ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ శశికాంత్ రూయా కన్నుమూత పట్ల ప్రధానమంత్రి సంతాపం
నాడు పోస్టు చేయడమైనది:
26 NOV 2024 9:17AM by PIB Hyderabad
పారిశ్రామిక జగతిలో ఒక సమున్నత వ్యక్తి శ్రీ శశికాంత్ రూయా మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. వృద్ధిలో, నూతన ఆవిష్కరణలలో ఉన్నత ప్రమాణాలను ఆయన స్థాపించారంటూ శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పొందుపరచిన ఒక సందేశంలో ప్రధాని ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘శ్రీ శశికాంత్ రూయా పారిశ్రామిక జగతిలో సమున్నత వ్యక్తి. దూరాలోచనలు చేసిన ఆయన నాయకత్వ సామర్థ్యం, శ్రేష్ఠత్వాన్ని సాధించడానికి ఆయన కనబరిచిన తపన భారతదేశ వ్యాపార ముఖచిత్రంలో పెనుమార్పులను తీసుకువచ్చాయి. వృద్ధిలో, నూతన ఆవిష్కరణలలో ఉన్నత ప్రమాణాలను స్థాపించారాయన. ఆయనలో ఎన్నెన్నో ఉపాయాలు పొంగి పొర్లుతుండేవి. మన దేశాన్ని మనం ఏ విధంగా మెరుగుపరచ గలమనే ఆయన ఎల్లప్పుడూ చర్చిస్తూ ఉండేవారు.
శశి రూయా ఇక మన మధ్య లేకపోవడం చాలా బాధను కలిగిస్తోంది. ఈ దుఃఖ ఘడియలో ఆయన కుటుంబానికి, ఆయన ప్రియతములకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓమ్ శాంతి.’’
***
MJPS/SR
(రిలీజ్ ఐడి: 2077396)
సందర్శకుల సూచీ సంఖ్య : : 73
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam