మంత్రిమండలి
azadi ka amrit mahotsav

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ)లో మూడు శాతం, పింఛన్ దారులకు డియర్ నెస్ రిలీఫ్ (డీఆర్)లో అదనపు వాయిదా (ఇన్ స్టాల్ మెంట్) కు ఆమోదాన్ని తెలిపిన మంత్రిమండలి

प्रविष्टि तिथि: 16 OCT 2024 3:20PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ), పింఛన్ దారులకు డియర్ నెస్ రిలీఫ్ (డీఆర్) తాలూకు అదనపు వాయిదా (ఇన్ స్టాల్ మెంట్)ను చెల్లించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలిపింది. ఈ వృద్ధి ఈ సంవత్సరం జులై 1వ తేదీ నుంచి వర్తిస్తుంది. ఇది మూల వేతనం/పింఛన్ లో 50 శాతం గా ఉన్న ప్రస్తుత రేటు కన్నా మూడు శాతం పెంపును సూచిస్తోంది. పెరుగుతున్న ధరల భారం నుంచి ఉపశమనాన్ని కలగజేయాలనేదే ఈ నిర్ణయం లోని ఉద్దేశం.

ఏడో కేంద్రీయ వేతన సంఘం సిఫారసులను ఆధారంగా తీసుకొని ఆమోదించినటువంటి ఫార్ములాకు అనుగుణంగా ఈ పెంపు నిర్ణయాన్ని తీసుకున్నారు. డీఏ, డీఆర్.. ఈ రెండిటి రీత్యా డబ్బును చెల్లిస్తుండడం వల్ల ప్రభుత్వ ఖజానాపై ప్రతి సంవత్సరంలో రూ. 9,448.35 కోట్ల మేరకు భారం పడుతుంది.

ఈ నిర్ణయంతో, కేంద్ర ప్రభుత్వం లోని ఇంచుమించు 49.18 లక్షల మంది ఉద్యోగులు, 64.89 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనాన్ని అందుకోనున్నారు.



 


***


(रिलीज़ आईडी: 2065367) आगंतुक पटल : 312
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam