ప్రధాన మంత్రి కార్యాలయం
భారత ఆగమన స్మృతి చిహ్నాన్ని సందర్శించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
21 NOV 2024 10:00PM by PIB Hyderabad
జార్జ్ టౌన్ లోని స్మారకోద్యానవనంలో భారత ఆగమన స్మృతిచిహ్నాన్ని ప్రధానమంత్రి సందర్శించారు. ఆయన వెంట గయానా ప్రధానమంత్రి బ్రిగేడియర్ (విశ్రాంత) మార్క్ ఫిలిప్స్ ఉన్నారు. అక్కడ పూలమాలలు వేసి నివాళి అర్పించిన ప్రధానమంత్రికి టస్సా డోలు బృందం స్వాగతం పలికింది. స్మృతిచిహ్నం వద్ద నివాళి అర్పించిన ప్రధానమంత్రి.. గయానాలోని భారత సంతతికి చెందిన వారి పోరాటాన్నీ, త్యాగాలనూ.. గయానాలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించడంలో వారి విశేష కృషినీ గుర్తుచేసుకున్నారు. స్మృతిచిహ్నం వద్ద ఆయన బేల్ పత్ర మొక్క నాటారు.
1838లో భారత్ నుంచి వలసవచ్చిన ఒప్పందకార్మికులను గయానా తీసుకొచ్చిన మొదటి నౌకను ఈ స్మృతిచిహ్నం ప్రతిబింబిస్తుంది. దీనిని 1991లో గయానా ప్రజలకు భారత్ బహుమతిగా ఇచ్చింది.
(रिलीज़ आईडी: 2076348)
आगंतुक पटल : 63
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam