ప్రధాన మంత్రి కార్యాలయం
భారతీయ చరిత్రన్నా, సంస్కృతన్నా ప్రపంచంలో ఉత్సాహం వ్యక్తమవుతున్నందుకు సంతోషంగా ఉంది: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
28 NOV 2024 4:49PM by PIB Hyderabad
భారతీయ చరిత్ర, సంస్కృతుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉత్సాహం వ్యక్తమవుతూ ఉన్నందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సంతోషాన్ని ప్రకటించారు. భారతీయ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పాత్రమవుతోందని ఆయన అన్నారు. తన విదేశీ పర్యటనల దృశ్యాలను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ షేర్ చేస్తూ మన సంస్కృతి అన్నా, మన చరిత్ర అన్నా ఎనలేని ఉత్సాహం వ్యక్తమవుతూ ఉండడం హర్షణీయమన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ నరేంద్ర మోదీ ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘భారతీయ సంస్కృతి ప్రపంచం నలుమూలలా ఆదరణపాత్రమవుతోంది.
నేను ఎక్కడికి వెళ్ళినా సరే మన చరిత్ర, మన సంస్కృతి అంటే ఎక్కడలేని ఉత్సుకత వ్యక్తమవుతూ ఉండడాన్ని గమనిస్తున్నాను. ఇది ఎంతో హర్షణీయంగా ఉంది. ఇవిగో, ఇక్కడ కొన్ని దృశ్యాలను మీరు కూడా చూడండి..’’
***
MJPS/VJ
(रिलीज़ आईडी: 2078610)
आगंतुक पटल : 58
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam