సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రీమియర్లు, రెడ్ కార్పెట్ కార్యక్రమాలతో సినిమా విందుకు ఇఫీ రెడీ
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రీమియర్లు, రెడ్ కార్పెట్ కార్యక్రమాలతో సిద్ధంగా ఉంది. చలనచిత్ర నిర్మాణ కళ, అంతర్జాతీయ స్థాయి ప్రతిభ, అద్భుతమైన కథనాలతో కూడిన అసాధారణమైన ఉత్సవం ఇది. ఆకర్షణీయమైన ఈ మూడో సంచికలో, మరపురాని అనుభూతులతో సినిమా ప్రపంచం, ఉత్సాహవంతులైన ప్రేక్షకుల మధ్య వారధిగా ఇఫీ 2024 మారనుంది.
అంతర్జాతీయ, ప్రాంతీయ చలనచిత్రాలను ప్రదర్శించేందుకు అద్భుతమైన వేదిక
ప్రేక్షకుల మనసులను కట్టిపడేసే చలనచిత్రాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలను ఈ ఏడాది గాలా ప్రీమియర్లో ప్రదర్శిస్తారు.
వివిధ జోనర్లు, భాషలు, సంస్కృతులకు చెందిన తొమ్మిది వరల్డ్ ప్రీమియర్లు, 4 ఆసియా ప్రీమియర్లు, ఒక భారత ప్రీమియర్ చిత్రాలు ఒక ప్రత్యేక చిత్రం 2024 గాలా ప్రీమియర్లలో ప్రదర్శిస్తారు.
ఊపిరి బిగపట్టి చూసే క్రైమ్ థ్రిల్లర్లు, మనసును హత్తుకొనే కుటుంబ కథలు, ఆలోచనలను రేకెత్తించే సామాజిక నేపథ్యాల వరకు.. ఈ సంవత్సరం ప్రదర్శించే చలనచిత్రాలు సినీప్రియులను కట్టిపడేస్తాయి. హిందీ, ఇంగ్లీషు, మరాఠీ, మలయాళం, తెలుగుతో సహా ఇతర భాషలకు చెందిన చిత్రాలు ప్రదర్శిస్తారు. తద్వారా అంతర్జాతీయ, ప్రాంతీయ చలనచిత్ర రంగాల సమ్మిళితం చేసిన వేడుకగా ఇఫీ 2024 నిలబడనుంది.
ఇక్కడ ప్రదర్శితమయ్యే వాటిలో ద పియానో లెసన్, జీరో సే రీస్టార్ట్, సాలీ మొహబ్బత్, స్నోఫ్లవర్, పుణే హైవే, హజార్ వాలా షోలే పహ్లిలా మానుస్, ద మెహతా బాయ్స్, జబ్ ఖులీ కితాబ్, హిసాబ్ బరాబర్, మిసెస్, ఫార్మా, వికటకవి, హెడ్ హంటింగ్ టు బీట్ బాక్సింగ్, మవానా 2, ద రానా దగ్గుబాటి షో ఉన్నాయి. ఇవి సరిహద్దులను దాటి, కథ చెప్పే విధానంలో నూతన ఒరవడులను అన్వేషిస్తూ, సినిమాలకు ఉన్న అందరినీ ఏకం చేసి స్ఫూర్తిని కలిగించే శక్తిని ప్రధానంగా తెలియజేస్తూ, గొప్ప చలనిచిత్రానుభూతిని కలిగిస్తాయి.
తారల మెరుపులతో అలరించనున్న‘‘రెడ్ కార్పెట్’’
తారలు, చిత్ర దర్శకులు, నిర్మాతలు, సినిమా రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొనే రెడ్ కార్పెట్ ఈవెంట్లతో ఐఎఫ్ఎఫ్ఐ 2024 వెలుగుజిలుగులను విరజిమ్మనుంది.
సినిమా దిగ్గజాలు, వర్థమాన తారలు రాకతో ఈ ఉత్సవంలోని అనేక సాయంత్రాలు మరచిపోలేని ఆకర్షణీయమైన అనుభవాలుగా మిగిలిపోనున్నాయి. రానా దగ్గుబాటి, విధు వినోద్ చోప్రా, సాన్యా మల్హోత్రా, విక్రాంత్ మేసీ, ఆర్. మాధవన్, ఎఆర్ రహమాన్, సౌరభ్ శుక్లాలు రెడ్ కార్పెట్ మీద మెరవనున్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన ఇతర ప్రముఖులు, మీడియా ఇందులో పాల్గొంటారు.
ఇఫీ వేడుకల్లో ఎక్కువ మంది ఆసక్తిగా ఎదురుచూసే కార్యక్రమం ‘రెడ్ కార్పెట్’. తారలు, దర్శకులను, చాలా దగ్గరగా చూసి ఆనందించే అవకాశం అభిమానులకు లభించేది కూడా ఇక్కడే. ఇది ఫ్యాషన్లు మాత్రమే కాకుండా సినిమా రంగంలోని ప్రతిభను, సృజనాత్మకతను, సాంస్కృతిక ప్రాముఖ్యాన్ని కూడా ప్రదర్శించే సందర్భం కూడా.
సామర్థ్యం, ఆకర్షణల పారంపర్యం
గత కొన్నేళ్ళుగా, గాలా ప్రీమియర్లు ఇఫీ పారంపర్యానికి ప్రామాణికంగా మారాయి. చలనచిత్ర లోకాన్ని నిర్వచిస్తూనే, ఈ కళలో ప్రతిభాపాటవాలను తెలియజెప్పే చేసే చలనచిత్రాలను ప్రదర్శిస్తాయి.
మునుపటి ఎడిషన్లలో ఇఫీను అంతర్జాతీయ స్థాయి వేడుకగా మార్చడంలో ఈ గాలా ప్రీమియర్స్ ప్రముఖ పాత్రను పోషించాయి. గతంలో దృశ్యం 2, భేడియా, కడక్ సింగ్, గాంధీ టాక్స్ తో పాటు, అంతర్జాతీయ సిరీస్ ఫౌదా (సీజన్ 4) వంటి చిత్రాలను వీటిలో ప్రదర్శించారు. ప్రముఖ నటి అదితి రావ్ హైదరీ, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్, నవాజుద్దీన్ సిద్దికీ, వరుణ్ ధావన్, విజయ్ సేతుపతితో సహా మరెందరో రెడ్ కార్పెట్ కార్యక్రమాలలో పాల్గొని ఈ కార్యక్రమానికున్న ఆకర్షణను పెంచారు.
మరపురాని చిత్రోత్సవ అనుభూతులు
అంతర్జాతీయ స్థాయి చలనచిత్రాలు, తారల వెలుగులతో మెరిసిపోయే రెడ్ కార్పెట్ కార్యక్రమాలు, సినిమాకున్న మాయాజాలంలో మునిగితేలేందుకు ప్రేక్షకులకు ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తూ, సినిమా ప్రేమికులకు మరపురాని అనుభూతులను ఇచ్చే ఉత్సవంగా 55వ ఇఫీ పేరుతెచ్చుకోనుంది. ప్రేక్షకులను ముగ్ధులను చేసే కథాకథనాలు, గ్లామర్, సాంస్కృతిక సంబరాల్లో తేలిపోవడం తథ్యం. స్థానిక, అంతర్జాతీయ స్థాయి ప్రతిభావంతులకు ఒక్క చోటుకు చేర్చి గొప్ప అనుభూతిని పంచడమే ఇఫీ 2024 ధ్యేయంగా పెట్టుకొంది.
చిత్రాల తొలి ప్రదర్శనోత్సవాల షెడ్యూలు,
రెడ్ కార్పెట్ లో పాల్గొనే అతిథుల వివరాలు:
తేదీ
|
ప్రదర్శన సమయం
|
చిత్రం/ ప్రాజెక్టు
|
రెడ్ కార్పెట్ అతిథులు
|
నవంబరు 21, 2024
|
మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు
|
ద పియానో లెసన్
|
|
నవంబరు 21, 2024
|
సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు
|
ద రానా దగ్గుబాటి షో
|
రానా దగ్గుబాటి
|
నవంబరు 21, 2024
|
సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు
|
జీరో సే రీస్టార్ట్
|
విధు వినోద్ చోప్రా, విక్రాంత్ మేసీ, మేధా శంకర్, అనంత్ విజయ్ జోశీ, అంశుమాన్ పుష్కర్, శంతను మొయిత్రా,
స్వానంద్ కిర్‌కిరే, జస్‌కున్వర్ కోహ్లీ
|
నవంబరు 22, 2024
|
మధ్యాహ్నం 12 గంటలకు
|
స్నోఫ్లవర్
|
ఛాయా కదమ్, వైభవ్
మాంగ్ లే, సర్ఫరాజ్ ఆలమ్ సఫూ, గజేంద్ర విట్ఠల్ అహిరే,
దీపక్ కుమార్, రేఖా భగత్
|
నవంబరు 22, 2024
|
సాయంత్రం 5 గంటలకు
|
సాలీ మోహబ్బత్
|
దివ్యేందు శర్మ, టిస్కా చోప్రా,
మనీష్ మల్హోత్రా, జ్యోతి దేశ్‌పాండే, దినేశ్ మల్హోత్రా
|
నవంబరు 22, 2024
|
సాయంత్రం 5గంటల 45 నిమిషాలకు
|
మిసెస్
|
సాన్యా మల్హోత్రా, ఆరతీ కదవ్, హర్‌మన్ బావేజా
|
నవంబరు 23, 2024
|
సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు
|
వికటకవి
|
నరేశ్ అగస్త్య, మేఘా ఆకాశ్, రామ్ తాళ్ళూరి, ప్రదీప్ మద్దాలి
|
నవంబరు 23, 2024
|
సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు
|
పుణే హైవే
|
అమిత్ సాధ్, మంజరి ఫడ్నిస్, కేతకీ నారాయణ్, అనుభవ్ పాల్,
శిశిర్ శర్మ, స్వప్నిల్ అజ్‌గావ్కర్, సుదీప్ మోదక్,
రాహుల్ డీ’కున్హా, బగ్స్ భార్గవ కృష్ణ,
సీమా మహాప్రాత్ర, జహనారా భార్గవ
|
నవంబరు 24, 2024
|
మధ్యాహ్నం 12 గంటలకు
|
షోలే ట్రైలర్ +
హజార్ వాలా షోలే పహిలా మానుష్
|
రమేశ్ సిప్పీ +
సోనాలీ కుల్‌కర్ణి, సిద్దార్థ్ జాదవ్, దిలీప్ ప్రభావల్ కర్,
హృషికేశ్ గుప్తే, షెహజాద్ సిప్పీ
|
నవంబరు 25, 2024
|
సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు
|
కన్నప్ప (షోకేస్)
|
విష్ణు మంచు, ప్రభుదేవా, కాజల్ అగర్వాల్, ఆర్. శరత్ కుమార్,
మోహన్ బాబు, ముకేశ్ కుమార్ సింహ్
|
నవంబరు 25, 2024
|
సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు
|
ద మెహతా బాయ్స్
|
బొమన్ ఇరానీ, అవినాశ్ తివారీ, శ్రేయా చౌధరీ, దానేశ్ ఇరానీ
|
నవంబరు 26, 2024
|
సాయంత్రం 5 గంటలకు
|
జబ్ ఖులీ కితాబ్
|
డింపుల్ కపాడియా, పంకజ్ కపూర్,
అపార్‌శక్తి ఖురానా, మానసీ పరేఖ్, సమీర్ సోనీ,
సుప్రియా పాఠక్, సౌరభ్ శుక్లా, సమీర్ నాయర్, నరేన్ కుమార్
|
నవంబరు 26, 2024
|
సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు
|
హిసాబ్ బరాబర్
|
ఆర్. మాధవన్, కీర్తి కుల్హరీ, నీల్ నితిన్ ముకేశ్, అశ్వనీ ధీర్
|
నవంబరు 27, 2024
|
సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు
|
ఫార్మా (సిరీస్)
|
నివిన్ పౌలీ, రజిత్ కపూర్, ఆలేఖ్ కపూర్, నారాయణ్,
శృతి రామచంద్రన్, వీణా నందకుమార్
|
నవంబరు 27, 2024
|
సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు
|
హెడ్‌హంటింగ్ టు బీట్ బాక్సింగ్
|
ఎ.ఆర్. రహమాన్, రోహిత్ గుప్తా,
అమిత్ మాలిక్, మనీల్ గుప్తా
|
మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
https://iffigoa.org/gala-premier/3rd-edition
***
(Release ID: 2074317)
Visitor Counter : 16