ప్రధాన మంత్రి కార్యాలయం
జనవరి 13న జమ్మూ కాశ్మీర్ లో సోనామార్గ్ టన్నెల్ ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రధానమంత్రి
లే... మార్గంలో శ్రీనగర్- సోనామార్గ్ మధ్య అన్ని వాతావరణాలలో అంతరాయం లేని ప్రయాణ సౌలభ్యాన్ని అందించనున్న సోనామార్గ్ టన్నెల్
ఈ ప్రాజెక్ట్ తో వ్యూహాత్మకంగా కీలకమైన లడఖ్ ప్రాంతానికి సురక్షితంగా, అంతరాయం లేకుండా చేరుకునే వీలు
రక్షణ, సైనిక రవాణా మెరుగుదలతో పాటు జమ్మూ కాశ్మీర్ లడఖ్ ప్రాంతాల ఆర్థిక వృద్ధికి, సామాజిక-సాంస్కృతిక సమైక్యతకు దోహదం చేయనున్న ప్రాజెక్ట్
సోనామార్గ్ ను ఏడాది పొడవునా గమ్యస్థానంగా మార్చడం ద్వారా పర్యాటక రంగానికి భారీ ఊతం
Posted On:
11 JAN 2025 5:41PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 13న జమ్మూశ్మీర్ లోని సోనామార్గ్ ను సంద ర్శించనున్నారు. ఆరోజు ఉదయం 11.45 గంటలకు సోనామార్గ్ టన్నెల్ ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా జరిగే సభలో ప్రధాని ప్రసంగిస్తారు.
సుమారు 12 కిలోమీటర్ల పొడవైన సోనామార్గ్ టన్నెల్ ప్రాజెక్టును రూ.2,700 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించారు. ఇందులో సోనామార్గ్ ప్రధాన సొరంగం, ఎగ్రెస్ టన్నెల్, అప్రోచ్ రోడ్లు ఉన్నాయి. సముద్ర మట్టానికి 8,650 అడుగుల ఎత్తులో ఉన్న ఈ టన్నెల్ లే.. మార్గంలో శ్రీనగర్-సోనామార్గ్ మధ్య అన్ని వాతావరణాలలో అంతరాయం లేని ప్రయాణ సౌలభ్యాన్ని అందిస్తుంది. విరిగిపడే అవకాశం ఉన్న కొండచరియలను, హిమపాత మార్గాలను అధగమించి వ్యూహాత్మకంగా కీలకమైన లడఖ్ ప్రాంతానికి సురక్షితమైన, అంతరాయం లేని ప్రవేశాన్ని అందిస్తుంది. సోనామార్గ్ ను ఏడాది పొడవునా గమ్యస్థానంగా మార్చడం, శీతాకాల పర్యాటకం, సాహస క్రీడలు, స్థానిక జీవనోపాధిని పెంచడం ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది.
2028 నాటికి పూర్తికానున్న జోజిలా టన్నెల్ తో పాటు, ఇది మార్గం పొడవును 49 కిలోమీటర్ల నుండి 43 కిలోమీటర్లకు తగ్గిస్తుంది. వాహనాల వేగాన్ని గంటకు 30 కిలోమీటర్ల నుండి 70 కిలోమీటర్లకు పెంచుతుంది. శ్రీనగర్ లోయ, లడఖ్ మధ్య అంతరాయం లేని ఎన్ హెచ్ -1 కనెక్టివిటీకి దోహదపడుతుంది.
ఈ మెరుగైన కనెక్టివిటీ రక్షణ సంబంధ రవాణా సౌలభ్యాన్ని పెంచుతుంది, జమ్మూ కాశ్మీర్, లడఖ్ అంతటా ఆర్థిక వృద్ధి, సామాజిక-సాంస్కృతిక సమైక్యతను పెంచుతుంది.
అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ టన్నెల్ నిర్మాణానికి అహర్నిశలు శ్రమించిన భవన నిర్మాణ కార్మికుల ఇంజనీరింగ్ ఘనతకు గుర్తింపుగా ప్రధాని వారితో సమావేశం అవుతారు.
***
(Release ID: 2092252)
Visitor Counter : 20
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam