ప్రధాన మంత్రి కార్యాలయం
‘బేటీ బచావో బేటీ పఢావో’ కార్యక్రమం లక్షల మందికి ప్రేరణనిచ్చింది
దేశ ప్రగతిలో మహిళలను అగ్రభాగాన నిలిపింది: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
22 JAN 2025 1:25PM by PIB Hyderabad
బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం లక్షల మందికి ప్రేరణనిచ్చిందని, దేశ ప్రగతిలో మహిళలను అగ్రభాగాన నిలిపిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వ్యాఖ్యానించారు. భారత పుత్రికలు మార్పును తీసుకువస్తున్న వారుగా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా, నాయకురాళ్లుగా ఎలా ఎదుగుతున్నారో కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి రాసిన వ్యాసం ప్రముఖంగా చెబుతోందని ఆయన అన్నారు.
కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పెట్టిన ఒక పోస్టుకు ప్రధాని ప్రతిస్పందిస్తూ:
‘‘భారత పుత్రికలు మార్పులను తీసుకువస్తున్నవారుగా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా, నాయకురాళ్లుగా ఎలా ఎదుగుతున్నదీ కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి (@Annapurna4BJP) గారు ప్రముఖంగా వివరించారు. బేటీ బచావో బేటీ పఢావో (#BetiBachaoBetiPadhao) కార్యక్రమం లక్షల మందికి ప్రేరణనివ్వడంతోపాటు భారత పురోగతిలో మహిళలను అగ్రభాగాన నిలిపింద’’ని పేర్కొన్నారు.
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2095853)
आगंतुक पटल : 66
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
हिन्दी
,
Punjabi
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Gujarati
,
Tamil
,
Kannada