ప్రధాన మంత్రి కార్యాలయం
టీబీ వ్యాప్తి అధికంగా ఉన్న జిల్లాలపై దృష్టి సారిస్తూ 100 రోజుల ప్రత్యేక ప్రచారం ఈరోజు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన ప్రధానమంత్రి
Posted On:
07 DEC 2024 2:38PM by PIB Hyderabad
టీబీ వ్యాధిని నివారించే దిశగా భారత్ సాగిస్తున్న పోరాటం ఇప్పుడే బలపడుతుందని వివరిస్తూ, ఈ వ్యాధి ఎక్కువగా ఉన్న జిల్లాలపై ప్రధాన దృష్టి సారించి 100 రోజుల ప్రత్యేక ప్రచారాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా రాసిన కథనాన్ని చదవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఎక్స్ లో చేసిన పోస్టులో శ్రీ మోదీ:
‘‘టీబీని నివారించే దిశగా మన పోరాటం ఇప్పుడే బలపడింది!
టీబీని ఓడించేందుకు సామూహిక స్ఫూర్తితో, వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న జిల్లాలపై ప్రధాన దృష్టి సారిస్తూ.. 100 రోజుల ప్రత్యేక ప్రచారం ఈ రోజు ప్రారంభమవుతుంది. టీబీ వ్యాధిపై వివిధ పద్దతుల్లో భారత్ పోరాడుతోంది:
(1) రోగులకు అందించే సాయాన్ని రెట్టింపు చేయడం
(2) జన్ భాగీదారి
(3) కొత్త ఔషధాలు
(4) రోగనిర్ధారణలో సాంకేతికత, మెరుగైన పరికరాల వినియోగం
టీబీని నిర్మూలించేందుకు అందరూ కలసి మన వంతు కృషి చేద్దాం.’’
కేంద్ర మంత్రి శ్రీ జేపీ నడ్డా ఎక్స్ లో చేసిన పోస్టుకు స్పందిస్తూ శ్రీ మోదీ:
‘‘భారత్‌ను టీబీ రహిత దేశంగా మార్చేందుకు మేం నిరంతరం తీసుకుంటున్న చర్యల గురించి ఆరోగ్య మంత్రి శ్రీ జేపీ నడ్డా ఆలోచనాత్మక కథనం రాశారు. దాన్ని చదవండి. @JPNadda’’
(Release ID: 2082202)
Visitor Counter : 42
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam