ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్రలోని గోండియాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని సంతాపం
పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్-గ్రేషియా ప్రకటించిన పీఎం
Posted On:
29 NOV 2024 4:53PM by PIB Hyderabad
మహారాష్ట్రలోని గోండియాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మరణించిన వారి కుటుంబానికి రూ. 2 లక్షల ఎక్స్-గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.
ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ హ్యాండిల్లో చేసిన పోస్టు:
‘‘మహారాష్ట్రలోని గోండియాలో జరిగిన బస్సు ప్రమాదం బాధ కలిగించింది. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలి . స్థానిక యంత్రాంగం బాధితులకు అవసరమైన సాయం అందజేస్తుంది.
మరణించినవారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్ - గ్రేషియా అందుతుంది. గాయపడినవారికి రూ.50,000 ఆర్థిక సాయం లభిస్తుంది: పీఎం @narendramodi’’
***
MJPS/SR
(Release ID: 2079365)
Visitor Counter : 52
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam