ప్రధాన మంత్రి కార్యాలయం
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు దినోత్సవం.. ఎన్‌డీఆర్ఎఫ్ సాహసిక సిబ్బందికి ప్రధానమంత్రి వందనాలు
प्रविष्टि तिथि:
19 JAN 2025 5:18PM by PIB Hyderabad
ఈ రోజు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్ప్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్) ఏర్పాటు దినోత్సవం. ఈ సందర్బంగా ఎన్‌డీఆర్ఎఫ్‌లోని సాహసిక సిబ్బంది చాటుతున్న ధైర్యాన్నీ, అంకితభావాన్నీ, దేశ ప్రజలకు వారు అందిస్తున్న నిస్వార్థ సేవలనూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొంటూ, ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన ఈ కింది విధంగా రాశారు:
‘‘నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్) ఏర్పాటు దినోత్సవం ఓ ప్రత్యేక సందర్భం. ఈ సందర్భంగా, ప్రతికూల ఘడియల్లో రక్షణకవచంలా పనిచేస్తున్న ఈ దళంలోని ధైర్యవంతులైన సిబ్బందికి వారు చాటిచెబుతున్న సాహసాలకూ, అంకితభావానికీ, స్వార్థమెరుగక అందిస్తున్న సేవలకూ మనం నమస్కరిద్దాం. ప్రజలను కాపాడడానికి వారు ప్రదర్శిస్తున్న అచంచల నిబద్ధతతోపాటు, విపత్తులు తలెత్తినప్పుడు వాటికి ఎదురొడ్డి నిలుస్తూ, అత్యవవసర సమయాల్లో సురక్ష పరంగా భరోసాను అందిస్తున్న తీరూ నిజంగా ప్రశంసనీయాలు. విపత్తులు సంభవించినప్పుడు దీటుగా ప్రతిస్పందించడంలోనూ, అవసరమైన సహాయక చర్యల్లో నిమగ్నం కావడంలోనూ ఎన్‌డీఆర్ఎఫ్ ప్రపంచ స్థాయి ప్రమాణాల్ని నెలకొల్పింది.
@NDRFHQ”
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2094502)
आगंतुक पटल : 93
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam