హోం మంత్రిత్వ శాఖ
‘డిజిటల్ అరెస్ట్’ అంటూ బెదిరించే మోసపూరిత కాల్స్ పట్ల తాజా ‘మన్ కీ బాత్’ లో ప్రజలను అప్రమత్తం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
‘సైబర్ సురక్షిత భారత్’ నిర్మాణం పట్ల మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు హోమ్ మంత్రి శ్రీ అమిత్ షా ‘ఎక్స్’ ద్వారా వెల్లడి
పోలీసు, సీబీఐ, మాదక ద్రవ్య నిరోధ దళాలకు చెందిన అధికారులమనో, ఆర్బీఐ అధికారులమనో వీడియో కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్న వంచకులు
ఇటువంటి మోసాలను అరికట్టే దిశగా కార్యాచరణ ప్రకటించిన ప్రధాని – ఏ ప్రభుత్వ సంస్థా ఫోన్ లేదా వీడియో ద్వారా విచారణ చేపట్టదంటూ స్పష్టీకరణ
డిజిటల్ అరెస్ట్ వంటి నేరాలను మొగ్గలోనే తుంచి వేసేందుకు “రుకో,సోచో,ఔర్ యాక్షన్ లో” ( ఆగండి, ఆలోచించండి, అనంతరమే అడుగు వేయండి) మంత్రాన్ని ప్రకటించిన శ్రీ మోదీ : మోసపూరిత కాల్ ఎదుర్కొన్న తక్షణమే 1930 హెల్ప్ లైన్ ద్వారా, లేదా https://cybercrime.gov.in వెబ్ సైట్ ద్వారా అధికారులను అప్రమత్తం చేయాలని ప్రజలకు సూచన
Posted On:
27 OCT 2024 5:56PM by PIB Hyderabad
తాజా (నిన్నటి) ‘మన్ కీ బాత్’లో భాగంగా, ‘డిజిటల్ అరెస్ట్’, మోసపూరిత కాల్స్ గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పౌరులను అప్రమత్తం చేశారు.
‘పోలీసు, సీబీఐ, మాదక ద్రవ్య నిరోధ దళాలకు చెందిన అధికారులమనో, ఆర్బీఐ అధికారులమనో వంచకులు వీడియో కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇటువంటి మోసాల బారిన పడకుండా ఉండేందుకు పౌరులు ఆచరించవలసిన మార్గాన్ని సూచిస్తూ, ఏ ప్రభుత్వ సంస్థా ఫోన్ లేదా వీడియో ద్వారా విచారణ చేపట్టదని మోదీ గారు ప్రజలకు గుర్తు చేశారు. డిజిటల్ అరెస్ట్ వంటి నేరాలను మొగ్గలోనే తుంచి వేసేందుకు “రుకో,సోచో,ఔర్ యాక్షన్ లో” (ఆగండి,ఆలోచించండి, ఆనంతరమే అడుగు వేయండి) అనే మంత్రాన్ని ప్రధాని ప్రకటించారు.
మోసపూరిత కాల్ ఎదుర్కొన్న తక్షణమే 1930 హెల్ప్ లైన్ ద్వారా, లేదా https://cybercrime.gov.in వెబ్ సైట్ ద్వారా అధికారులను అప్రమత్తం చేయాలని ప్రజలకు సూచించారు. ‘సైబర్ సురక్షిత భారత్’ నిర్మాణం పట్ల మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.” అని హోమ్ మంత్రి అమిత్ షా ‘ఎక్స్’ సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు.
***
(Release ID: 2068932)
Visitor Counter : 20