నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘పర్యావరణ హిత నౌకల పట్టిక-ఈఎస్ఐ’లో... ప్రోత్సాహకాలు అందించే వేదికగా మార్మగోవా ఓడరేవు ప్రాధికార సంస్థకు ప్రపంచస్థాయి గుర్తింపు

ఈఎస్ఐ కింద పర్యావరణ హిత పథకాలను

ప్రవేశపెట్టిన తొలి భారతీయ ఓడరేవు మార్మగోవా

అక్టోబర్ 2023లో ప్రారంభించిన ‘హరిత్ శ్రేయ్’ పథకం ద్వారా ఈఎస్ఐ రేటింగ్ ఆధారంగా వాణిజ్య నౌకలకు ఓడరేవు రుసుముల్లో రాయితీలు


అనేక నౌకలకు లబ్ధి అందించిన ‘హరిత్ శ్రేయ్’ పథకం

పర్యావరణ హిత పద్ధతులకు ఊత

Posted On: 24 OCT 2024 1:20PM by PIB Hyderabad

‘మార్మగోవా నౌకాశ్రయ ప్రాధికార సంస్థ’ పర్యావరణ హిత నౌకల పట్టిక (ఈఎస్ఐ) లో చోటు దక్కించుకుంది. పర్యావరణ హిత పద్ధతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నందుకు, మార్మగోవా ఓడరేవుకు ‘అంతర్జాతీయ ఓడరేవులూ, నౌకాశ్రయాల సంస్థ-ఐఏపీహెచ్’ ఈ గుర్తింపునిచ్చింది. నౌకలు పర్యావరణ హిత పద్ధతులు అవలంబించేలా మార్మగోవా ఓడరేవు చేస్తున్న కృషిని ఈ గుర్తింపు ప్రతిబింబిస్తోంది.  

 

సముద్రయానంలో ఉద్గారాల విడుదల కట్టడికి ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా  పర్యావరణ హిత పథకాలను ప్రవేశపెట్టిన తొలి భారతీయ ఓడరేవు మార్మగోవా. అక్టోబర్ 2023లో ప్రారంభించిన ‘హరిత్ శ్రేయ్’ పథకం ద్వారా ఈఎస్ఐ రేటింగ్ ఆధారంగా వాణిజ్య నౌకాలకు ఓడరేవు ఫీజుల్లో రాయితీలు కల్పిస్తోంది. అధిక స్కోర్ సాధించిన ఓడలకు అధిక ప్రోత్సాహాలు దక్కుతాయి.


ఈఎస్ఐ కార్యక్రమంలో భాగమవడం ద్వారా ఆసియా ప్రాంతంలో  పర్యావరణ హిత పద్ధతులకు ప్రోత్సాహం ఇస్తున్నందుకూ, అవగాహన పెంచుతున్నందుకూ, మార్మగోవా ఓడరేవుల సంస్థ కృషిని ‘ఐఏపీహెచ్’ కార్యదర్శి (ఆగస్ట్ 2024 లో) ప్రశంసించారు. ఆసియా ప్రాంతంలో జపాన్ ఒమన్ దేశాలు ఇటువంటి ప్రోత్సాహకాలనే అందిస్తున్నాయి.

 

కర్బన ఉద్గారాల విడుదల కట్టడి లక్ష్యంగా ప్రారంభించిన ‘హరిత్ శ్రేయ్’ పథకం వల్ల అనేక నౌకలు లబ్ధి పొందాయి. నౌకావాణిజ్య కార్యకలాపాల్లో పర్యావరణానికి హాని చేసే ఉద్గారాల విడుదలను తగ్గించాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో ఈ  పథకం కొనసాగుతోంది. ‘ఐఏపీహెచ్’ అందించే ప్రపంచ స్థాయి పురస్కారాలు-‘డబ్ల్యూపీఎస్పీ’ కోసం, మార్మగోవా ఓడరేవు ఈ పథకాన్ని తేవడం ద్వారా పర్యావరణ పరిరక్షణ పట్ల తన నిబద్ధతను చాటుకుంది.

 

పర్యావరణ అనుకూలమైన నౌకా వాణిజ్య పద్ధతులను ప్రోత్సహించడంలో ‘మార్మగోవా ఓడరేవు ప్రాధికార సంస్థ’ ప్రశంసనీయ కృషి చేస్తోందన్న గుర్తింపు తెచ్చుకుంది. కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించి గాలి నాణ్యతను మెరుగుపరిచే ప్రపంచ దేశాల లక్ష్యానికి మార్మగోవా ఓడరేవు ఇతోధికంగా కృషి చేస్తోంది.

 

***




(Release ID: 2067695) Visitor Counter : 47