ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

పౌర, రక్షణ రంగాల కింద 85 నూతన కేంద్రీయ విద్యాలయాల ప్రారంభానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం:


కర్ణాటక శివమొగ్గ కేంద్రీయ విద్యాలయంలోని అన్ని తరగతుల్లో రెండేసి అదనపు సెక్షన్లకు కూడా ఆమోదం

Posted On: 06 DEC 2024 8:01PM by PIB Hyderabad

కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన కీలక నిర్ణయాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందితాజా నిర్ణయాల ప్రకారం పౌరరక్షణ రంగాలకు కలిపి 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలు (కేవీమంజూరయ్యాయిపెరిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సౌకర్యార్థం కేంద్రీయ విద్యాలయ పథకం (కేంద్ర రంగ పథకంద్వారా కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని కేవీ శివమొగ్గలో ప్రతి తరగతికీ రెండు అదనపు సెక్షన్లను మంజూరు చేయాలన్న సీసీఈఏ నిర్ణయం పాఠశాల విస్తరణకు దోహదపడుతుంది. 86 కేవీలతో కూడిన జాబితా దిగువన చూడొచ్చు.

2025-26 తో ప్రారంభమై ఎనిమిదేళ్ళ వ్యవధిలో రూ. 5872.08 కోట్ల ఖర్చుతో 85 కొత్త కేవీల స్థాపనశివమొగ్గ కేవీ విస్తరణ పనులు పూర్తవగలవని అంచనామూలధన వ్యయం కింద సుమారు రూ. 2862.71 కోట్లునిర్వహణ పనుల కోసం సుమారు రూ. 3009.37 కోట్లను ఖర్చు చేస్తారు.

దేశవ్యాప్తంగా గల 1256 క్రియాశీల పాఠశాలలువిదేశాల్లోని మూడు కేవీలు మాస్కోఖాట్మండుటెహరాన్ శాఖల్లో కలిపి సుమారు 13.56 లక్షల మంది విద్యార్థులు కేవీల్లో విద్యనభ్యసిస్తున్నారు.

960 విద్యార్థులతోపూర్తి సామర్థ్యంతో నడిచే కేవీల్లో సేవలందించేందుకు సంఘటన్ నిబంధనల మేరకు పలు పోస్టులు అవసరమవుతాయిదరిమిలా 960 X 86 = 82,560 విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక్కో పూర్తి స్థాయి కేవీ 63 మందికి ఉపాధిని అందిస్తుందితాజాగా ఆమోదించిన 85 కేవీలువిస్తరణ మంజూరైన ఒక కేవీ కలిపి ఒక్కో పాఠశాలలో 33 అదనపు పోస్టులు అవసరమవుతాయిదీనివల్ల 5,388 మందికి నేరుగా శాశ్వత ఉపాధి లభిస్తుందిపాఠశాలల నిర్మాణ పనులు సహా అనుబంధ కార్యకలాపాల కోసం నైపుణ్యం కలిగిననైపుణ్యం అవసరం లేని అనేకమంది కార్మికులకు ఉపాధి దొరికే అవకాశం ఉందిబదిలీలు కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులురక్షణరంగ ఉద్యోగుల పిల్లలకు ప్రాంతాలవారీ తారతమ్యాలు లేని ఉన్నత విద్యను అందించాలన్న ఉద్దేశంతో 1962 నవంబర్ లో భారత ప్రభుత్వం కేవీలను ప్రారంభించిందితదనంతరంకేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖలో “సెంట్రల్ స్కూల్స్ ఆర్గనైజేషన్” భాగమయ్యిందితొలుత, 1963-64 విద్యా సంవత్సరంలో సైనిక కేంద్రాల్లోని 20 రెజిమెంటల్ పాఠశాలలను కేంద్రీయ విద్యాలయాలుగా మార్పు చేశారు.

బదిలీలు కలిగినబదిలీలు లేని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు – సైనికోద్యోగులుపారామిలిటరీ దళాలుఒక ప్రాంతం నుంచీ మరో ప్రాంతానికి ఉద్యోగరీత్యాలేక ఇతర కారణాల వల్ల నివాసాన్ని మార్చుకునే వారుమారుమూల ప్రాంతాలువెనుకబడిన ప్రాంతాల్లో నివసించే ఉద్యోగుల పిల్లల కోసం ప్రాథమికంగా కేవీలను ప్రారంభించారు.

2020 నూతన విద్యా విధానం అమలవుతున్న పాఠశాలుగాదాదాపు అన్ని కేంద్రీయ విద్యాలయాలు ‘పీఎంశ్రీ’ పాఠశాలలుగా గుర్తింపు పొందాయిఇతర పాఠశాలలకు మార్గదర్శులుగా నిలుస్తున్నాయిఉత్తమ విద్యా ప్రమాణాలుసృజనాత్మక బోధనా పద్ధతులుమెరుగైన సౌకర్యాలు కలిగిన కేవీల్లో తమ పిల్లలను చేర్చాలని తల్లితండ్రులు ఉబలాడపడటం పరిపాటిప్రజాదరణ చూరగొన్న ఈ పాఠశాలల్లో ప్రవేశానికి ఆదరణ పెరుగుతూ ఒకటో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య నానాటికీ పెరుగుతోందిసీబీఎస్సీ నిర్వహించే బోర్డు పరీక్షలలో కేవీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తూఇతర బోర్డుల విద్యార్థులకు సరిసమానంగా రాణిస్తున్నారు.

 

***


(Release ID: 2082040) Visitor Counter : 40