ప్రధాన మంత్రి కార్యాలయం
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాపరినిర్వాణ్ దివస్: శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
06 DEC 2024 9:12AM by PIB Hyderabad
ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాపరినిర్వాణ్ దివస్. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. సమానత్వ సాధన కోసం, మానవ ఆత్మ గౌరవాన్ని పరిరక్షించడం కోసం డాక్టర్ అంబేద్కర్ అలుపెరుగక చేసిన పోరాటం తరాల తరబడి ప్రేరణను అందిస్తూనే ఉంటుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘మన రాజ్యాంగ శిల్పి, సామాజిక న్యాయానికి దీపస్తంభం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాపరినిర్వాణ్ దివస్ సందర్భంగా మనమంతా ఆయనకు ప్రణామాలు చెబుదాం.
ఆత్మగౌరవాన్ని, సమానత్వాన్ని పరిరక్షించడానికి డాక్టర్ అంబేద్కర్ అలసట ఎరుగక చేసిన పోరాటం తరాల తరబడి ప్రేరణను అందిస్తుంది. ఈ రోజు, మనం ఆయన సేవలను గుర్తుకు తెచ్చుకొంటూ, ఆయన దార్శనికతను సాకారం చేద్దామన్న మన కట్టుబాటును పునరుద్ఘాటించుదాం.
ఈ సంవత్సరం మొదట్లో ముంబయిలో చైత్య భూమిని నేను సందర్శించినప్పటి ఒక చిత్రాన్ని కూడా ఇక్కడ పంచుకొంటున్నాను.
జై భీమ్’’.
***
MJPS/VJ
(रिलीज़ आईडी: 2081403)
आगंतुक पटल : 76
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam