నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దిబ్రుగఢ్ రిక్షా కార్మికులు, లాగుడు బళ్ళ కార్మికులతో ఓడరేవులు, నౌకావాణిజ్యం, జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద్ సోనోవాల్ సమావేశం

Posted On: 08 OCT 2024 1:50PM by PIB Hyderabad

దిబ్రుగఢ్ లో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఓడరేవులు, నౌకావాణిజ్యం, జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద్ సోనోవాల్ శ్రామిక సోదరులతో సమయం గడిపారు.  రిక్షా కార్మికులు, లాగుడు బళ్ళవారు సహా శ్రామిక సోదరులతో ముచ్చటించిన దిబ్రుగఢ్ ‘ఎల్ ఎస్ సీ’ నియోజకవర్గ పార్లమెంటు సభ్యుడు శ్రీ సోనోవాల్, అనంతరం వారితో కలిసి పూరీ-కూరను ఆస్వాదించారు.      

ఈ సందర్భంగా ప్రసంగించిన మంత్రి, “అందరికీ సమాన అవకాశాలూ, సమాన గౌరవం అనే అంత్యోదయ సూత్రం మార్గదర్శనంగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం సమాజంలోని ప్రతి వ్యక్తినీ సాధికారులను చేయాలని భావిస్తోంది.  స్థానిక ఆర్థిక వ్యవస్థ ఎటువంటి ఇబ్బందులూ లేకుండా నడవడంలో మీ శ్రమకూ భాగముంది. దుర్గాపూజ పవిత్ర సమయంలో, ఆహ్లాదకరమైన శరదృతువులో ఈ విధంగా మిమ్మలందరినీ కలుసుకోవడాన్ని  గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. శ్రామిక సోదరులతో పూరీ-కూర కలిసి భుజించడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది, నా బాల్య  స్మృతులను జ్ఞప్తికి తెచ్చింది” అన్నారు.  


(Release ID: 2063347) Visitor Counter : 38