రాష్ట్రపతి సచివాలయం
మాల్దీవుల అధ్యక్షుడికి రాష్ట్రపతి ఆతిథ్యం
భారత్ 'ప్రథమ పొరుగుదేశాల' విధానంలో, సాగర్ దార్శనికతలో మాల్దీవులకు ప్రత్యేక స్థానం ఉంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
प्रविष्टि तिथि:
07 OCT 2024 9:28PM by PIB Hyderabad
మాల్దీవుల దేశాధ్యక్షుడు గౌరవ డాక్టర్ మహమ్మద్ ముయిజ్జుకు, రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నేడు రాష్ట్రపతి భవన్‌లో స్వాగతం పలికారు. అధ్యక్షుడు ముయిజ్జు, ప్రథమ మహిళ సాజిదా మహమ్మద్ గౌరవార్థం రాష్ట్రపతి విందు ఏర్పాటు చేశారు.
రాష్ట్రపతి భవన్‌లో డాక్టర్ ముయిజ్జుకు స్వాగతం పలికిన రాష్ట్రపతి, మాల్దీవులు హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశానికి సన్నిహిత మిత్ర దేశం, కీలక భాగస్వామిగా పేర్కొన్నారు. 'పొరుగువారికి ప్రథమ స్థానం ' విధానం, సాగర్ దార్శనికతలో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు.
మాల్దీవుల దేశాధ్యక్షుని భారత పర్యటనలో భాగంగా ఆమోదించిన 'విజన్ డాక్యుమెంట్' ఇరు దేశాల సంబంధాలను పెంచుతుందని... సమగ్ర ఆర్థిక, సముద్ర భద్రతా భాగస్వామ్యాన్ని సాధించడానికి స్పష్టమైన దారిని చూపుతుందని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు.
మాల్దీవుల అగ్రశ్రేణి వాణిజ్య భాగస్వాముల్లో భారత్ ఒకటని, డిజిటల్ చెల్లింపులు, ఇతర నూతన సాంకేతిక పరిజ్ఞానాల రంగంలో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కూడా మంచి అవకాశాలున్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు.
ఈ ద్వైపాక్షిక భాగస్వామ్యంలో చోటు చేసుకున్న పురోగతి ద్వారా ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని ఇరు నేతలు అంగీకరించారు.
***
(रिलीज़ आईडी: 2063027)
आगंतुक पटल : 111