శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
శాస్త్ర పరిశోధనలకు మకుటాయమానం- సీఎస్ఐఆర్ సంస్థను స్థాపించి 83 ఏళ్లు: వేడుక నిర్వహించిన సీఎస్ఐఆర్- ఎన్ఐఎస్‌సిపిఆర్
Posted On:
01 OCT 2024 11:52AM by PIB Hyderabad
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్) 83వ స్థాపన దినం సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని న్యూఢిల్లీ లోని పూసాలో ఉన్న నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్ లో సిఎస్ఐఆర్ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రిసర్చ్ (సీఎస్ఐఆర్-ఎన్ఐఎస్‌సీపీఆర్) నిర్వహించింది.
సీఎస్ఐఆర్-ఎన్ఐఎస్‌సీపీఆర్ ఏర్పాటు చేసిన 83వ సీఎస్ఐఆర్ స్థాపక దినోత్సవ కార్యక్రమంలో స్వాగతోపన్యాసాన్ని ఇస్తున్న సీఎస్ఐఆర్-ఎన్ఐఎస్‌సీపీఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ రంజన అగర్వాల్
సీఎస్ఐఆర్-ఎన్ఐఎస్‌సీపీఆర్ డైరెక్టర్, ప్రొఫెసర్ రంజన అగర్వాల్ స్వాగతోపన్యాసంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ‘‘విజ్ఞానశాస్త్రానికి, సాంకేతిక శాస్త్రానికి సంబంధించిన అన్ని రంగాలలో సీఎస్ఐఆర్ ప్రయోగశాలలు చురుకుగా పాలుపంచుకొంటున్నాయి. ఎన్ఐఎస్‌సీపీఆర్ లో మేం ప్రధానంగా విజ్ఞానశాస్త్రానికీ, సమాజానికీ మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడంపై దృష్టి కేంద్రీకరించాం. మేం ప్రజాదరణకు నోచుకొన్న మూడు సైన్స్ మ్యాగజైన్లనూ, 15 పరిశోధన ప్రధానమైన పత్రికలను ప్రచురిస్తున్నాం. అంతేకాక, మేం చెప్పే విషయాలు భారతీయ భాషలన్నిటిలో అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్నాం. మరీ ముఖ్యంగా, ఇటీవల జరిగిన ‘యుఎన్ అసెంబ్లీ సైన్స్ సమిట్’ లోనూ మేం పాలుపంచుకొన్నాం’’ అన్నారు.
కార్యక్రమంలో హర్యానా కేంద్రీయ విశ్వవిద్యాయం ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ (డాక్టర్) సుష్మ యాదవ్ ప్రసంగిస్తున్న దృశ్యం
విశిష్ఠ అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న హర్యానా కేంద్రీయ విశ్వవిద్యాయం ప్రొఫెసర్ (డాక్టర్) సుష్మ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘సైన్స్ కు, పరిశ్రమకు మధ్య అంతరాన్ని భర్తీ చేయడానికి సీఎస్ఐఆర్ పాటుపడుతోంది. చారిత్రికంగా చూస్తే భారతదేశంలో విజ్ఞానశాస్త్ర పరమైన దృక్పథం కొరవడిందన్న అపార్థం ఉంది. దీనిని సరిదిద్దడానికి సీస్ఐఆర్ శ్రమిస్తోంది. ఆత్మ స్వభావంతో ముడిపడి ఉండే విజ్ఞానశాస్త్ర సంబంధిత సంప్రదాయాన్ని ప్రోత్సహించడం ద్వారా మేం సహేతుక పరిశోధనకు, సాంస్కృతిక విలువలకు ఒక పొందికైన మేళనాన్ని ఆవిష్కరించాలనే ధ్యేయంతో పని చేస్తున్నాం’’ అన్నారు.
కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కన్సార్షియం ఫర్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్ భూషణ్ నడ్డా
కన్సార్షియం ఫర్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ డైరెక్టర్ జగత్ భూషణ్ నడ్డా మాట్లాడుతూ, ‘‘సీఎస్ఐఆర్ భారతదేశ వైజ్ఞానిక సంప్రదాయాన్ని ప్రశంసనీయంగా ముందుకు తీసుకుపోతూ, మన దేశయాత్రలో ఒక మైలు రాయిగా ఉంది. దేశానికి ఎదురైన సవాళ్ళను పరిష్కరించడంలో సీఎస్ఐఆర్ ముందు భాగంలో నిలబడి, విశాల సమాజ హితం కోసం పనిన చేస్తోంది. విజ్ఞానశాస్త్రాన్ని అందరి చెంతకు చేర్చవలసిన, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారికి దగ్గరగా తీసుకు పోవలసిన అవసరం ఉంది. విజ్ఞానశాస్త్ర రంగంలో పరిశోధన, నవకల్పనల వల్ల ఒనగూరిన ఫలితాలు ఆచరణాత్మక పద్ధతులలోకి మారినపుడు ఎక్కువ ప్రయోజనాలు దక్కుతాయి. ఉన్నత విద్య, పరిశోధన, నవకల్పనల మధ్య సీఎస్ఐఆర్ మేలైన సమన్వయాన్ని సాధిస్తూ, ప్రపంచంలో విజ్ఞానశాస్త్రం, నవకల్పన రంగాల్లో నాయకత్వం వహిస్తున్న దేశాల్లో ఒక దేశంగా భారతదేశాన్ని నిలబెట్టే పనిలో నిమగ్నమైంది’’ అన్నారు.
ఈ సందర్భంగా ‘సైన్స్ రిపోర్టర్’ ప్రత్యేక సంచికను కూడా విడుదల చేశారు. సీఎస్ఐఆర్- ఎన్ఐఎస్‌సీపీఆర్ ఈ మాస పత్రికను ప్రచురిస్తోంది. ‘‘సైన్స్ రిపోర్టర్: ఎ సిక్స్ డెకేడ్ జర్నీ ఇన్ సైన్స్ కమ్యూనికేషన్ (1964-2024)’’ అనే శీర్షికతో ప్రత్యేక సంచికను తెచ్చారు.
సంస్థలో 25 సంవత్సరాల వృత్తి జీవనాన్ని పూర్తి చేసుకొన్న ఉద్యోగులకు, విశ్రాంతి ఉద్యోగులకు, పదో తరగతికి చెందిన, పన్నెండో తరగతికి చెందిన ప్రతిభ కనబరచిన విద్యార్థులకు విశిష్ట అతిథుల చేతుల మీదుగా పురస్కారాలను అందించారు.
సీఎస్ఐఆర్ స్థాపన దినోత్సవ వేడుకలలో భాగంగా, ఒక చైతన్య భరితమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుక సందర్భంగా నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుతులను పంపిణీ చేశారు. సాంస్కృతిక కార్యక్రమంలో ఎన్ఐఎస్‌సీపీఆర్ ఉద్యోగుల పిల్లలు, ఎస్ అండ్ టి, పరిపాలన విభాగం సిబ్బంది, విద్యార్థులు, ప్రాజెక్టు సిబ్బంది చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వారు ఆటపాటలను ప్రదర్శించారు. సీఎస్ఐఆర్-ఎన్ఐఎస్‌సీపీఆర్ లో ముఖ్య శాస్త్రవేత్త, ఎన్ఐఎస్‌సీపీఆర్ లో ఏర్పాటు చేసిన సీఎస్ఐఆర్ స్థాపక దినోత్సవ నిర్వాహక సంఘం చైర్ పర్సన్ శ్రీ ముఖేష్ పుండ్ వందన సమర్పణ చేశారు. ఆయన ఈ కార్యక్రమం నిర్వహణలో భాగం పంచుకొన్న అన్ని సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎస్ఐఆర్-ఎన్ఐఎస్‌సీపీఆర్ ఉద్యోగులు, వారి కుటుంబాలు, ఎసీఎస్ఐఆర్ విద్యార్థులు, ప్రాజెక్టు సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వివిధ ఉప సంఘాల సమన్వయకర్తలు వారికి అప్పగించిన పనులను చాలా చక్కగా పూర్తి చేశారు. పెయింటింగ్, డ్రాయింగ్ పోటీని డాక్టర్ పుష్పాంజలి త్రిపాఠీ, క్విజ్, వ్యాస రచన పోటీని డాక్టర్ మెహర్ వాన్ సమన్వయ పరచగా, బడ్జెట్-సభాస్థలి నిర్వహణ కార్యభారాన్ని డాక్టర్ నరేష్ కుమార్ వహించారు. సాంస్కృతిక-రంగస్థల నియంత్రణలను డాక్టర్ మనీష్ మోహన్ గోర్ సమన్వయ పరచగా, క్రీడల సంబంధి కార్యక్రమాలను డాక్టర్ విపన్ కుమార్, ప్రచార సామగ్రి సమన్వయ బాధ్యతను డాక్టర్ అరవింద్ మీనా సమన్వయం చేశారు. సిఎస్ఐఆర్ స్థాపక దినోత్సవ వేడుకలకు అతిథులను ఆహ్వానించడం సంబంధిత పనులను శ్రీమతి సోనాలి నాగర్ పర్యవేక్షించారు.
***
(Release ID: 2061010)
Visitor Counter : 96