కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కొత్త డిజిటల్ సాంకేతికతల దీర్ఘకాల మనుగడ కోసం అంతర్జాతీయ ప్రమాణాల సాధన దిశగా సహకారం: జీఎస్ఎస్ 2024 పిలుపు మానవాళి శ్రేయస్సుపై దృష్టిసారించనున్న ప్రమాణాలు
మనం ఏర్పరుచుకునే ప్రమాణాలు సాంకేతికతను మించి,
నైతిక మార్గాన్ని చూపుతాయి: కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్
Posted On:
15 OCT 2024 9:08AM by PIB Hyderabad
అయిదో అంతర్జాతీయ ప్రమాణాల చర్చావేదిక (జీఎస్ఎస్-24) ఈ రోజున న్యూఢిల్లీలో ముగిసింది. ఈ సదస్సును మొదటిసారిగా ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో నిర్వహించారు. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయు) నిర్వహణలో భారత ప్రభుత్వ టెలి కమ్యూనికేషన్ల విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సు మునుపెన్నడూ ఎరుగని స్థాయిలో ప్రపంచం నలుమూలల నుంచి విధాన రూపకర్తలను, నూతన ఆవిష్కర్తలను, నిపుణులను కలుపుకొని 1500 మందిని ఒక చోటుకు తీసుకు వచ్చింది. డిజిటల్ రంగంలో భవిష్యత్తులో రాబోతున్న మార్పులు, కొత్తగా వస్తున్న సాంకేతికతలకు సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాలకు గల ముఖ్యపాత్రను చర్చించడానికి ఈ సదస్సును ఏర్పాటు చేశారు.
కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని సదస్సు ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఇది వరకు ఎరుగని స్థాయిలో మార్పును సాధించింది. దీనిని ప్రపంచం ప్రస్తుతం గుర్తించిందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలను అభివృద్ధి పరచే ప్రక్రియ ప్రజాస్వామికంగాను, అన్ని వర్గాల వారిని కలుపుకొని ముందుకు సాగిపోయేదిగాను ఉంటూ అన్ని ప్రాంతాల అవసరాలను తీర్చేదిగా, అభివృద్ధి చెందుతున్న దేశాల క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేదిగా ఉండి తీరాలని ఆయన అన్నారు. ‘‘ఈ అసాధారణ సదస్సును ముగించుకొంటున్న క్రమంలో, మనం స్థాపించే ప్రమాణాలు కేవలం సాంకేతిక ప్రమాణాలే కాకుండా అంత కన్న మిన్నగా నైతిక దిక్సూచిగా ఉంటూ, ఉమ్మడి భౌగోళిక ప్రగతికి ఉపకరిస్తాయన్న నమ్మకం నాకు ఉంది. భారతదేశం ఈ ప్రయాణాన్ని ఒంటరిగా కాకుండా, మీ అందరి భాగస్వామ్యంతో సాగించేందుకు సిద్ధంగా ఉంది’’ అని ఆయన అన్నారు.
‘‘తర్వాతి డిజిటల్ విప్లవం దిశగా: కొత్తగా వస్తున్న టెక్నాలజీలు, ఆవిష్కరణలు, అంతర్జాతీయ ప్రమాణాలు’’ అన్న అంశంపై దృష్టిని కేంద్రీకరిస్తూ సాగిన ఈ సదస్సు... సరికొత్త సాంకేతికతల ప్రమాణీకరణకు, పరిపాలనకు ఒక సామరస్య పూర్వక, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉండాలని అభిప్రాయపడింది. సాంకేతిక విజ్ఞానం, ప్రమాణాల రూపకల్పన.. ఈ ముఖ్య అంశాలపై చర్చ, సమన్వయాల కోసం ఒక వేదికను సమకూర్చే అత్యున్నత స్థాయి వేదికగా జీఎస్ఎస్ వ్యవహరిస్తున్నది.
ఈ కార్యక్రమాన్ని ఉదయం పూట, కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎమ్. సింధియా ప్రారంభించారు. ఆయన ప్రారంభోపన్యాసాన్నిస్తూ టెలికమ్యూనికేషన్లు, డిజిటల్ ఆవిష్కరణల రంగంలో భారతదేశం ప్రపంచ స్థాయి పాత్రను పోషిస్తోందని చెప్పారు. విజ్ఞానశాస్త్రం, నూతన ఆవిష్కరణలు, ఇంకా నియమాల గడ్డగా భారతదేశానికి ఉన్న ఖ్యాతి ప్రపంచ సమృద్ధికి దోహద పడుతోందని ఆయన అన్నారు.
ఈ సదస్సులో ఒక ఉన్నత స్థాయి విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉన్నత స్థాయి విభాగం నూతన ఆవిష్కరణలతో పాటు ప్రజలకు వివిధ సేవల అందజేతకు డిజిటల్ మాధ్యమంలో మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్తు అంచనాపై శ్రద్ధ వహిస్తూ, పరిశ్రమ రంగ ప్రముఖులు, మంత్రులు పరస్పరం సహకరించుకొనేందుకు బాటను పరచింది. కృత్రిమ మేధ (ఏఐ) రంగ నిర్వహణకు పటిష్టమైన, అంతర్జాతీయ ప్రమాణాలు ఏర్పరచుకోవడం అవసరమని ఈ సదస్సు పిలుపునిచ్చింది. అభివృద్ధి చెందిన దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మధ్య ప్రమాణాల పరంగా ఉన్న అంతరాన్ని పూడ్చుతూ, సాంకేతిక విజ్ఞానాన్ని అందరి అందుబాటులోకి తీసుకు పోవాలని ఈ సదస్సు ఉద్ఘాటించింది.
సమాజమే యజమానిగా లభించే సాంకేతికత (ఓపెన్ సోర్స్)ల గురించి, బ్లాక్ చైన్ ఆధారిత ప్రమాణీకరణను గురించి, సార్వజనిక సేవల పైన, పరిశ్రమలపైన ఏఐ, ఇంకా మెటావెర్స్ ప్రసరింపజేసే ప్రభావాలను గురించి ఈ కార్యక్రమంలో చర్చించారు. అన్ని దేశాలకు ప్రాతినిధ్యం ఉండే విధంగా టెక్ ఇకోసిస్టమ్ ను ఆవిష్కరించడానికి డెవలపర్లు సమన్వయాన్ని కుదుర్చుకోవాలని సదస్సు సూచించింది. ఏఐ ప్రమాణాలపై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఈ సదస్సు లో భాగంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సర్వసమ్మతి తో రూపొందే ప్రమాణాలు వేర్వేరు రంగాలలో ఏ విధంగా నూతన ఆవిష్కరణలకు దారితీస్తాయో ప్రముఖంగా సమీక్షించింది.
జీఎస్ఎస్ 2024కు సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ-డీఒటీ) ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ అధ్యక్షత వహించారు. ఈ తరహా సదస్సుకు భారతదేశం నాయకత్వ బాధ్యతను వహించడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మార్పులను ముందుకు తీసుకుపోవడంలో అంతర్జాతీయ ప్రమాణాలది కీలక పాత్ర అని స్పష్టం చేస్తూ, ఒక శక్తిమంతమైన ఫలితాలను (అవుట్ కమ్ డాక్యుమెంట్) ఆవిష్కరిస్తూ ఈ సదస్సు ముగిసింది. డాక్టర్ ఉపాధ్యాయ్ వివరించిన కీలక ఫలితాలలో ఈ కింది అంశాలు భాగంగా ఉన్నాయి:-
1. డిజిటల్ పరివర్తనను ముందుకు తీసుకు పోవడం: ప్రపంచ దేశాలన్నిటా డిజిటల్ పరివర్తనకు మూలస్తంభంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు నిలుస్తాయని ది అవుట్‌కమ్ డాక్యుమెంట్ స్పష్టంచేస్తోంది.
2. ప్రపంచ నేతలను ఏకతాటి మీదకు తీసుకు రావడం: నవీన సాంకేతికతల ప్రమాణాల ప్రభావాన్ని చర్చించడానికి పరిశ్రమ ప్రముఖులను, విధాన రూపకర్తలను ఒక చోటుకు జీఎస్ఎస్-24 చేర్చింది.
3. ప్రమాణాల ద్వారా నూతన ఆవిష్కరణలు: సర్వ సమ్మతితో కూడిన ప్రమాణాలను రూపొందడం వివిధ రంగాలలో నూతన ఆవిష్కరణలకు ఏ రకంగా దన్నుగా నిలచి, సాంకేతిక విజ్ఞాన పురోగమనాన్ని ఇనుమడింప జేయగలుగుతుందో ఏఐపై జరిగిన గోష్ఠి వివరించింది.
4. అంతరాన్ని పూడ్చడం: అభివృద్ధి చెందిన దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మధ్య ప్రమాణాలలో అంతరాన్ని పూడ్చి, సాంకేతిక విజ్ఞానం అందరికీ సరి సమానంగా అందేటట్లు పూచీపడాలని ఈ సదస్సు పిలుపునిచ్చింది.
5. ఏఐ ని, మెటావెర్స్ వినియోగం: సార్వజనిక సేవలలో, పట్టణ ప్రాంతాల ప్రణాళికా రచనలో ఏఐ, మెటావెర్స్ లు ఎంతటి విస్తృత పరివర్తనకారి పాత్రను పోషించగలుగుతాయో జీఎస్ఎస్-24 చాటిచెప్పింది. ‘గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ వర్చువల్ వరల్డ్స్’ వంటి కార్యక్రమాలను బలోపేతం చేయాలని ఐటీయు కు ఈ సదస్సు విజ్ఞప్తి చేసింది.
6. ఎస్‌డీజీ లకు వేగాన్ని సంతరించడం: ఐక్య రాజ్యసమితి స్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో అంతర్జాతీయ ప్రమాణాలది కీలక పాత్ర అని ఈ కార్యక్రమం కుండబద్దలు కొట్టి మరీ చెప్పడం ద్వారా దీర్ఘకాలం పాటు మనుగడలో ఉండే డిజిటల్ పరివర్తనకు బాటను పరచింది.
7. ఉన్నతస్థాయి సంభాషణలు: ఇది వరకు ఎన్నడూ చేపట్టని తరహాలో నిర్వహించిన ఒక ఉన్నతస్థాయి కార్యక్రమం ఇది. పరిశ్రమ ప్రముఖుల, మంత్రుల మధ్య సమన్వయాన్ని ఇది ఏర్పరచింది; ఇది నూతన ఆవిష్కరణల భావి తీరుతెన్నులూ, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ప్రాస్ట్రక్చర్ లపై దృష్టిని సారించింది.
8. ఏఐ గవర్నెన్స్ ను అమలులోకి తీసుకురావడం: ఏఐ గవర్నెన్స్ విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలు దృఢమైనవిగా ఉండాలని జీఎస్ఎస్-24 సూచించింది. ఈ క్రమంలో ఏఐ ఫర్ గుడ్, ఏఐ ఫర్ స్కిల్స్ కొయలిషన్ వంటి కార్యక్రమాలకు చేయూతను ఇవ్వాలని కోరింది.
9. ఓపెన్ సోర్స్ సాధికారితను కల్పించడం: నూతన ఆవిష్కరణలకు చోదక శక్తిగా ‘ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్’ కు ఉన్న కీలక పాత్రను ఈ సదస్సు గుర్తించింది. మరింత ప్రాతినిధ్యం కలిగి ఉండే సాంకేతిక వ్యవస్థను ఆవిష్కరించడానికి డెవలపర్లు సహకరించుకోవాలని తెలిపింది.
10. స్మార్ట్ నగరాల ప్రాధాన్యాన్ని గుర్తించడం: స్మార్ట్ తరహా దీర్ఘకాలిక కార్యక్రమాల అమలులో రాణిస్తున్న నగరాలకు మాన్యతను జీఎస్ఎస్-24 కట్టబెట్టింది. ఐటీయూ, యూఎన్ఇసీఇ, యూఎన్-హేబిటాట్ ల సారథ్యంలో నడుస్తున్న యునైటెడ్ ఫర్ స్మార్ట్ సస్టెయినబుల్ సిటీస్ (యూ4ఎస్ఎస్సీ) కార్యక్రమానికి సమర్ధనను ఈ సదస్సు పునరుద్ఘాటించింది.
కొత్తగా ఉనికిలోకి వస్తున్న సాంకేతికతల భావి రూపును చర్చించడానికి సన్నాహాలను ‘గ్లోబల్ స్టాండర్డ్స్ సింపోజియమ్ 2024’ విజయవంతంగా పూర్తి చేసింది. అంతర్జాతీయ సమన్వయం, ప్రమాణీకరణలు ఏ విధంగా నూతన ఆవిష్కరణలను ముందుకు తీసుకు పోగలవో ఈ సదస్సు కళ్ళకు కట్టింది. ఈ సదస్సు ఫలితాల పత్రాన్ని ప్రాతిపదికగా తీసుకొని, ‘వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ’ (డబ్ల్యూటీఎస్ఏ-24)లో చర్చించనున్నారు. డబ్ల్యూటీఎస్ఏ ను కూడా న్యూ ఢిల్లీలోనే ఈ నెల 15 నుంచి 24 వరకు నిర్వహిస్తున్నారు.
***
(Release ID: 2065132)
Visitor Counter : 61