ప్రధాన మంత్రి కార్యాలయం
తబలా విద్వాంసుడు ఉస్తాద్ జకీర్ హుస్సేన్‌కు ప్రధాని నివాళి
Posted On:
16 DEC 2024 12:08PM by PIB Hyderabad
దిగ్గజ తబలా విద్వాంసుడు జకీర్ హుస్సేన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు నివాళులు అర్పించారు.
‘‘దిగ్గజ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జకీర్ హుస్సేన్ మరణవార్త దిగ్భ్రాంతి కలిగించింది. భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచ రూపురేఖలు మార్చిన ప్రతిభావంతునిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. తన అసమాన లయతో లక్షల మందిని ఆకర్షించి, తబలా వాయిద్యానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చారు. భారతీయ శాస్త్రీయ సంప్రదాయాలను, అంతర్జాతీయ సంగీతంతో మేళవించి సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా మారారు.
ఆయన ప్రదర్శనలు, మనోహరమైన సంగీత స్వరకల్పన సంగీత కళాకారులకు, సంగీత ప్రియులకు స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయి. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, సంగీత ప్రపంచానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని శ్రీ మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
***
MJPS/SR
(Release ID: 2084758)
Visitor Counter : 38
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada