ఉప రాష్ట్రపతి సచివాలయం
మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్‌కు శ్రద్ధాంజలి ఘటించిన ఉపరాష్ట్రపతి
పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత, 1991లో భారత ఆర్థిక సరళీకృత విధానాల రూపశిల్పి, క్లిష్టమైన దశలో దేశాన్ని ధైర్యంగా నడిపించారు: మన్మోహన్ సింగ్ గురించి ఉపరాష్ట్రపతి
డా.సింగ్‌తో అర్థవంతమైన, ఆలోచనాత్మకమైన చర్చలు జరిపే అవకాశం తనకు దక్కిందన్న ఉపరాష్ట్రపతి
డా.సింగ్ మరణంతో గొప్ప మేధావిని, రాజనీతిజ్ఞున్ని దేశం కోల్పోయింది - ఉపరాష్ట్రపతి
Posted On:
26 DEC 2024 11:30PM by PIB Hyderabad
భారత మాజీ ప్రధాని, ప్రఖ్యాత ఆర్థికవేత్త డా. మన్మోహన్ సింగ్ మరణం పట్ల ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్కడ్ ఈరోజు సంతాపం వ్యక్తం చేశారు.
ఎక్స్‌లో ఉపరాష్ట్రపతి పోస్టు:
‘‘మాజీ ప్రధానమంత్రి, గొప్ప ఆర్థిక వేత్త, భారత ఆర్థిక వ్యవస్థ దశను మార్చిన వ్యక్తి డా. మన్మోహన్ సింగ్ మరణం గురించి తెలిసి బాధపడ్డాను. పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత, 1991లో ఆర్థిక సరళీకృత విధానాల రూపశిల్పి, క్లిష్టమైన దశలో దేశాన్ని ధైర్యంగా నడిపిన వ్యక్తి, అభివృద్ధి, సంక్షేమం కోసం కొత్త మార్గాలు ఏర్పాటు చేసిన వ్యక్తి.
డా.సింగ్‌తో ఆయన నివాసంలో అర్థవంతమైన, లోతైన చర్చలు జరిపే అవకాశం భారత ఉపరాష్ట్రపతిగా నాకు దక్కింది. ఆర్థికశాస్త్రంపై ఆయనకున్న అపార అవగాహన, మృదు స్వభావం, దేశాభివృద్ధి పట్ల అంచంచలమైన నిబద్ధత నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి.
డా. సింగ్ మరణంతో భారతదేశం గొప్ప మేధావిని, రాజనీతిజ్ఞున్ని కోల్పోయింది. ఆయన చూపిన మార్గం ఎప్పటికీ భారత వృద్ధిలో దిశానిర్దేశం చేస్తూనే ఉంటుంది. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’
***
(Release ID: 2088551)
Visitor Counter : 30