ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఢిల్లీలో వీర బాల దినోత్సవంలో పాల్గొననున్న ప్రధానమంత్రి

‘సుపోషణ్ పంచాయిత్ అభియాన్’ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

Posted On: 25 DEC 2024 1:58PM by PIB Hyderabad

దేశ భవిష్యత్తుకు బాలలనే పునాదిగా చాటే దేశవ్యాప్త వేడుక అయిన వీర బాల దివస్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారున్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ కార్యక్రమం జరగనుందిఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలోనూ ఆయన ప్రసంగిస్తారు.

సుపోషిత్ గ్రామ పంచాయితీ అభియాన్ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారుపోషకాహార సంబంధిత సేవల అమలును విస్తతం చేయడంక్రియాశీల సామాజిక భాగస్వామ్యం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించడంతోపాటు ప్రజా శ్రేయస్సును పెంపొందించడం దీని లక్ష్యం.

యువతను భాగస్వాములను చేయడానికిఈ రోజు ప్రాధాన్యాన్ని ప్రాచుర్యంలోకి తేవడానికిదేశంలో ధైర్యం – అంకితభావంతో కూడిన సంస్కృతిని పెంపొందించడానికీ దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారుమై గవ్మైభారత్ పోర్టల్ ల ద్వారా క్విజ్ లతోపాటు వరుస ఆన్లైన్ పోటీలను నిర్వహిస్తారుకథాకథనంసృజనాత్మక రచనపోస్టర్ తయారీ తదితర ఆసక్తికరమైన కార్యక్రమాలను పాఠశాలలుబాలల సంరక్షణ కేంద్రాలుఅంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తారు.

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (పీఎంఆర్ బీపీగ్రహీతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.  


(Release ID: 2087963) Visitor Counter : 29