ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్వచ్ఛ భారత్ మిషన్ దశాబ్ది నేపథ్యంలో వివిధ దేశాధినేతలు.. ప్రపంచ సంస్థల నుంచి ప్రధానమంత్రికి అభినందన సందేశాలు

Posted On: 02 OCT 2024 2:03PM by PIB Hyderabad

   స్వచ్ఛ భారత్ మిషన్ (పరిశుభ్ర భారత్ కార్యక్రమం-ఎస్‌బిఎం) విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వివిధ దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి అభినందన సందేశాలు వెల్లువెత్తాయి. ఆయన దార్శనిక నాయకత్వాన పారిశుధ్యం-పరిశుభ్రత మెరుగు ద్వారా ‘ఎస్‌బిఎం’ భార‌త్‌లో గణనీయ మార్పు తెచ్చిన తీరును ఈ సందర్భంగా వారు ప్రశంసించారు. ఈ మేరకు:-

   ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ పంపిన శుభాకాంక్షల సందేశం గురించి ప్రధానమంత్రి ‘మైగవ్’ ద్వారా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వివరించారు:

   ‘‘స్వచ్ఛ భారత్ మిషన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్ట‌ర్ టెడ్రోస్ అధ‌నామ్ ఘెబ్రేయేసస్- ప్రధానమంత్రి @నరేంద్రమోదీతోపాటు ప్రభుత్వ యంత్రాంగం కృషిని ప్రశంసించారు. ఈ పరివర్తనాత్మక కార్యక్రమం ద్వారా సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో గణనీయ స్థాయిలో ముందడుగు పడిందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా భారత్ పరిశుభ్ర-ఆరోగ్యకర దేశంగా రూపొందేలా ప్రజా సమూహానికి ప్రేరణనిచ్చిందని అభినందించారు.#10YearsOfSwachhBharat #SBD2024 #SHS2024’’

   అదేవిధంగా ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ అజయ్ బంగా పంపిన శుభాకాంక్షల సందేశం గురించి శ్రీ మోదీ ‘మైగవ్’ ద్వారా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వివరించారు:

   ‘‘ప్రధానమంత్రి @నరేంద్రమోదీ దార్శనిక నేతృత్వాన స్వచ్ఛ భారత్ మిషన్ మెరుగైన పారిశుధ్యం ద్వారా దేశంలో ప్రగతిశీల మార్పు తెచ్చిందని, తద్వారా కీలక మైలురాయిని అధిగమించిందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా కొనియాడారు. #10YearsOfSwachhBharat #SBD2024 #SHS2024’’

   ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రెసిడెంట్ మసత్సుగు అసకవా పంపిన శుభాకాంక్షల సందేశం గురించి శ్రీ మోదీ ‘మైగవ్’ ద్వారా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వివరించారు:

   ‘‘పరిణామాత్మక స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి నాయకత్వం వహించడంపై ప్రధానమంత్రి @నరేంద్ర మోదీని ఆసియా అభివృద్ధి (ఎడిబి) బ్యాంకు ప్రెసిడెంట్ మసత్సుగు అసకవా ప్రశంసించారు. ఈ దార్శనిక కార్యక్రమంలో ఆదినుంచీ ‘ఎడిబి’ భాగస్వామ్యం తమకెంతో గర్వకారణమని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు.

#10YearsOfSwachhBharat #SBD2024 #SHS2024’’

   ప్రముఖ అధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ శుభాకాంక్షల సందేశం గురించి శ్రీ మోదీ ‘మైగవ్’ ద్వారా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వివరించారు:

   ‘‘మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ @నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ అభియాన్‌ను ప్రారంభించిన నాటినుంచీ దేశ ప్రజల్లో పరిశుభ్రతపై శ్రద్ధ పెరగటం మనమిప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం.#10YearsOfSwachhBharat #SBD2024 #SHS2024’’

   ప్రసిద్ధ పారిశ్రామికవేత్త, టాటా ట్రస్టుల చైర్మన్ శ్రీ రతన్ టాటా శుభాకాంక్షల సందేశం గురించి శ్రీ మోదీ ‘మైగవ్’ ద్వారా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వివరించారు:

   ‘‘ఎస్‌బిఎం’ దశాబ్ది నేపథ్యంలో గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ @నరేంద్రమోదీకి నా అభినందనలు.#10YearsOfSwachhBharat @RNTata2000,#SBD2024 #SwachhBharat’’

   మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, వితరణశీలి బిల్ గేట్స్ శుభాకాంక్షల సందేశం గురించి శ్రీ మోదీ ‘మైగవ్’ ద్వారా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వివరించారు:

   ‘‘పరిశుభ్రత, ప్రజారోగ్యంపై స్వచ్ఛ భారత్ మిషన్ ప్రభావం అత్యద్భుతం. ఈ కార్యక్రమంపై ఇదీ నా అభిప్రాయం.#10YearsOfSwachhBharat. #NewIndia #SwachhBharat’’

 

***

MJPS/SR/SKS


(Release ID: 2061194) Visitor Counter : 56