సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
iffi banner
0 4

సాహిత్యానికి దగ్గరగా ఉన్నపుడే మంచి సినిమా సాధ్యం: 55 ఇఫీలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం వ్యాఖ్య


గౌతం వి. మీనన్ తో చర్చ: ఇఫి మాస్టర్ క్లాస్ ద్వారా
వర్ధమాన దర్శకుల్లో స్ఫూర్తిని నింపిన మణిరత్నం

55వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం సందర్భంగా ‘‘అజరామరమైన సాహిత్యాన్ని గొప్ప సినిమాలుగా మార్చడం ఎలా?’’ అన్న అంశంపై ప్రముఖ దర్శకుడు మణిరత్నం అందించిన మాస్టర్ క్లాస్ ఆహూతులను ఆకట్టుకున్నదిఈ అంశంపై మరో ప్రముఖ దర్శకుడు గౌతం విమీనన్ తో మాట్లాడుతూ... సాహిత్యాన్ని సినిమాగా మలచడంలోని మెళకువలను ఆయన వివరించారుఆయన చెప్పిన అంశాలు సినిమా దర్శకులకూసినీ ప్రేమికులకూ ఉపయుక్తంగా ఉన్నాయి.

కథ చెప్పడం... జీవితంలో ఎన్నటికీ తీరని ఒక ఆకాంక్ష అన్న తన అభిప్రాయాన్ని ప్రతిఫలిస్తూ...తాను ఇంకా ‘‘ప్రేక్షకులతోపాటు కూర్చొని ఉండే ఒక ప్రేక్షకుడినే’’ అని చెప్పారు దర్శక దిగ్గజం మణిరత్నంసినిమా నిర్మాణంలో ఎన్నో విజయాలు సాధించినప్పటికీ... ‘‘నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను’’ అని వ్యాఖ్యానించారు మణిరత్నం.

సాహిత్యానికీసినిమాకీ మధ్య ఉన్న బంధం గురించి మణిరత్నం చెబుతూ... ‘‘సినిమాకీసాహిత్యానికీ మధ్య బంధం ఎంత దగ్గరగా ఉంటే భారతీయ సినిమా అంత గొప్పగా ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డారుకాగితంపై ఉన్న అక్షరాలను... అందమైన దృశ్యమాలికలుగా మర్చే కళను దర్శకులు అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు.

సాహిత్యానికి దృశ్యమాధ్యమం ద్వారా ప్రాణప్రతిష్ఠ

పుస్తకాలను సినిమాలుగా మలచడంలో ఉన్న నైపుణ్యాన్ని గురించి ప్రస్తావిస్తూ ‘‘సినిమాలు దృశ్యమాధ్యమంలో ఉంటాయిపుస్తకాలు... ఊహాజనితంపాఠకుల ఊహలకు ప్రాణ ప్రతిష్ఠ చేసే విషయంలో దర్శకుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది’’ అని అన్నారుస్క్రిప్టులో అనేక మార్పులు చేయాల్సి వస్తుందనిఅయితేఅసలు విషయాన్ని పూర్తిగా మార్చివేయడం కాకుండాపుస్తకంలోని కథ మరింత గొప్పగా మారేదిగా ఉండాలని హితవు పలికారు.


 

పురాణ గాధలూభారతీయ పురాతన చరిత్రతన దృక్పథాన్ని మార్చాయనిపాత్రలను వైవిధ్యంగా తాను చూడటానికి కారణమిదేనని వెల్లడించారుసాహిత్యంలో ఉండే భాషాపటాటోపాన్ని సినిమా స్క్రిప్టులోకి తేవడంలో ఉండే సవాళ్ల గురించి ప్రస్తావిస్తూ... స్క్రిప్టు ప్రకారం నటీనటులు సహజసిద్ధంగా నటించేలా చూడాల్సిన అవసరం కూడా ఉందని అన్నారు.

1955లో కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ‘పొన్నియన్ సెల్వన్’ ఆధారంగా అదే పేరుతో ఇటీవల తాను తీసిన భారీ సినిమా గురించి ప్రస్తావిస్తూ... ప్రస్తుత తంజావూరులో చోళులకు సంబంధించి ఆనవాళ్లన్నీ కాలగతిలో కనుమరుగయ్యాయనీఅయితే, సినిమాలో చోళుల కాలాన్ని చూపించడం ఎంత కష్టంతో కూడుకున్నదీ ఆయన వివరించారుభారీ సెట్లను నిర్మించే బదులుగా తాను ఉత్తర భారతంలో సినిమాని చిత్రీకరిస్తూ అక్కడున్న నిర్మాణాలను చోళుల నాటి నిర్మాణాలుగా మలచుకున్నట్లు తెలిపారు.

సినిమా ఒక సమష్టి కళగా...

సినిమా సమష్టిగా చేయాల్సిన కళ అని చెబుతూ... ‘‘నటులు కావచ్చు... ఒక నిపుణుడు కావచ్చు... దర్శకుడుగా సినిమాలోని ఉన్నవాళ్లందరినీ ఒక క్రియాశీల దశకు తీసుకుని రావాల్సిన బాధ్యత నాదే’’నని అన్నారు మణిరత్నంసృజనాత్మక స్వేచ్ఛ తీసుకోవడంలో కూడా తగిన జాగ్రత్త అవసరమని చెప్పారు మణిరత్నంమణిరత్నం చెబుతున్న అంశాల్ని ఆహూతులు శ్రద్ధగా విన్నారుపుస్తకాన్ని సినిమాగా మలుస్తున్నపుడు పుస్తకంలోని స్ఫూర్తిని కాపాడుకుంటూనేదర్శకులు తమదైన కళాత్మకతను జోడించాలని కోరారు.

దర్శకుల నిర్మాణ కౌశలానికీఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సంప్రదాయానికీ మణిరత్నం అందించిన అనుభవాలు వర్ధమాన దర్శకులకు ఉపకరిస్తాయనడంలో సందేహం లేదుమరీ ముఖ్యంగాసాహిత్యాన్ని సినిమాగా మలచడంలో ఆయన చెప్పిన అంశాలు యువ దర్శకులకు మార్గదర్శకంగా ఉంటాయి.

 

iffi reel

(Release ID: 2076355) Visitor Counter : 4