రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

ప్రజలకు రాష్ట్రపతి దుర్గాపూజ శుభాకాంక్షలు

Posted On: 10 OCT 2024 6:40PM by PIB Hyderabad

దుర్గా పూజ సందర్భంగా భారత ప్రజలకు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు.  
ఈ మేరకు తన సందేశంలో రాష్ట్రపతి ఇలా పేర్కొన్నారు, “పవిత్రమైన దుర్గా పూజ పండుగ సందర్భంగా, దేశ, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దుర్గా పూజను జరుపుకొంటాం. దుర్గామాతను శక్తికి ప్రతీకగా ఆరాధిస్తాం. ఇది భక్తిభావానికి సంబంధించిన పండుగ, ఈ సమయంలో మనమంతా భక్తిశ్రద్ధలతో దుర్గామాతను పూజించుకొంటాం. ఈ పండుగ మనం పూర్తిగా దుర్గామాతకు అంకితమయ్యే పండుగ అలాగే దేశంలో అన్ని మతాల వారి మధ్య ఐకమత్యాన్ని, అనుబంధాలను పెంపొందించే పండుగ.

ప్రశాంతమైన, సమసమాజ ఏర్పాటు కోసం మనందరికీ బలాన్ని, ధైర్యాన్ని, ధృడ నిశ్చయాన్ని ప్రసాదించమని దుర్గామాతను మనం ప్రార్థించుదాం.  

మహాశక్తిని కొలిచే ఈ శుభసందర్భంలో, మనమంతా మహిళల పట్ల అత్యంత గౌరవ మర్యాదలతో వ్యహరించడానికి సంకల్పం తీసుకుందాం”.  

Please click here to see the President messgae - 


(Release ID: 2064008) Visitor Counter : 51