సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఐఎఫ్ఎఫ్ఐ 2024: ఫిల్మ్ బజార్ సహ-నిర్మాణ మార్కెట్ కోసం ఎంపికలను ప్రకటించిన ఎన్ఎఫ్‌డిసి ఇండియా
7 దేశాల నుంచి ఎంపికైన 21 ఫీచర్ ఫిల్మ్‌లు, 8 వెబ్ సిరీస్‌లు
విభిన్న ప్రపంచ కథలకు వేదిక కానున్న ఫిల్మ్ బజార్ సహ-నిర్మాణ మార్కెట్
ఆసియా టీవి ఫోరమ్ & మార్కెట్ (ఎటిఎఫ్)తో జతకట్టిన ఎన్ఎఫ్‌డిసి ఫిల్మ్ బజార్
ఎన్ఎఫ్‌డీసీ ఫిల్మ్ బజార్ 18వ ఎడిషన్ సహ-నిర్మాణ మార్కెట్ కోసం ఏడు దేశాల నుంచి 21 చలనచిత్రాలు, 8 వెబ్ సిరీస్‌లను అధికారికంగా ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ప్రతియేటా ఐఐఎఫ్ వేడుకలతో పాటు ఫిల్మ్ బజార్ నిర్వహిస్తుంటారు. వచ్చే నెల 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్న ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) వేడుకలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా గోవాలోని మారియట్ రిసార్ట్‌లో వచ్చే నెల 20 నుంచి 24 వరకు ఫిల్మ్ బజార్ 2024 జరగనుంది.
ఈ ఏడాది ప్రదర్శనకు అధికారికంగా ఎంపికైన చిత్రాలు హిందీ, ఇంగ్లీష్, అస్సామీస్, తమిళ్, మార్వాడీ, బెంగాలీ, మలయాళం, పంజాబీ, నేపాలీ, మరాఠీ, పహాడీ, కాంటోనీస్‌తో సహా అనేక భాషల సమాహారంగా ఉన్నాయి. ఫిల్మ్ బజార్‌లో, భారత్, బంగ్లాదేశ్, నేపాల్, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ, హాంకాంగ్ దేశాలకు చెందిన చిత్రనిర్మాణదారులు తమ ప్రాజెక్ట్‌లను నిర్మాతలు, పంపిణీదారులు, ఫెస్టివల్ ప్రోగ్రామర్లు, ఫైనాన్షియర్‌లు, సేల్స్ ఏజెంట్లతో కూడిన అనేక మంది పరిశ్రమ నిపుణులకు ప్రదర్శించనున్నారు.
చిత్రనిర్మాణదారులు మంచి సంబంధాలను ఏర్పరచుకోవడానికి, సహకారం కోసం అవకాశాలను అన్వేషించడానికి ఒక అద్భుతమైన అవకాశంగా ఈ ఓపెన్ పిచ్ (ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకునే) సమావేశం నిలుస్తుంది. ఈ ఏడాది సహ-నిర్మాణ మార్కెట్ కోసం ఎంపికైన చలనచిత్రాలు, వెబ్ సిరీస్‌ల జాబితా ఇక్కడ ఉంది:
Sr. No
|
Films / Web Series
|
Country / State
|
Language
|
1
|
A Night's Whispers and the Winds
|
India
|
Assamese
|
2
|
Aadu Ki Kasam (Destiny's Dance)
|
India
|
English, Hindi
|
3
|
Aanaikatti Blues
|
India
|
Tamil
|
4
|
Absent
|
India
|
Hindi, English
|
5
|
All Ten Heads Of Ravanna
|
India
|
Hindi
|
6
|
Chetak
|
India
|
Hindi, Marwari
|
7
|
Divine Chords
|
Bangladesh, India
|
Bengali
|
8
|
Feral
|
India
|
English
|
9
|
Gulistaan (Year of the Weeds)
|
India
|
Hindi
|
10
|
Guptam (The Last of Them Plagues
|
India
|
Malayalam
|
11
|
Harbir
|
India
|
Punjabi, Hindi, English
|
12
|
Home Before Night
|
Australia, Nepal
|
English, Nepali
|
13
|
Kabootar
|
India
|
Marathi
|
14
|
Kothiyan- Fishers of Men
|
India
|
Malayalam
|
15
|
Kurinji (The Disappearing Flower)
|
India, Germany
|
Malayalam
|
16
|
Baaghi Bechare (Reluctant Rebels)
|
India
|
Hindi
|
17
|
Roid
|
Bangladesh
|
Bengali
|
18
|
Somahelang (The Song of Flowers)
|
India, United Kingdom
|
Pahadi, Hindi
|
19
|
The Employer
|
India
|
Hindi
|
20
|
Wax Daddy
|
India
|
English, Hindi
|
21
|
The Vampire of Sheung Shui
|
Hong Kong
|
English, Cantonese, Hindi
|
22
|
Age Of Deccan- The Legend Of Malik Ambar
|
India
|
Hindi, English
|
23
|
Chauhans BNB Bed And Basera
|
India
|
Hindi
|
24
|
Chekavar
|
India
|
Tamil, Malayalam
|
25
|
IndiPendent
|
India, United Kingdom
|
English, Tamil
|
26
|
Just Like Her Mother
|
India
|
Hindi, English
|
27
|
Modern Times
|
India, United Kingdom
|
English, Tamil
|
28
|
Pondi-Cherie
|
India
|
Hindi, English
|
29
|
RESET
|
India
|
Tamil, Hindi, Telugu, Kannada, Malayalam
|
ఈ ఏడాది ఆసియా టీవి ఫోరమ్ & మార్కెట్ (ఎటిఎఫ్)తో జత కట్టిన ఎన్ఎఫ్‌డీసీ క్రాస్ ఎక్చేంజ్ కార్యక్రమంలో భాగంగా ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తోంది. వెబ్ సిరీస్‌లకు పెరుగుతున్న జనాదరణ నేపథ్యంలో డ్రామా, రొమాన్స్, పీరియడ్ డ్రామా, కామెడీ, యాక్షన్, కమింగ్-ఆఫ్-ఏజ్, అడ్వెంచర్, థ్రిల్లర్ వంటి వివిధ జానర్‌లలో ఎనిమిది అద్భుతమైన ప్రాజెక్ట్‌లను దీనిలో చేర్చింది.
ఎన్ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ పృథుల్ కుమార్ మాట్లాడుతూ, “ఎంపికైన ప్రాజెక్ట్‌లకు విలువైన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ, సహ-నిర్మాణ మార్కెట్ ఫిల్మ్ బజార్‌లో కీలక భాగంగా మారింది. ఈ ఏడాది, 23 దేశాల నుంచి 30 భాషల్లో గల 180 చిత్రాల కోసం దరఖాస్తులు వచ్చాయి. మా ప్రారంభ వెబ్ సిరీస్ ఎడిషన్ కోసం, మేము 8 దేశాల నుంచి 14 భాషలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 38 సమర్పణలను కలిగి ఉన్నాం. ఎంపికైన చిత్రాల నిర్మాణదారులందరికీ వారి దార్శనికతలకు తగిన సహ-నిర్మాణ భాగస్వాములు లభించాలని మేం కోరుకుంటున్నాం! ” అన్నారు.
ఫిల్మ్ బజార్ గురించి
2007లో ప్రారంభమైనప్పటి నుంచి, ఫిల్మ్ బజార్ దక్షిణాసియా చిత్రాలు, ఫిల్మ్‌మేకింగ్, నిర్మాణం, పంపిణీలో అత్యుత్తమ ప్రతిభను గుర్తించడం, మద్దతునివ్వడం, ప్రదర్శించడం కోసం కృషి చేస్తోంది. సృజనాత్మక, ఆర్థిక సహకారాన్ని కోరుతున్న దక్షిణాసియా, అంతర్జాతీయ చిత్రనిర్మాణదారులు, నిర్మాతలు, సేల్స్ ఏజెంట్స్, ఫెస్టివల్ ప్రోగ్రామర్‌ల కోసం ఈ బజార్ దక్షిణాసియా ప్రాంతంలో ప్రపంచ సినిమా అమ్మకాలను కూడా సులభతరం చేస్తూ ఒక ఉమ్మడి కేంద్రంగా ఉపయోగపడుతోంది. ఈ ఐదు రోజుల పాటు దక్షిణాసియా కంటెంట్, ప్రతిభను ప్రోత్సహించడంపై ఫిల్మ్ మార్కెట్ దృష్టి సారించనుంది. సహ-నిర్మాణ మార్కెట్ విభిన్న ప్రపంచ కథలను గుర్తించే లక్ష్యంతో పని చేస్తోంది.
ఐఎఫ్ఎఫ్ఐ గురించి
1952లో స్థాపించిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ఆసియాలోని ప్రధాన చలన చిత్రోత్సవాల్లో ఒకటిగా నిలుస్తోంది. ప్రారంభం నుంచీ, ఐఎఫ్ఎఫ్ఐ చలనచిత్రాలు, వాటి ఆకర్షణీయమైన కథలు, వాటి వెనుక ఉన్న ప్రతిభావంతులైన వ్యక్తులకు గుర్తింపునివ్వడం లక్ష్యంగా పని చేస్తోంది. ఈ కార్యక్రమం వారిలో సినిమాల పట్ల పూర్తి అవగాహనను, అభిరుచిని ప్రోత్సహించడం, వ్యాప్తి చేయడం, వారిలో సినిమా పట్ల గల అవగాహన, విశ్వాసాలను అనుసంధానించడం, వారు వ్యక్తిగతంగా, సమష్టిగా ఉన్నత శిఖరాలను చేరుకునేలా వారిని ప్రేరేపించడం కోసం ప్రయత్నిస్తుంది.
***
(Release ID: 2068291)
Visitor Counter : 19