రాష్ట్రపతి సచివాలయం
సిల్‌వాసాలో స్వామి వివేకానంద విద్యా మందిర్ ను ప్రారంభించిన రాష్ట్రపతి;సభను ఉద్దేశించి ప్రసంగం
Posted On:
13 NOV 2024 1:25PM by PIB Hyderabad
కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా, నగర్ హవేలీ, దమన్, దీవ్ కు ప్రధాన కేంద్రమైన సిల్‌వాసా నగరంలోని జండా చౌక్ లో స్వామి వివేకానంద విద్యా మందిర్ ను రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొని, సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. దాద్రా, నగర్ హవేలీ, దమన్, ఇంకా దీవ్ ప్రాంత ప్రజలు సాదరంగా స్వాగతం పలకడాన్ని ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకొంటానని రాష్ట్రపతి అన్నారు. వారి స్నేహపూర్వక స్వాగతానికి గాను ఆమె ధన్యవాదాలు తెలిపారు.
జండా చౌక్ పాఠశాలను ప్రారంభించినందుకు సంతోషిస్తున్నానని రాష్ట్రపతి అన్నారు. ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి ఈ కేంద్ర పాలిత ప్రాంత పాలన యంత్రాంగం ఎంతో కృషి చేసిందన్నారు. విద్యార్థులకు మంచి నాణ్యత కలిగిన సాంకేతిక విద్యను బోధించడానికి 2018లో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించి, 2022లో ఎన్ఐఎఫ్‌టీ ని ఏర్పాటు చేశారని ఆమె అన్నారు. ఈ విద్యాసంస్థలు కేంద్రపాలిత ప్రాంత యువతీ యువకులకు ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తాయన్న విశ్వాసాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు.
ఈ ప్రాంతానికి సుసంపన్నమైన చరిత్రాత్మక, సాంస్కృతిక, వారసత్వం ఉందని రాష్ట్రపతి ప్రశంసించారు. ఈ కారణంగా దాద్రా, నగర్ హవేలీ, దమన్, దీవ్ చక్కని పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయని ఆమె చెప్తూ, పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని వారికి అవసరమైన వసతి సదుపాయాలను, సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలను చేపట్టడం చూసి తనకు సంతోషం వేసిందని ఆమె అన్నారు. పర్యాటక రంగం విస్తరిస్తే కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు అందివస్తాయని ఆమె అన్నారు. వివిధ ప్రాంతాల ప్రజలతో అనుబంధం ఏర్పడడం మనను మరింత సత్ప్రవర్తన కలిగిన వారిగా తీర్చిదిద్దుతుందని రాష్ట్రపతి అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగ పాఠానికి ఈ కింది లింకు ను క్లిక్ చేయగలరు
Please click here to see the President's Speech -
***
(Release ID: 2073088)
Visitor Counter : 33