ప్రధాన మంత్రి కార్యాలయం
దూర ప్రాంతాల, మావోయిస్టు బాధిత ప్రాంతాల సర్వతోముఖ అభివృద్ధికి మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయం: ప్రధానమంత్రి
Posted On:
02 JAN 2025 10:20AM by PIB Hyderabad
మహారాష్ట్రలో సుదూరంగా ఉన్న ప్రాంతాల్లోనూ, మావోయిస్టు బాధిత ప్రాంతాల్లోనూ సర్వతోముఖ అభివృద్ధిని సాధించే దిశలో ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రశంసించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ స్పందించారు.
‘‘దూర ప్రాంతాల్లో, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అన్ని రంగాల్నీ అభివృద్ధిపథంలోకి నడిపేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయం. ఇది ప్రజల ‘జీవన సౌలభ్యాన్ని’ తప్పక పెంచడమే కాకుండా మరింత ఎక్కువ వికాసానికి కూడా బాటవేస్తుంది. గడ్చిరోలి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న నా సోదరీమణులకూ, నా సోదరులకూ ఇవే నా విశేష అభినందనలు’’.
"दुर्गम आणि माओवादग्रस्त भागाचा सर्वांगीण विकास करण्यासाठी महाराष्ट्र सरकार करत असलेल्या प्रयत्नांचे मी कौतुक करतो. यामुळे जीवन सुलभतेला निश्चितच चालना मिळेल आणि आणखी प्रगती साधण्याचा मार्ग प्रशस्त होईल. गडचिरोली आणि त्याच्या आजूबाजूच्या प्रदेशातील माझ्या बंधू भगिनींचे विशेष अभिनंदन !"
***
MJPS/SR
(Release ID: 2089515)
Visitor Counter : 26
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam