సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav
iffi banner

గోల్డెన్ పీకాక్ గెలుచుకున్న లిథువేనియన్ చిత్రం ‘టాక్సిక్’


ఉత్తమ నటి పురస్కారాన్ని సంయుక్తంగా అందుకున్న వెస్టా మాటులిటే, ఐవా రుపేయికైటే

 గోవాలో జరుగుతున్న 55వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ప్రకటన వెలువడింది. ఇఫీ 2024లో ఉత్తమ కథాచిత్రం (ఫీచర్ ఫిల్మ్)గా లిథువేనియన్ చిత్రం ‘టాక్సిక్’ ప్రతిష్ఠాత్మక గోల్డెన్ పీకాక్ పురస్కారాన్ని దక్కించుకుంది.

 

నిర్మాత గీదర్ బురోకైట్ తో కలిసి దర్శకుడు సాల్ బ్లూవైట్ గోల్డెన్ పీకాక్ ట్రోఫీ, సర్టిఫికేట్, రూ. 40,00,000 నగదు బహుమతిని పంచుకుంటారు.

పూర్తి భౌతిక, సామాజిక నేపథ్యంలో సునిశిత్వం, సహానుభూతులతో కౌమార దశను చిత్రిస్తూ తెరకెక్కించిన చిత్ర కథనాన్నీ, సినిమానీ న్యాయనిర్ణేతలు అభినందించారు.

‘‘కౌమార దశనూ, ఆర్థికంగా వెనుకబడిన దేశాల్లో పెరగడానికి సంబంధించి కఠినమైన వాస్తవాలనూ అత్యంత సునిశితత్వం, సహానుభూతులతో చిత్రించడం.. అదేవిధంగా భౌతిక, సామాజిక నేపథ్యంలో కౌమార దశను చిత్రిస్తూ కథనాన్ని నడిపించడం’’ ద్వారా టాక్సిక్ ఉత్తమ చిత్రంగా నిలిచిందని న్యాయనిర్ణేతలు వ్యాఖ్యానించారు.

కలుషితమైన భౌతిక, సామాజిక వ్యవస్థల నేపథ్యంలో వచ్చిన కౌమార దశ కథకు ఆ పేరు అచ్చంగా సరిపోయింది. దౌర్బల్యంలోనూ, ఉన్నత స్థితిలో ఉన్నప్పుడూ.. అన్ని రకాల పరిస్థితుల్లో మానవ శరీరపు తీరు టాక్సిక్ సినిమాలో కేంద్ర బిందువు.

పదమూడేళ్ల వయస్సున్న మరీజా తన అమ్మమ్మతో కలిసి నివసిస్తున్న ఓ పారిశ్రామిక ప్రాంతంలో తను ఇమడలేకపోతూ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందో చిత్రంలో చూడొచ్చు. ఎప్పుడూ కొట్లాడుతూ ఉండే తన మిత్రురాలు క్రిస్టినాతో మరీజా స్నేహం ఎప్పుడూ స్థిరంగా ఉండేది కాదు. వారిద్దరూ స్థానికంగా ఉన్న ఓ మోడలింగ్ స్కూలులో చేరారు. మసకబారిన, మారుమూల బతుకులకు దూరంగా.. ఆకర్షణీయమైన జీవితాన్ని పొందేలా చేస్తామని ఆ స్కూల్ వారికి మాటిచ్చింది. అయితే, ఆ స్కూలు కోసం కావాల్సిన ఆర్థిక, భౌతిక అవసరాల కారణంగా అసాధ్యమైన సౌందర్య ప్రమాణాలకు అనుగుణంగా వారి యువ దేహాలను మలచుకోవడానికి అత్యంత కఠినమైన, ప్రమాదకరమైన మార్గాలను వారు ఎంచుకోవాల్సి వచ్చింది.

ఈ చిత్రంలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను వెస్టా మాటులిటే, ఐవా రుపేయికైటే సంయుక్తంగా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు“తొలిసారి నటించిన ఈ ఇద్దరూ అసాధారణ ప్రతిభ కనబరిచారు. భౌతికంగా, భావోద్వేగపరంగా మరీజా, క్రిస్టినా పాత్రలతో తాదాత్మ్యం చెందారు. ఈ పాత్రలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అని న్యాయ నిర్ణేతలు వ్యాఖ్యానించారు. 

 

***

iffi reel

(Release ID: 2078879) Visitor Counter : 48