సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
iffi banner

కొన్యాక్: ఫిలిం బజార్ 2024లో స్క్రీన్ రైటర్ ల్యాబ్ విజేతగా నిలిచిన చిత్రం

ఔత్సాహిక దర్శకులను ప్రోత్సహించేందుకు నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్‌డీసీ) నిర్వహించిన 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) వేడుకలతో పాటు ఫిలిం బజార్ 2024 అట్టహాసంగా ముగిసింది. ప్రతిష్ఠాత్మక స్క్రీన్ రైటర్స్ ల్యాబ్‌ విజేతగా ఫీచర్ చిత్రం కొన్యాక్ నిలిచిందన్న ప్రకటన కార్యక్రమ ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలిచింది. ఎన్ఎఫ్‌డీసీ స్క్రీన్ రైటర్స్ ల్యాబ్‌, 2024నకు ఎంపికైన కొన్యాక్ అందరి దృష్టిని ఆకర్షించింది. రూ.100 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సినీ నిర్మాతలు ముందుకు వచ్చారు.

ఉద్ధవ్ ఘోష్ రచించిన ‘కొన్యాక్’ ద్వారా పంకజ్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతారు. ఆయన తుంబాడ్ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆ చిత్రంలో ప్రేక్షకులను లీనమయ్యేలా చేసిన ఆయన, ఈసారి తన కథన నైపుణ్యంతో ‘కొన్యాక్’ను తెరకెక్కిస్తారు. ఈ చిత్రం గురించి ఉత్సాహంగా వివరిస్తూ ‘‘కొన్యాక్ యాక్షన్ కథ మాత్రమే కాదు. ఇది నాగాలాండ్ యోధులు, సమాజం, తప్పును సహించని తత్వాల అంతరంగ అన్వేషణ. దీని ద్వారా గొప్ప సినిమా అనుభూతిని, దేనికీ లొంగని స్ఫూర్తిని ప్రేక్షకులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని పంకజ్ కుమార్ తెలిపారు.

అంతర్జాతీయ నిపుణురాలు క్లెయిర్ డొబిన్ మార్గనిర్దేశం చేసిన ‘కొన్యాక్’ కథ- మనుగడ, గౌరవం, విముక్తి అనే సార్వజనీన ఇతివృత్తాలతో సంస్కృతిని జోడించిన శక్తివంతమైన సినిమాగా మెరిసింది. స్క్రీన్ రైటర్స్ లాబ్ మెంటార్ క్లెయిర్ ఈ కథను ప్రశంసిస్తూ, ‘‘మోసం, ధైర్యం, ఎదుర్కోగల సామర్థ్యాన్ని తెలియజేస్తూనే మరచిపోలేని, అంతగా ప్రాచుర్యం పొందని వ్యక్తులను కొన్యాక్ వెలుగులోకి తీసుకువస్తుంది’’ అని అన్నారు. ఈ కథనానికి మరింత పదును పెట్టేందుకు, ఈ ప్రాంత చరిత్రకు, సంస్కృతికి లోబడి ఉంటూనే జానపద కథలు, వాస్తవాన్ని మిళితం చేయడానికి అవసరమైన వేదికను ఉద్ధవ్ ఘోష్‌కు ల్యాబ్ అందించింది. సాంస్కృతిక వారసత్వం, వాస్తవికత మాయాజాలం, ఆకర్షణీయమైన కథల మేళవింపుతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుంది. అలాగే భారతీయ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్టుగా మలచడంలో ఫిలింబజార్ లాంటి కార్యక్రమాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలియజేస్తుంది.

ఫిలిం బజార్ 2024 స్క్రీన్ రైటర్స్ ల్యాబ్ లో తీర్చిదిద్దిన ఎన్నో కథలు జాతీయ, అంతర్జాతీయ చిత్రదర్శకుల దృష్టిని ఆకర్షించాయి. ఇది మార్కెట్ డిమాండుకు అనుగుణంగా సృజనాత్మక ప్రతిభను అందించేందుకు ఈ ల్యాబ్ చేస్తున్న నిరంతర ప్రయత్నాలను ఇది సూచిస్తుంది.

ఎన్ఎఫ్‌డీసీ స్క్రీన్ రైటర్స్ ల్యాబ్ గురించి

ఈ ఏడాది ఎన్ఎఫ్‌డీసీకి 21 రాష్ట్రాల నుంచి వచ్చిన 150 దరఖాస్తుల నుంచి వివిధ సాహిత్య ప్రక్రియలకు చెందిన 6 ప్రాజెక్టులను ఎన్ఎఫ్‌డీసీ స్క్రీన్‌రైటర్స్ ల్యాబ్ 18వ ఎడిషన్‌కు ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా అసలైన కథలను అభివృద్ధి చేసి, ప్రోత్సహించి, మద్దతు అందించే కార్యక్రమం ఇది. నవలా రచయితలుగా, ప్రకటనలకు, లఘుచిత్రాలకు, డాక్యుమెంటరీలు, ఫీచర్ చిత్రాలకు పనిచేసిన అనుభవం ఈ ఆరుగురు కథా రచయితలకు ఉంది. అలాగే హిందీ, ఉర్దూ, పహాడీ, పంజాబీ, అస్సామీ, మలయాళం, కొన్యాక్, ఇంగ్లీష్, మైథిలీ సహా ఎంపిక చేసిన వివిధ భాషల్లో స్క్రిప్టులు కూడా వీరు రాశారు.

ఎన్ఎఫ్‌డీసీస్క్రీన్ రైటర్స్ ల్యాబ్2024కుఎంపికైన ఆరు చిత్రాల వివరాలను ఇక్కడ చదవండి.

2007 నుంచి ఫిల్మ్ బజార్ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఎన్ఎఫ్‌డీసీ స్క్రీన్ రైటర్స్ ల్యాబ్ ముఖ్యమైనది. ప్రఖ్యాత కథా రచయితలు, సినిమా నిపుణుల మెంటార్‌షిప్ ను అందించడం ద్వారా ఔత్సాహికుల ప్రతిభను మెరుగుపరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. అంతర్జాతీయ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథలను సిద్ధం చేయడంకథన నైపుణ్యాలను పెంపొందించేలా చేయడమే ఈ కార్యక్రమాన్ని కథారచయితలకు గుర్తింపుతోడ్పాటు అందించే ముఖ్యమైన వేదికగా మార్చింది. కొన్నేళ్లుగా ఈ ల్యాబ్ నుంచి వెళ్లిన అనేక చిత్రాలు విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు వాణిజ్యపరమైన విజయాన్ని సాధించాయిఆ బాటలోనే నడిచేందుకు ‘కొన్యాక్’ సిద్ధంగా ఉంది

***

iffi reel

(Release ID: 2080201) Visitor Counter : 36