ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆంధ్ర ప్రదేశ్‌లోని తిరుపతిలో తొక్కిసలాట కారణంగా ప్రాణహాని కలిగినందుకు ప్రధానమంత్రి సంతాపం

Posted On: 09 JAN 2025 8:30AM by PIB Hyderabad

ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిలో తొక్కిసలాట కారణంగా ప్రాణహాని కలిగినందుకు ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘ ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిలో తొక్కిసలాట ఘటన గురించి తెలిసి  బాధపడ్డాను. ఈ దుర్ఘటనలో ఆప్తులను కోల్పోయిన వారికి కలిగిన శోకంలో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేతనైన అన్ని విధాలుగానూ సహాయక చర్యల్ని చేపడుతోంది: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (@narendramodi)”


 

 

 

***

MJPS/ST


(Release ID: 2091389) Visitor Counter : 21