ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా ప్రధాని చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం

Posted On: 06 JAN 2025 3:26PM by PIB Hyderabad

నమస్కారం!

తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారుఒడిశా గవర్నర్ శ్రీ హరిబాబు గారుజమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా గారుజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా గారుతెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారుఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ గారునా మంత్రివర్గ సహచరులు శ్రీ అశ్వనీ వైష్ణవ్ గారుశ్రీ జి కిషన్ రెడ్డి గారుడాక్టర్ జితేంద్ర సింగ్ గారుశ్రీ సోమయ్య గారుశ్రీ రణవీత్ సింగ్ బిట్టూ గారుశ్రీ బండి సంజయ్ కుమార్ గారుఇతర మంత్రులుపార్లమెంట్ సభ్యులుశాసనసభ సభ్యులువిశిష్ట అతిథులుసోదరసోదరీమణులారా!

ఈ రోజు గురు గోవింద్ సింగ్ జయంతిఆయన బోధనలుఆదర్శవంతమైన జీవితం బలమైన భారత దేశాన్ని నిర్మించే దిశగా మనకు స్పూర్తినిస్తూనే ఉంటుందిఈ శుభ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

స్నేహితులారా,

2025 మొదలైనప్పటి నుంచే రవాణా సౌకర్యాల అభివృద్ధిలో అసాధారణ వేగాన్ని భారత్ కొనసాగిస్తోందినిన్ననేఢిల్లీ ఎన్‌సీఆర్‌లో నమో భారత్ రైలు ప్రయాణాన్ని ఆస్వాదించేఢిల్లీ మెట్రోలో ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశం నాకు లభించిందినిన్న భారత్ ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది మనదేశంలో మెట్రో వ్యవస్థ విస్తరణ వెయ్యి కిలోమీటర్లకు చేరుకుందిఈ రోజు కొన్ని కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించుకుంటున్నాంభవిష్యత్తులో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నాంఉత్తరాన జమ్మూ కాశ్మీర్ నుంచితూర్పున ఒడిశాదక్షిణాన తెలంగాణ వరకుదేశంలో ‘ఆధునిక రవాణా’ వ్యవస్థలకు ఇది ముఖ్యమైన రోజుఈ మూడు రాష్ట్రాల్లో చేపట్టిన ఆధునిక అభివృద్ధి కార్యక్రమాలు యావత్ దేశాభివృద్ధిని సూచిస్తున్నాయి. ‘సబ్‌కా సాత్సబ్‌కా వికాస్’ మంత్రం మనలో విశ్వాసాన్ని నింపడంతో పాటువికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారత్అనే లక్ష్యానికి జీవం పోస్తుందిఈ ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా ఈ మూడు రాష్ట్రాల ప్రజలకుభారతీయులందరికీ అభినందనలుఈ రోజు ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ పుట్టినరోజు కూడాఅందరి తరఫునా ఆయనకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా మన దేశం స్థిరంగా ప్రయాణిస్తోందిఈ లక్ష్యాన్ని సాధించడంలో రైల్వేల అభివృద్ధి ప్రధానంగత దశాబ్దంగాభారతీయ రైల్వేలు చారిత్రక మార్పులను సంతరించుకున్నాయిరైల్వేల్లో మౌలిక వసతుల కల్పనలో సాధించిన అసాధారణ పురోగతి జాతీయ చిత్రాన్ని మార్చడంతో పాటుప్రజల్లో ధైర్యాన్ని పెంచుతుంది.

స్నేహితులారా,

నాలుగు ప్రధానాంశాలపై దృష్టి సారించి రైల్వేలను అభివృద్ధి చేయడంలో మనం ముందుకు వెళుతున్నాంమొదటిది రైల్వేల్లో మౌలిక వసతులను ఆధునికీకరించడంరెండోది ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాల ఏర్పాటుమూడోది దేశంలోని ప్రతీ మూలకు రైల్వే వ్యవస్థల విస్తరణనాలుగోది రైల్వేల ద్వారా ఉపాధి అవకాశాల కల్పనపరిశ్రమలకు తోడ్పాటుఈ దార్శనికతకు నిదర్శనమే నేటి కార్యక్రమంకొత్తగా ఏర్పాటు చేస్తున్న డివిజన్లురైల్వే టెర్మినళ్లు భారతీయ రైల్వేలను 21వ శతాబ్దపు ఆధునిక వ్యవస్థగా మార్చేందుకు దోహదపడతాయిఈ అభివృద్ది కార్యక్రమాలు ఆర్థిక సంక్షేమం దిశగా వ్యవస్థను ప్రోత్సహిస్తాయిరైల్వే కార్యకలాపాలను విస్తరింపజేస్తాయిపెట్టుబడులకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయినూతన ఉద్యోగాలను కల్పిస్తాయి.

మిత్రులారా,

2014లో భారతీయ రైల్వేలను ఆధునికీకరించే ప్రక్రియను మేం మొదలుపెట్టాంవందే భారత్ రైళ్లుఅమృత్ భారత్ స్టేషన్లునమో భారత్ రైళ్లు భారతీయ రైల్వేలో నూతన ప్రమాణాలను నిర్దేశించాయి.  తక్కువ సమయంలో ఎక్కువ విజయాలను సాధించాలని ఆకాంక్షాత్మక భారత్ నేడు ప్రయత్నిస్తోందిసుదూర గమ్యాలను సైతం వేగంగా చేరుకోవాలని ప్రయాణికులు భావిస్తుండటంతో దేశవ్యాప్తంగా హైస్పీడు రైళ్లకు డిమాండ్ పెరుగుతోందిప్రస్తుతంవందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా 50 కంటే ఎక్కువ మార్గాల్లో 136 సర్వీసుల ద్వారా ప్రయాణికులకు ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయికొన్ని రోజుల క్రితం ట్రయల్ రన్‌లో భాగంగా వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 180 కి.మీవేగంతో ప్రయాణించిన వీడియోను చూశానుఇలాంటి ఘనతలు ప్రతి భారతీయుడికీ గర్వకారణంగా నిలుస్తాయిఈ విజయాలు ఆరంభం మాత్రమేభారత్‌లో మొదటి  బుల్లెట్ రైలు కార్యకలాపాలు  ప్రారంభమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు.

స్నేహితులారా,

బయలుదేరే స్టేషన్ నుంచి గమ్యస్థానం వరకు భారతీయ రైల్వేల ద్వారా చేసే ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనేదే మా లక్ష్యంఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా 1,300 అమృత్ భారత్ స్టేషన్లు పునర్నిర్మితమవుతున్నాయిగత పదేళ్లలో రైలు అనుసంధానంలో వృద్ధి నమోదైంది. 2014 లో దేశంలో 35 శాతం రైల్వే లైన్లను మాత్రమే విద్యుద్దీకరణ చేశారుఇప్పుడు 100 శాతం రైల్వే లైన్ల విద్యుద్దీకరణకు చేరువలో భారత్ ఉందిఅలాగే రైల్వేల పరిధిని సైతం గణనీయంగా విస్తరించాంగత పదేళ్లలో 30,000 కి.మీ.లకు పైగా కొత్త రైల్వే ట్రాకులు వేశాంవందల సంఖ్యలో ఓవర్ బ్రిడ్జిలుఅండర్ బ్రిడ్జిలు నిర్మించాంబ్రాడ్‌గేజ్ లైన్లలో మానవ రహిత క్రాసింగ్‌ పూర్తిగా తొలగిపోయాయిఫలితంగా ప్రమాదాలు తగ్గి ప్రయాణికుల భద్రత మెరుగవుతుందిఅంతేకాకుండాసరకు రవాణా కారిడార్ల వంటి అధునాతన రైల్వే వ్యవస్థల అభివృద్ధి వేగంగా జరగుతోందిఈ ప్రత్యేక కారిడార్లు సాధారణ ట్రాకులపై భారాన్ని తగ్గించిహైస్పీడు రైళ్ల కార్యకలాపాలకు అవకాశాలను సృష్టిస్తాయి.

మిత్రులారా,

భారతీయ రైల్వేల్లో వస్తున్న మార్పులు ఉద్యోగ అవకాశాలను కూడా మెరుగుపరుస్తున్నాయిమేడిన్ ఇండియా తరహా కార్యక్రమాలుమెట్రోలురైల్వేల కోసం ఆధునిక కోచ్‌లుస్టేషన్ల పునర్నిర్మాణంసోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, ‘వన్ స్టేషన్వన్ ప్రొడక్ట్’ లాంటి కార్యక్రమాల అమలు ద్వారా లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతోందిగడచిన దశాబ్దంలో లక్షలాది యువత రైల్వేల్లో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు పొందారుకొత్త రైలు కోచుల నిర్మాణానికి ఉపయోగించే ముడి పదార్థాలు ఇతర పరిశ్రమల నుంచి వస్తాయని గుర్తించడం ముఖ్యంఈ పరిశ్రమల్లో పెరుగుతున్న డిమాండ్ కూడా ఎన్నో ఉద్యోగావకాశాలను సృష్టిస్తుందిరైల్వే అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మొదటి గతిశక్తి విశ్వవిద్యాలయాన్ని భారత్ ప్రారంభించుకుందిఇది ఓ కీలకమైన ముందడుగు.

స్నేహితులారా,

రైల్వే వ్యవస్థ విస్తరిస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా కొత్త ప్రధాన కార్యాలయాలుడివిజన్లు ఏర్పాటవుతున్నాయిజమ్మూ డివిజన్ జమ్మూ కాశ్మీర్‌కు మాత్రమే పరిమితం కాకుండా హిమాచల్ ప్రదేశ్పంజాబ్ లోని పలు నగరాలకు కూడా ప్రయోజనం అందిస్తుందిఅదనంగా లే – లదాఖ్  ప్రజలకు గొప్ప ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది.

మిత్రులారా,

రైల్వే మౌలిక వసతుల్లో జమ్మూ కాశ్మీర్‌ అద్భుతమైన ఘనతలను సాధిస్తోందిఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గం గురించి దేశవ్యాప్తంగా విస్తృతమైన చర్చ జరుగుతోందిఈ ప్రాజెక్టు జమ్మూ కాశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుందిదీనిలో భాగంగా నిర్మిస్తున్న  ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే ఆర్చ్ వంతెన అయిన చీనాబ్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందిఅలాగే దేశంలో మొదటి కేబుల్-స్టేడ్ రైల్ వంతెన అయిన అంజి ఖాడ్ రైలు వంతెన కూడా ఈ ప్రాజెక్టులో ఒక భాగమేఅసమానమైన ఇంజినీరింగ్ ప్రతిభకు ప్రతీకగా నిలిచిన ఈ రెండు వంతెనలు ఈ ప్రాంతంలో ఆర్థిక పురోగతిసంక్షేమాన్ని తీసుకుచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.

స్నేహితులారా,

జగన్నాథుని ఆశీస్సులతో సమృద్ధిగా సహజ వనరులతోవిస్తృతమైన తీరప్రాంతాన్ని కలిగి ఉన్న ఒడిశా అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలకు అవసరమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోందిప్రస్తుతం ఒడిశాలో కొత్త రైల్వే లైన్లపై దృష్టి సారిస్తూరూ. 70,000 కోట్లకు పైగా పెట్టుబడులతో అనేక ప్రాజెక్టులు కొనసాగుతున్నాయిఈ రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభమైన ఏడు గతి శక్తి సరకు రవాణా టెర్మినళ్లు వాణిజ్యాన్నిపారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నాయిఈ రోజు రాయగడ డివిజన్‌కు వేసిన పునాది రాయి ఈ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలను విస్తరిస్తుందిఈ అభివృద్ధి కార్యక్రమాలు ఒడిశాలో పర్యాటకంవాణిజ్యంఉద్యోగ అవకాశాలను మెరుగపరుస్తాయిముఖ్యంగా గిరిజన జనాభా అధికంగా ఉన్న దక్షిణ ఒడిశాకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందిజన్మన్ యోజన లాంటి కార్యక్రమాల ద్వారా అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నాంఈ మౌలిక వసతులు వారికి వరంగా మారతాయి.

మిత్రులారా,

తెలంగాణలో చర్లపల్లి  కొత్త టెర్మినల్ స్టేషన్ను ప్రారంభించడాన్ని గౌరవంగా భావిస్తున్నానుబాహ్య వలయ రహదారితో అనుసంధానమయ్యే ఈ స్టేషన్ ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేస్తుందిఆధునిక ప్లాట్‌ఫాంలులిఫ్టులుఎస్కలేటర్ల వంటి అధునాతన సౌకర్యాలు ఈ స్టేషన్లో ఉన్నాయిగమనించాల్సిన అంశం ఏంటంటే ఈ స్టేషన్ సౌర విద్యుత్తుతో పనిచేస్తుందిఈ టెర్మినల్ ఇప్పటికే ఉన్న సికింద్రాబాద్హైదరాబాద్కాచిగూడ టెర్మినళ్లపై పడే భారాన్ని తగ్గించి ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుందిజీవన సౌలభ్యంతో పాటు సులభతర వ్యాపార విధానాన్ని కూడా పెంచుతుంది.

మిత్రులారా,

నేడు దేశవ్యాప్తంగా ఆధునిక మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు గణనీయమైన కృషి జరుగుతోందిఎక్స్‌ ప్రెస్ మార్గాలుజల మార్గాలుమెట్రో వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్నాయిదేశంలోని విమానాశ్రయాలు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తున్నాయి. 2014లో దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య రెట్టింపై 150కి చేరుకుంది. 2014లో నగరాల్లో మాత్రమే మెట్రో సేవలు ఉంటే ఇప్పుడు అవి 21 నగరాలకు విస్తరించాయిఈ అద్భుతమైన ప్రగతితో సరితూగేలా రైల్వేలు సైతం నిరంతరం ఆధునికీకరణ చెందుతున్నాయి.

స్నేహితులారా,

ప్రతి పౌరుడి సమష్టి ఆకాంక్షగా మారిన వికసిత్ భారత్ ప్రణాళికలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ భాగమేమనందరం కలసి ఈ మార్గంలో పురోగతిని వేగవంతం చేస్తామని విశ్వసిస్తున్నానుఈ విజయాలు సాధించినందుకు గాను మరోసారి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ధన్యవాదాలు.

సూచన: ఇది ప్రధాని హిందీలో చేసిన ప్రసంగానికి ఇంచుమించు తెలుగు అనువాదం.

 

***


(Release ID: 2091049) Visitor Counter : 7