ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ స్క్వాష్ క్రీడాకారుడు శ్రీ రాజ్ మన్‌చందా కన్నుమూత ప్రధానమంత్రి సంతాపం
నాడు పోస్టు చేయడమైనది:
04 DEC 2024 3:42PM by PIB Hyderabad
ప్రముఖ స్క్వాష్ క్రీడాకారుడు శ్రీ రాజ్ మన్‌చందా ఈ రోజు మరణించారు. దీనిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీ రాజ్ మన్‌చందా సిసలైన భారతీయ స్క్వాష్ దిగ్గజం. అంకితభావం, ప్రావీణ్యం కలిగిన క్రీడాకారునిగా ఆయన ప్రసిద్ధి చెందారంటూ శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. శ్రీ మన్‌చందా సైన్యంలో పనిచేసి దేశానికి సేవలందించారంటూ ప్రధాని కొనియాడారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి పొందుపరిచిన ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘శ్రీ రాజ్ మన్‌చందా జీ మరణించారన్న వార్త విని బాధపడ్డాను. అంకితభావం, ప్రావీణ్యత కలిగిన క్రీడాకారునిగా ప్రసిద్ధి పొందిన ఆయన, భారతదేశ స్క్వాష్ రంగంలో సిసలైన దిగ్గజ క్రీడాకారుడు. ఆయన సాధించిన కీర్తికి తోడు, ఆట పట్ల ఆయనకున్న ప్రేమ.. నవతరానికి ప్రేరణనివ్వగలిగిన ఆయన దక్షత ఆయనను విశిష్ట స్థానంలో ఉంచాయి. ఒక్క స్క్వాష్ కోర్టులోనే కాకుండా, సైన్యంలో పనిచేయడం ద్వారా ఆయన దేశానికీ సేవలు అందించారు. ఆయన కుటుంబ సభ్యులకూ, అభిమానులకూ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి: ప్రధానమంత్రి @narendramodi”
***
MJPS/SR
(రిలీజ్ ఐడి: 2080896)
సందర్శకుల సూచీ సంఖ్య : : 81
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam