యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

ఖేలో ఇండియా జనరల్ కౌన్సిల్ 4వ సమావేశానికి అధ్యక్షత వహించిన డాక్టర్ మాన్‌సుఖ్ మాండవీయ


ప్రజాభిప్రాయం కోసం ముసాయిదా క్రీడా విధానం విడుదల

క్రీడాకారుల సంక్షేమం, ప్రతిభను గుర్తించడం, క్రీడారంగ బలోపేతం కోసం

సబ్-కమిటీల ఏర్పాటుకు ఆదేశించిన కేంద్ర మంత్రి

ప్రతిభను గుర్తించడం కోసం అన్ని సంస్థలు సమన్వయంతో

కృషి చేసే సంయుక్త కార్యాచరణ అవసరాన్ని స్పష్టం చేసిన కేంద్రమంత్రి


రాష్ట్ర, కేంద్ర మంత్రిత్వ శాఖల సహకారంతో క్రీడా నియామకాల కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు
దేశంలోని అన్ని క్రీడా మౌలిక సదుపాయాల సమాచార సేకరణ, ఏకీకరణ కోసం ఏకీకృత జాతీయ డేటాబేస్

Posted On: 03 OCT 2024 6:34PM by PIB Hyderabad

ఖేలో ఇండియా పథకం జనరల్ కౌన్సిల్ (జీసీ4వ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడలుకార్మిక ఉపాధి మంత్రి డాక్టర్ మాన్‌సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిందిఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల సీనియర్ అధికారులుప్రముఖ క్రీడా నియంత్రణ మండళ్లుజాతీయ క్రీడా సమాఖ్యలుకేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన ముఖ్య ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా... ప్రజాభిప్రాయం కోసం నూతన క్రీడా విధాన ముసాయిదాను మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి ప్రకటించారుదేశంలో అభివృద్ధి చెందుతున్న క్రీడారంగానికి అనుగుణంగా ప్రస్తుత కార్యాచరణను ఆధునీకరించేనవీకరించే లక్ష్యంతో ఈ క్రీడా విధానాన్ని రూపొందించామని తెలిపారుఈ క్రీడా విధానం గురించి రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో పాటు సాధారణ ప్రజల అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నామన్నారుఈ అభిప్రాయాల మేరకు ఖరారు చేసే క్రీడా విధానం రాష్ట్రాలు వారి సొంత విధానాన్ని రూపొందించుకోవడంలో ఒక నమూనాగా ఉపయోగపడనుంది.

సమావేశం సందర్భంగాడాక్టర్ మాండవీయ ఖేలో ఇండియా పథకం పురోగతిని సమీక్షించారుక్రీడాకారులుఅథ్లెట్ల ప్రదర్శన మెరుగుపరిచేందుకు క్రీడా మౌలికసదుపాయాలువసతుల అభివృద్ధి గురించి వివరంగా చర్చించారుప్రతిభను వెలికితీయడంలో అలాగే మెరుగుపరచడంలో కృషి చేస్తున్న వివిధ సంస్థలుకేంద్రరాష్ట్ర ప్రభుత్వ పథకాలుప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు), జాతీయ క్రీడా సమాఖ్యల మధ్య సమన్వయం కోసం ఒక సంయుక్త కార్యాచరణ అవసరాన్ని కేంద్ర మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు.

కింది విషయాలపై దృష్టి సారించడం కోసం కేంద్ర మంత్రి సబ్-కమిటీల ఏర్పాటుకు ఆదేశించారు:

1. క్రీడాకారుల మెరుగైన కెరీర్ పురోగతి కోసం మంత్రిత్వ శాఖలువిభాగాలలో నియామక విధానాలను మెరుగుపరచడం

2.  అథ్లెట్ల సంక్షేమంసహాయం కోసం గల వ్యవస్థలను మెరుగుపరచడం.  

3.  అట్టడుగు స్థాయి నుంచి ప్రతిభను గుర్తించేందుకు సమర్థమంతమైన కార్యక్రమాలను అభివృద్ధి చేయడం.

కేంద్ర మంత్రిత్వ శాఖల్లో క్రీడాసంబంధ నియామకాల సమాచారం కోసం ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించినట్లు కేంద్ర మంత్రి ప్రకటించారుక్రీడల కోటాలో ఖాళీల సమాచారాన్ని ప్రచారం చేయడానికిఅందరికీ అందుబాటులో ఉంచడానికి అలాగే నియామకాల్లో పారదర్శకతను పెంచడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకునేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తామన్నారు.

 

ఈ సమావేశంలో పీఎం గతి శక్తి కింద క్రీడా మౌలిక సదుపాయాల ఏకీకృత డేటాబేస్‌ ఏర్పాటు పురోగతిపై సమీక్ష నిర్వహించారుదేశంలోని అన్ని క్రీడా మౌలిక సదుపాయాల సమగ్ర జాబితా రూపొందించడానికి రాష్ట్రాలుక్రీడా సమాఖ్యలుఇతర సంస్థలు సమాచారాన్ని సేకరించాలని డాక్టర్ మాండవీయ ఆదేశించారు.

 

***



(Release ID: 2061706) Visitor Counter : 13