హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మాదకద్రవ్యాల బారిన పడకుండా మన యువతను రక్షించుకోవడం ద్వారా మాదకద్రవ్య రహిత భారత్ నిర్మాణానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది: కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా

మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఎటువంటి అలసత్వం లేకుండా వేట కొనసాగుతుంది
గుజరాత్ పోలీసులు ఇటీవల స్వాధీనం చేసుకున్న రూ .5,000 కోట్ల విలువైన కొకైన్ తో సహా వరస దాడుల్లో రూ.13,000 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నందుకు ఢిల్లీ పోలీసులను అభినందించిన కేంద్ర హోం మంత్రి

Posted On: 14 OCT 2024 5:57PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, మాదకద్రవ్యాల పీడ నుండి మన యువతను రక్షించడం ద్వారా మాదకద్రవ్యాల రహిత భారత్ ను నిర్మించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు. 

 

మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల (డ్రగ్స్ , నార్కో) వ్యాపారాలను ఎలాంటి అలసత్వం లేకుండా కఠినంగా అణచి వేస్తామని అమిత్ షా సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘ వేదికగా స్పష్టం చేశారు. గుజరాత్ పోలీసులు ఇటీవల స్వాధీనం చేసుకున్న రూ. 5,000 కోట్ల విలువైన కొకైన్ తో సహా వరస దాడుల్లో రూ.13,000 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నందుకు ఢిల్లీ పోలీసులను శ్రీ అమిత్ షా అభినందించారు.

 

2024 అక్టోబర్ 13న గుజరాత్ లోని అంక్లేశ్వర్ కు చెందిన ఓ కంపెనీలో చేసిన సోదాల్లో ఢిల్లీ ప్రత్యేక పోలీసులు, గుజరాత్ పోలీసులు 518 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.5,000 కోట్లు.

 

అంతకుముందు, 2024 అక్టోబర్ 1న మహిపాల్పూర్ లోని ఓ గోదాముపై ఢిల్లీ ప్రత్యేక పోలీసులు దాడి చేసి 562 కిలోల కొకైన్, 40 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, దర్యాప్తులో భాగంగా 2024 అక్టోబర్ 10న ఢిల్లీ రమేష్ నగర్ లోని ఒక దుకాణంలో మరో 208 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలు గుజరాత్ లోని అంకలేశ్వర్ లో ఉన్న ఒక కంపెనీకి చెందినవని విచారణలో తేలింది.

 

ఈ కేసులో అంతర్జాతీయ మార్కెట్ లో రూ.13,000 కోట్ల విలువైన 1,289 కిలోల కొకైన్, 40 కిలోల హైడ్రోపోనిక్ థాయ్ లాండ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

***


(Release ID: 2064827) Visitor Counter : 45