొత్త ఉద్యోగావకాశాలు అందుబాటులో రానున్నాయని తెలిపారు.

సరిహద్దులుతీరప్రాంతాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల అనుసంధానం విషయంగా గత దశాబ్దంలో జరిగిన కృషిని ప్రధానంగా ప్రస్తావించిన ప్రధానమంత్రిజమ్మూ కాశ్మీర్‌లోని సోనామార్గ్ సొరంగమార్గం ఇటీవల ప్రారంభమైన విషయాన్ని గుర్తు చేశారుఇది కార్గిల్లదాఖ్ వంటి సరిహద్దు ప్రాంతాలకు సులభంగా చేరుకునేందుకు వీలు కల్పిస్తుందన్నారుగత ఏడాది అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రారంభమైన సెలా టన్నెల్ సైన్యం ఎల్ఎసికి చేరుకోవడాన్ని సులభతరం చేసిందన్న ప్రధానమంత్రిషింకున్ లా టన్నెల్జోజిలా టన్నెల్ వంటి కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారుసరిహద్దు ప్రాంతాల్లో భారతమాల ప్రాజెక్ట్ అద్భుతమైన జాతీయ రహదారుల నెట్‌వర్కును రూపొందిస్తోందన్న ఆయనసరిహద్దు గ్రామాల అభివృద్ధిలో వైబ్రంట్ విలేజ్ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తున్నదని ప్రధానమంత్రి తెలిపారుగత దశాబ్ద కాలంలో మారుమూల ద్వీపాలపై ప్రభుత్వం దృష్టి సారించిందనీదానిలో భాగంగా సాధారణ పర్యవేక్షణజనావాసాలు లేని ద్వీపాలకు పేరు పెట్టడం వంటి కార్యక్రమాలను గురించి ప్రధానమంత్రి ప్రధానంగా ప్రస్తావించారుహిందూ మహాసముద్రంలోని నీటి అడుగున సీమౌంట్‌లకు పేరు పెట్టడాన్ని కూడా ఆయన ప్రస్తావించారుభారతదేశ చొరవతో ఒక అంతర్జాతీయ సంస్థ గత సంవత్సరం అలాంటి ఐదు ప్రదేశాలకు పేరు పెట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

భవిష్యత్తులో బాహ్య అంతరిక్షంలోతైన సముద్రం రెండు రంగాలకు గల ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించిన ప్రధానమంత్రిఈ రంగాల్లో తన సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి మన దేశం చేస్తున్న కృషిని వివరించారుసముద్రంలో 6,000 మీటర్ల లోతుకు శాస్త్రవేత్తలను తీసుకెళ్లే లక్ష్యంతో మొదలైన సముద్రయాన్ ప్రాజెక్ట్కొన్ని దేశాలు మాత్రమే సాధించిన ఘనతగా ఆయన అభివర్ణించారుభవిష్యత్తు అవకాశాలను అన్వేషించే ఏ అవకాశాన్నీ ప్రభుత్వం వదిలిపెట్టడం లేదని ఆయన స్పష్టం చేశారు.

వలసవాద భావజాలం నుంచి దేశాన్ని విముక్తి చేయడం ద్వారా 21వ శతాబ్దంలో మరింత విశ్వాసంతో ముందుకు సాగుతున్న ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించిన ప్రధానమంత్రిఈ విషయంలో భారత నౌకాదళం చూపిన నాయకత్వాన్ని ప్రశంసిస్తూనేవీ తన పతాకాన్ని అద్భుతమైన ఛత్రపతి శివాజీ మహారాజ్ సంప్రదాయంతో అనుసంధానం చేసిందనీ అలాగే దానికి అనుగుణంగా అడ్మిరల్ ర్యాంక్ భుజకీర్తులను పునఃరూపకల్పన చేసిందని వివరించారుమేక్ ఇన్ ఇండియాస్వావలంబనను ప్రోత్సహించే ప్రచారం వలసవాద మనస్తత్వం నుంచి విముక్తిని కలిగిస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారుదేశం గర్వించదగ్గ క్షణాలను కొనసాగిస్తుందన్న ఆయన భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఇది దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారుబాధ్యతలు వేరైనాలక్ష్యం ఒక్కటేనని అదే వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారత్అని ఆయన స్పష్టం చేశారు.

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ ఏక్‌నాథ్ షిండేశ్రీ అజిత్ పవార్ సహా ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

రక్షణ రంగ తయారీసముద్ర భద్రతలో ప్రపంచ అగ్రగామిగా ఎదగాలనే భారత సంకల్పాన్ని సాకారం చేయడంలో రెండు ప్రధాన నౌకాదళ రక్షణ నౌకలజలాంతర్గామి తయారీ గణనీయమైన ముందడుగును సూచిస్తుందిఐఎన్ఎస్ సూరత్పీ15బి గైడెడ్ క్షిపణి విధ్వంసక ప్రాజెక్ట్‌లో భాగంగా రూపొందించిన నాల్గవచివరి నౌక. ప్రపంచంలోని అతిపెద్దఅత్యంత అధునాతన విధ్వంసక నౌకల్లో ఒకటిగా ఉందిఇది 75% స్వదేశీ పరికరాలను కలిగి ఉందిఅలాగే అత్యాధునిక ఆయుధ-సెన్సార్ ప్యాకేజీలుఅధునాతన నెట్‌వర్క్-ఆధారిత సామర్థ్యాలను కలిగి ఉందిఐఎన్ఎస్ నీలగిరిపీ17 స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్ట్‌లోని మొదటి నౌకనుభారత నావికాదళ వార్‌షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిందిఅలాగే తదుపరి తరం స్వదేశీ యుద్ధనౌకలను ప్రతిబింబిస్తూ మెరుగైన మనుగడసీకీపింగ్స్టెల్త్ కోసం అధునాతన లక్షణాలను ఇది కలిగి ఉందిపీ75 స్కార్పెన్ ప్రాజెక్ట్ ఆరవచివరి జలాంతర్గామి ఐఎన్ఎస్ ాఘ్షీర్ జలాంతర్గామి నిర్మాణంలో పెరుగుతున్న భారతదేశ నైపుణ్యాన్ని సూచిస్తుందిఅలాగే దీనిని ఫ్రాన్స్ నావల్ గ్రూప్ సహకారంతో నిర్మించారు.

 

 

***

MJPS/SR


(Release ID: 2095862) Visitor Counter : 61