ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 29 OCT 2024 8:54AM by PIB Hyderabad

ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన ధన్వంతరి భగవానుని జయంతి, ఘనమైన మన సంస్కృతికి ఆయుర్వేదం అందిస్తున్న ప్రయోజనాలు, సేవలతో ముడిపడి ఉందని తెలిపారు. ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదం సమస్త మానవాళి ఆరోగ్యవంతమైన జీవితానికి మేలు చేస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

‘‘ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు. ఘనమైన మన సంస్కృతికి ఆయుర్వేదం అందిస్తున్న ప్రయోజనాలు, ఉపయోగాలతో భగవాన్ ధన్వంతరి జయంతి ముడిపడి ఉంది. ఆయుర్వేదం  ప్రాముఖ్యాన్ని ప్రపంచమంతా గుర్తించింది. ఈ ప్రాచీన వైద్య విధానం సమస్త మానవాళి ఆరోగ్య జీవనానికి మేలు చేస్తుందని విశ్వసిస్తున్నాను.’’ అని శ్రీ మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

 

 

***

MJPS/SR


(రిలీజ్ ఐడి: 2069181) సందర్శకుల సూచీ సంఖ్య : : 140