ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆదాయపు పన్ను విభాగం ఇ-ఫైలింగ్ పోర్టల్ లో 2024 అక్టోబరు 7 వరకు

34.84 లక్షలకు పైగా దాఖలైన ఆడిట్ నివేదికలు

మదింపు సంవత్సరం 2024-25 లో దాదాపు 34.09 లక్షల టాక్స్ ఆడిట్ నివేదికల (టీఏఆర్ స్) దాఖలు; టీఏఆర్ స్ దాఖలులో ఏటికేడాది 4.8 శాతం వృద్ధి

Posted On: 09 OCT 2024 5:48PM by PIB Hyderabad

మదింపు సంవత్సరం 2024-25లో ఆదాయపు పన్ను విభాగం ఇ-ఫైలింగ్ పోర్టల్ లో గడువు తేదీ ముగిసే సరికల్లా 34.84 లక్షలకు పైగా ఆడిట్ నివేదికలు దాఖలయ్యాయివాటిలో సుమారు 34.09 టాక్స్ ఆడిట్ రిపోర్టులు (టీఏఆర్ స్కూడా కలిసి ఉన్నాయిఏవై 2023-24 కు నిర్దేశించిన గడువు తేదీ నాటికి అందిన టీఏఆర్ లతో పోలిస్తేఏవై 2024-25 లో దాఖలైన టీఏఆర్ లలో రమారమి 4.8 శాతం వృద్ధి నమోదైంది.

పన్ను చెల్లింపుదారులకు సహాయకారిగా ఉండాలన్న ఉద్దేశంతోఆదాయపు పన్ను విభాగం ఎలక్ట్రానిక్-మెయిల్స్సంక్షిప్త సందేశాలువెబినార్ల ద్వారా ఆదాయపు పన్ను పోర్టల్ లో ఉంచిన సందేశాల రూపంలో ప్రచార ఉద్యమాలను చేపట్టారుపన్ను చెల్లింపుదారులు వారి టిఎఆర్ లను,  ఇంకా ఇతర ఆడిట్ ఫారాలను గడువు తేదీ లోపల దాఖలు చేసేటట్లుగా వారిలో చైతన్యాన్ని కలిగించడంతత్సంబంధిత అవగాహనను పెంపొందించడం ఈ ప్రచార ఉద్యమాల ఉద్దేశాలు.  తగిన మార్గదర్శకత్వం వహిస్తూవినియోగదారులలో చైతన్యమే ప్రధానంగా రూపొందించినటువంటి అనేక వీడియోలను ఆదాయపు పన్ను వెబ్ సైట్లో అప్ లోడ్ చేశారుపన్ను చెల్లింపుదారులుపన్నుల సంబంధిత వృత్తి నిపుణులు ఫారమ్ నంబర్స్ 10బీ, 10బీబీ, 3సీఎ-సీడీ, 3సీబీ-సీడీ ల రూపాలలో టీఎఆర్ లనుఇంకా ఫారమ్ నంబర్స్ 29బీ, 29సీ, 10సీసీబీ వంటి ఇతర ఆడిట్ రిపోర్టులను నిర్దిష్ట కాలం లోపల సమర్పించడంలో ఈ ఉమ్మడి ప్రయత్నాలు తోడ్పడ్డాయి.

పన్ను చెల్లింపుదారులు ఈ సంవత్సరం సెప్టెంబరుఅక్టోబరు నెలల్లో దాఖలు చేసిన దాదాపు 1.23 లక్షల ప్రశ్నలకు జవాబులను ఇచ్చివారికి రిపోర్టు దాఖలు గడువు కాలమంతటా ఇ-ఫైలింగ్ హెల్ప్ డెస్క్ జట్టు అండదండలను అందించింది.  ఈ జట్టు పన్ను చెల్లింపుదారులుపన్నుల రంగంలోని వృత్తి నిపుణులకు వారు ఎదుర్కొన్న జటిల సమస్యలను పరిష్కరించడంతో పాటుఆడిట్ ఫారాల సమర్పణ సాఫీగా సాగేటట్లు తోడ్పడిందిహెల్ప్ డెస్క్ కు వచ్చిన ఫోన్ కాల్స్,హెల్ప్ డెస్క్ నుండి వినియోగదారులకు వెళ్లిన ఫోన్ కాల్స్వినియోగదారులతో సంభాషణలువెబ్ఎక్స్ఇంటర్ నెట్ ఆధారిత సంప్రదింపులలో వినియోగదారులకు తగిన సూచనలనుసలహాలను ఇవ్వడం వంటి పద్దతులలో హెల్ప్ డెస్క్ సహకరించిందిఆదాయపు పన్ను విభాగానికి ఉన్న ‘ఎక్స్’ ఖాతా ద్వారా వినియోగదారులు అడిగిన ప్రశ్నలకు కూడా ఈ జట్టు ఆన్ లైన్ రెస్పాన్స్ మేనేజ్ మెంట్ (ఓఆర్ఎమ్మాధ్యమం ద్వారా సమాధానాలను పంపిందిఈ విధానంతో వాస్తవ కాల ప్రాతిపదికన వేర్వేరు అంశాలపై పన్ను చెల్లిపుదారులకుసంబంధిత వర్గాల వారికి సహాయాన్ని అందించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

 

***


(Release ID: 2063991) Visitor Counter : 54