ప్రధాన మంత్రి కార్యాలయం
జనవరి 4న న్యూఢిల్లీలో గ్రామీణ భారత్ మహోత్సవ్ – 2025ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
మహోత్సవ ఇతివృత్తం: వికసిత్ భారత్ 2047 కోసం సుస్థిరమైన గ్రామీణ భారతాన్ని నిర్మించడం
గ్రామీణ భారతంలో వ్యాపార స్ఫూర్తిని, సాంస్కృతిక వారసత్వాన్ని వేడుకగా నిర్వహించడమే మహోత్సవ లక్ష్యం
Posted On:
03 JAN 2025 5:56PM by PIB Hyderabad
గ్రామీణ భారత్ మహోత్సవ్-2025ను జనవరి 4 ఉదయం 10.30గం.ల ప్రాంతంలో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభలో ఆయన ప్రసంగిస్తారు.
గ్రామీణ భారతదేశంలో వ్యాపార స్ఫూర్తి, సాంస్కృతిక వారసత్వమే ప్రధానాంశంగా నిర్వహించే ఈ మహోత్సవ్ జనవరి 4 నుంచి 9 వరకు కొనసాగుతుంది. ‘వికసిత్ భారత్ 2047 కోసం స్థిరమైన గ్రామీణ భారతాన్ని నిర్మించడం’ అనే ఇతివృత్తంతో, ‘‘గ్రామం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది - గావ్ బడే, తో దేశ్ బడే’’ స్ఫూర్తితో ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
చర్చలు, కార్యశాలలు, శిక్షణా తరగతుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను విస్తరించడంతో పాటు, స్వావలంబన సాధించిన ఆర్థిక వ్యవస్థను తయారు చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడమే ఈ మహోత్సవ్ లక్ష్యంగా నిర్దేశించారు. ఆర్థిక కార్యకలాపాలను అందరికీ చేరువ చేసి, సుస్థిర వ్యవసాయ పద్దతులను ప్రోత్సహిస్తూ, గ్రామీణ ప్రాంత ప్రజల్లో ముఖ్యంగా ఈశాన్య భారతంపై దృష్టి సారిస్తూ ఆర్థిక స్థిరత్వాన్ని, ఆర్థిక భద్రతను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.
ఈ మహోత్సవంలో దృష్టి సారించే అంశాలు:
ఔత్సాహిక ప్రారిశ్రామికవేత్తలుగా మహిళలను ప్రోత్సహించి వారికి సాధికారత కల్పించడం.
గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను సమష్టిగా మార్చే దిశగా ప్రణాళికలను రూపొందిచేందుకు ప్రభుత్వ అధికారులను, మేధావులను, గ్రామీణ ప్రాంతానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, కళాకారులను, వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఒక్కచోట చేర్చడం.
గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధిని పెంచేందుకు సాంకేతికత వినియోగం, వినూత్న పద్ధతులను అవలంబించడంపై చర్చలను ప్రోత్సహించడం.
శక్తిమంతమైన ప్రదర్శనలు, ఎగ్జిబిషన్ల ద్వారా భారతదేశ సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడం.
***
(Release ID: 2090059)
Visitor Counter : 53
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam