హోం మంత్రిత్వ శాఖ
గుజరాత్ లోని గాంధీనగర్ లో హీరామణి ఆరోగ్యధామ్ డే-కేర్ హాస్పిటల్ ను ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను మెరుగు పరచడానికి, ప్రజలకు అందుబాటులోకి తేవడానికి గుజరాత్ కు పూర్వ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాన మంత్రి అయిన శ్రీ నరేంద్ర మోదీ ఎన్నో చర్యలను చేపట్టారు
పౌరుల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, ప్రతి కుటుంబానికి మరుగుదొడ్డి, తాగునీటిని సమకూర్చడానికి స్వచ్ఛ్ భారత్ మిషన్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు
అంతర్జాతీయ యోగ దినోత్సవ నిర్వహణకు నడుం కట్టడం ద్వారా, యోగాభ్యాసం చేయడాన్ని ప్రజల దినచర్యలో భాగంగా మార్చివేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
రాబోయే 10 సంవత్సరాలలో మరో 75,000 మెడికల్ సీట్లను అందుబాటులోకి తీసుకు రావాలన్న ప్రణాళికతో దేశంలో ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలను పెంచనున్న మోదీ ప్రభుత్వం
ఖరీదైన వైద్యఖర్చుల భారాన్ని తగ్గించడానికి జనరిక్ ఔషధాలను తెచ్చింది...
మందులను పది నుంచి 30 శాతం తక్కువ ధరకే పేదలు దక్కించుకొనే అవకాశాన్ని కల్పించింది
లక్షలాది మంది ప్రజల కోసం 37 వివిధ పథకాలను
మోదీ ప్రభుత్వం ఏకం చేసి, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలపరుస్తోంది
ప్రజల కష్టాలను తీర్చడానికి సహృదయంతో, ముందుచూపుతో ప్రణాళికలను
రూపొందిస్త
Posted On:
04 OCT 2024 4:19PM by PIB Hyderabad
హీరామణి ఆరోగ్యధామ్ డే-కేర్ హాస్పిటల్ ను గుజరాత్ లోని గాంధీనగర్ లో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ తో పాటు అనేక మంది ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
గుజరాత్ రాష్ట్రానికి అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లో ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను మెరుగు పరచి, వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడానికి అనేక ప్రయత్నాలు చేశారని శ్రీ అమిత్ షా తన ప్రసంగంలో చెప్పారు. శ్రీ నరహరి అమీన్ సమాజానికి సేవ చేయడానికి, సమస్యలను పరిష్కరించడానికి ఎడతెగక కృషి చేశారని కేంద్ర మంత్రి అన్నారు.
గుజరాత్ లో క్రికెట్ సంఘం ద్వారా క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలను శ్రీ నరహరి ఏర్పాటు చేశారని శ్రీ అమిత్ షా ప్రముఖంగా ప్రస్తావించారు. అంతేకాకుండా, పాఠశాలల ద్వారా దాదాపుగా నాలుగే వేల మంది బాలలకు విద్యను అందించడానికి, మరి అలాగే విధ్యార్థుల పురోగతికి కూడా ఆయన గణనీయమైన ప్రయత్నాలను చేశారన్నారు. వృద్ధాశ్రమాలను, అన్నపూర్ణ ధర్మనిధిని నెలకొల్పిన శ్రీ నరహరి ప్రస్తుతం తన తల్లితండ్రుల జ్ఞాపకార్థం ఈ హీరామణి ఆరోగ్యధామ్ ను నిర్మించారు. ఇది నిజంగా ప్రశంసనీయం అని శ్రీ అమిత్ షా అన్నారు.
ఆధునిక జీవన సరళి, నిత్యం పరుగులు పెట్టవలసిన బతుకులు, కాలుష్యం, ఇతర అంశాలు మన శరీరాలను ప్రభావితం చేసి వేరు వేరు వ్యాధులకు కారణమవుతున్నాయనీ, ఆ వ్యాధుల బారి నుండి విముక్తిని పొందడానికి దీర్ఘకాలం పాటు చికిత్సలు అవసరం అవుతున్నాయని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ఈ విధమైన జబ్బులకు పలు రకాల చికిత్సలు, డయాలిసిస్, ఫిజియోథెరపీ ఇంకా ఇతర చికిత్సలను చేయించుకోవలసి వస్తోందని అన్నారు. ఆ తరహా చికిత్సలకు సాధారణంగా చాలా పెద్ద మొత్తం ఖర్చు చేయవలసి వస్తోందని, దీనితో పాటు ఆ తరహా చికిత్సలు పేదలకు, మధ్యతరగతి ప్రజలకు, పల్లె ప్రాంతాలలో నివసించే వారికి అందుబాటులో ఉండడం లేదని ఆయన అన్నారు. ఈ సవాళ్ళను శ్రీ నరహరి దృష్టిలో పెట్టుకొని హీరామణి ఆరోగ్యధామ్ ను నిర్మించారనీ, దీని ప్రారంభోత్సవం ఈ రోజున జరిగింది... అని మంత్రి అన్నారు. ప్రజల ఆరోగ్య సమస్యలను తీర్చడానికి శ్రీ నరహరి సమగ్ర దృక్పథంతో ముందంజ వేశారని శ్రీ అమిత్ షా అన్నారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘స్వచ్ఛ్ భారత్ మిషన్’ ను ప్రారంభించారని, ఇది అనారోగ్యాల నుంచీ, అనేక రోగాల బారి నుంచీ తమను తాము కాపాడుకోవడంలో ప్రజలకు సాయపడిందని శ్రీ అమిత్ షా వివరించారు. దీనికి తరువాయిగా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీరు అందేటట్లు జాగ్రత్త చర్యలను తీసుకుందని, ఫలితంగా వారు నీటి ద్వారా సోకే వ్యాధుల నుంచి విముక్తిని పొందగలిగారని కూడా మంత్రి తెలిపారు. ప్రతి ఇంటిలో మరుగుదొడ్ల ఏర్పాటు, ప్రజల దినచర్యలో వ్యాయామాన్ని ఒక భాగంగా చేస్తూ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పరిచయం చేయడం వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు మంత్రి వివరించారు. ‘ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ కార్డు’ను తీసుకొని రావడం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్షల కొద్దీ ప్రజలకు రూ.5 లక్షల వరకు విలువైన సమగ్ర ఆరోగ్య సంరక్షణ సదుపాయాన్ని కల్పించి, వారు ఖరీదైన చికిత్సల తాలూకు భారాన్ని మోయకుండా చూస్తున్నారని శ్రీ అమిత్ షా అన్నారు.
ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందిస్తే రూపొందించవచ్చుననీ, అయితే సమగ్ర ఆరోగ్య సంరక్షణ అనేది చాలినంత మౌలిక సదుపాయాల వ్యవస్థ లేకుండా ఏదీ సాధ్యపడదని కేంద్ర హోం మంత్రి అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగ సంబంధిత మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాందీ ప్రస్తావన చేశారని మంత్రి అన్నారు. రాబోయే పది సంవత్సరాలలో మెడికల్ సీట్ ల సంఖ్యను మరో 75,000 మేర పెంచాలని మోదీ ప్రభుత్వం భావిస్తోందని శ్రీ అమిత్ షా వెల్లడించారు. ఎక్కువ ధరకుగానీ లభించని మందుల తాలూకు భారాన్ని ప్రజలకు తప్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జనరిక్ మందుల అందజేతకు యంత్రాంగాన్ని స్థాపించిందని మంత్రి అన్నారు. దీంతో మందులు మార్కెట్ ధరలతో పోలిస్తే సుమారు 10 నుంచి 30 శాతం తక్కువ ధరలలో దొరుకుతున్నాయని ఆయన అన్నారు.
దాదాపుగా 37 రకాల పథకాలను కలిపేసి యావత్తు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు కొత్త రూపును ఇచ్చినట్లు శ్రీ అమిత్ షా తెలియజేశారు. దేశంలో 140 కోట్ల మంది ప్రజల ఆరోగ్య సంబంధిత సమస్యలను నివారించడానికి చేపట్టిన ఒక ప్రయత్నమే ఈ 37 విధాలైన కార్యక్రమాల కలగలపడం అని ఆయన తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సూక్ష్మగ్రాహ్యతతోను, వారి యాతనలను తగ్గించాలన్న ముందుచూపుతోను ఈ తరహా ప్రణాళికలను తీసుకువస్తున్నామనడానికి ఇది ఒక ప్రధాన ఉదాహరణ అని అమిత్ షా స్పష్టం చేశారు.
దీర్ఘకాలం పాటు బాధించే వ్యాధులకు అవసరమయ్యే రోజువారి చికిత్స సంబంధిత సదుపాయాలు, ఉదాహరణకు చెప్పాలంటే డయాలసిస్, ఫిజియోథెరపీ వంటివి మన చుట్టుపక్కల ప్రాంతాలలో మనం భరించ గలిగే ధరలకు దొరుకుతూ ఉన్నట్లయితే గనక పేద ప్రజలు లాభపడటానికి అవకాశం ఉంటుందని కేంద్ర హోం మంత్రి అన్నారు. డయాలసిస్, ఫిజియోథెరపి తదితర వివిధ చికిత్సలను సాధారణ ప్రజానీకం వారు భరించ గలిగే ధరలలో హీరామణి ఆరోగ్యధామ్ లో చేయించుకోవచ్చని ఆయన చెప్పారు.
(Release ID: 2062280)
Visitor Counter : 38